అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అడ్డంగా బుక్కైన చంద్రబాబు.. చేతులెత్తి సీఎం జగన్‌కు మెక్కులు.. ‘టెంపరరీ’పై యూ టర్న్..

|
Google Oneindia TeluguNews

అమరావతిలో ఇప్పటిదాకా చేపట్టినవి తాత్కాలిక నిర్మాణాలు కావని, ముమ్మాటికీ శాశ్వత భవనాలేనంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన కామెంట్లు అసెంబ్లీలో దుమారం రేపాయి. తన హయాంలో కట్టినవాటికంటే బ్రహ్మాండమైన బిల్డింగ్ లను ఎవరూ కట్టలేరని ఆయన సవాలు చేశారు. అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లుపై చంద్రబాబు మాట్లాడినంత సేపూ అధికారపక్షం వైపు నుంచి అరుపులు, కేకలు వినిపించాయి.

బాబు భావోద్వేగం..

బాబు భావోద్వేగం..

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ చివరిదాకా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఒక దశలో తీవ్ర భావోద్వేగాకి లోనయ్యారు. ‘‘నాకంటే వయసులో చిన్నవాడే అయినా సీఎం జగన్ కు చేతులెత్తి మొక్కుతాను. దయచేసిన రాజధానిని ఇక్కడే ఉంచండి. మూడు రాజధానుల ఆలోచనను మానుకోండి. రాజధాని తరలింపుపై పునరాలోచించుకోండి..''అని ఒక్కతీరుగా వేడుకున్నారు. అంతకంటే మందు ఆయన ప్రసంగంలో రాష్ట్రప్రభుత్వానికి పలు సవాళ్లు విసిరారు.

నాకంటే బాగా చేస్తారా?

నాకంటే బాగా చేస్తారా?

‘‘రాష్ట్రప్రభుత్వం దగ్గర డబ్బులు లేవుకాబట్టి అమరావతి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం అంటున్నారు. ఇక్కడ అసెంబ్లీ ఉంది.. సెక్రటేరియట్ ఉంది.. హైకోర్టు కూడా ఉంది.. వీటిని ఎందుకు కొనసాగించరు.. ఇవి టెంపరరీ కాదు కదా.. దీనికంటే బ్రహ్మాండంగా మీరు కట్టగలరా? ట్రాన్సిట్ అన్నామేకానీ టెంపరరీ కాబోదని మేం ముందే చెప్పాం''అని చంద్రబాబు అనగానే సభ్యులందరూ ఒక్కసారే బిగ్గరగా నవ్వారు. ‘ఇది చంద్రబాబు ఇంకో యూటర్న్'అని వైసీపీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు.

శుక్రవారం కోర్టుకుపోయే మీకు సిగ్గులేదా?

శుక్రవారం కోర్టుకుపోయే మీకు సిగ్గులేదా?


‘‘నేనేదో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చేశానని అంటున్నారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే(ఆర్కే) సుప్రీంకోర్టుకు పోయినా ఏమీ చేయలేకపోయారు. అయినా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు పోయేవాళ్లు కూడా నీతులు చెప్పడానికి సిగ్గుగాలేదా? రాజధానికి అమరావతి అనువైనది కాదన్న వైసీపీ వాదనలకు గ్రీన్ ట్రిబ్యూనల్ తీర్పు చెంపపెట్టులాంటిది. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా రాజధానిని మార్చాలని అనుకున్నారా? సెటిలైపోయిన ఇష్యూని తిరగదోడటం ఎందుకు? ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ పోతారా?‘‘అని చంద్రబాబు నిలదీశారు. మధ్యలో స్పీకర్ జోక్యం చేసుకుంటూ.. ఇది రాజధాని మార్పు కాదు.. వికేంద్రీకరణ మాత్రమే అని సవరించారు.

సెంటర్ పాయింటే కరెక్ట్..

సెంటర్ పాయింటే కరెక్ట్..

రాజధాని సెంటర్ పాయింట్ లో ఉండాలన్న వాదన కరెక్టేనని, దేశం మూడుగా విడిపోకముందు ఢిల్లీ సెంటర్ పాయింట్ లోనే ఉండేదని, మద్రాస్ ప్రెసిడెంన్సీకి చెన్నై కేంద్రంగా ఉందేదని, చరిత్ర చదువుకోనివాళ్లు అడ్డగోలుగా మాట్లాడితే సమాధానం చెప్పలేమని చంద్రబాబు.. మంత్రి కొడాలి నానికి పరోక్షంగా చురకవేశారు.

రాజధానుల వల్ల ఏమీ బాగుపడదు..

రాజధానుల వల్ల ఏమీ బాగుపడదు..

ఒక ప్రాంతంలో రాజధాని పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, విశాఖలో రాజధాని పెట్టడం వల్ల ఉత్తరాంధ్రకు లాభం ఉండదని, కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నమే అయినా విజయవాడ అన్నిరంగాల్లో దూసుకెళ్లిందని, చిత్తూరులో చిత్తురు కంటే తిరుపతే అభివృద్ధి అయిందని, దేశరాజధాని ఢిల్లీలో ఉన్నా ఉత్తరాది కంటే దక్షణ రాష్ట్రాలే పురోగమించాయని చంద్రబాబు వివరించారు. కాగా, ప్రతిపక్ష నేత స్పీచ్ ఎంతకీ కంక్లూజన్ కు రాకపోవడంతో సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు.

English summary
Chandrababu another Uturn On Amaravati buildings, said, all Buildings In Amaravati are Permanent structures, not temporary. The ruling YSRCP criticizes his speech
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X