వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ అంటే లెక్కలేదా: మోడీకి బాబు మరో షాక్, బంద్‌పై యూటర్న్, కానీ, గల్లాకు 'ప్రత్యేక' ప్రశంస

|
Google Oneindia TeluguNews

Recommended Video

Union Budget 2018: TDP MPs Hold Black Ribbon Protest

అమరావతి/దుబాయ్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం దుబాయ్ నుంచి ఢిల్లీలోని టీడీపీ ఎంపీలతో, రాష్ట్రంలోని టీడీపీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ఏపీ కోసం ధర్మపోరాటం చేస్తున్నామని చెప్పారు.

తలుపులేసి ఏపీని విభజించారు, మీ అవమానంవల్లే ఎన్టీఆర్ పార్టీ: లోకసభలో మోడీ సంచలనం, ఎంపీలపై అసహనంతలుపులేసి ఏపీని విభజించారు, మీ అవమానంవల్లే ఎన్టీఆర్ పార్టీ: లోకసభలో మోడీ సంచలనం, ఎంపీలపై అసహనం

పార్లమెంటులో నిరసనలు కొనసాగించాల్సిందేనని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. నిరసనలు ఉధృతం చేయాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోను తగ్గవద్దని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్రానికి లెక్కలేనప్పుడు మనం పోరాటం చేయాల్సిందేనని సూచించారు.

 పార్లమెంటులో తగ్గొద్దు

పార్లమెంటులో తగ్గొద్దు

ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంలో ఉపయోగపడే అంశం ఒక్కటీ లేదని చంద్రబాబు అన్నారు. కాబట్టి పార్లమెంటులో తగ్గవద్దని చెప్పారు. విభజనకు లేని ఫార్ములా లోటు బడ్జెట్‌కా కావాలా అని మండిపడ్డారు. మనం విభజన సమయంలో ఇచ్చిన హామీలను అడుగుతున్నామని చెప్పారు.

 అన్ని పార్టీల మద్దతు కూడగట్టండి

అన్ని పార్టీల మద్దతు కూడగట్టండి

మోడీ ప్రసంగంలో ఏమీ లేదని భావిస్తున్న చంద్రబాబు బీజేపీకి మరో షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఢిల్లీలో అన్ని పార్టీలకు వివరించాలని చంద్రబాబు నేతలకు సూచించడం గమనార్హం. పార్లమెంటులో అన్ని పార్టీల మద్దతును కూడగట్టాలని కూడా ఎంపీలకు దిశానిర్దేశనం చేశారు. అంతేకాదు, అందరికీ అర్థమయ్యేలా ఏపీకి జరిగిన అన్యాయంపై బుక్ లెట్స్ పంచాలని చెప్పారు.

ఏపీ దేశంలో భాగం కాదా

ఏపీ దేశంలో భాగం కాదా

మనం తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నామని చంద్రబాబు అన్నారు. ఏపీకి సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎంపీలు అందరూ బలంగా మన వాయిస్ వినిపించాలని చెప్పారు. మన పోరాటాన్ని జాతీయస్థాయికి తీసుకు వెళ్లాలని చెప్పారు.

అంతా చిదంబరం వల్లే

అంతా చిదంబరం వల్లే

ఒక సభలో ప్రకటన చేస్తే సరిపోదని, రెండు సభల్లో చేయాలన్నారు. చిదంబరం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ.. మీ వల్లే ఏపీకి ఈ దుస్థితి వచ్చిందని, ఇప్పటికైనా పాపం కడుక్కోమని తాను చిదంబరానికి చెప్పానని చంద్రబాబుకు చెప్పారు. తనకు సభలోకి వెళ్లే అవకాశం లేదని సీఎం రమేష్ చెప్పడంతో.. గాంధీ విగ్రహం వద్ద లేదా సెంట్రల్ హాలులో కూర్చొని నిరసన తెలపాలని సూచించారు.

 బంద్‌పై బాబు యూటర్న్

బంద్‌పై బాబు యూటర్న్

బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ విపక్షాలు ఏపీలో బందుకు పిలుపునిచ్చాయి. బంద్ నేపథ్యంలో స్కూల్స్, ఆఫీస్‌లు మూతపడ్డాయి. విపక్షాలన్నీ పాల్గొన్నాయి. బందు వద్దని తొలుత టీడీపీ విజ్ఞప్తి చేసింది. అయితే ఓ విధంగా ఈ విషయంలో చంద్రబాబు కొంత యూటర్న్ తీసుకున్నారని చెప్పవచ్చు. సభలో మన ఎంపీల పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలో శాంతియుత నిరసనలు చేపట్టాలని టీడీపీ నేతలకు బాబు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు శాంతియుత నిరసనలు చేపట్టారు. మంత్రులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. కాగా, ఢిల్లీలో ఎంపీలు గురువారం నల్ల రిబ్బన్లతో నిరసన తెలపనున్నారు.

 టీడీపీ ఎంపీలకు చంద్రబాబు అభినందన

టీడీపీ ఎంపీలకు చంద్రబాబు అభినందన

కాగా, గురువారం చంద్రబాబు టీడీపీ ఎంపీలను అభినందించారు. ఉభయసభల్లోని ఆందోళనపై ఆయన కితాబిచ్చాు. ముఖ్యంగా గల్లా జయదేవ్ ప్రసంగాన్ని ప్రశంసించారు. ఉభయ సభల్లో ఎంపీలు బాగా పని చేశారని కితాబిచ్చారు. మనం ఎవరికీ భయపడాల్సిన పని లేదని, ప్రతిపక్షం ముందుండి పోరాటం చేస్తుందని, కానీ కేసుల భయంతో వైసీపీ దూరంగా ఉంటోందని, మనం పోరాటం చేయాలన్నారు.

 జైట్లీ మాట్లాడుతుంటే ఆందోళనలు

జైట్లీ మాట్లాడుతుంటే ఆందోళనలు

అరుణ్ జైట్లీ మాట్లాడుతుంటే ఆందోళనలు చేయాలని చంద్రబాబు ఎంపీలకు చెప్పారు. పార్లమెంటు వ్యవహారాలను పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. జైట్లీ మాట్లాడేటప్పు నినాదాలు చేయాలని సూచించారు. ఏమాత్రం తగ్గవద్దన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu fired at Union Government for PM Narendra Modi's speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X