వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా ప్రాంతాలకు వెళ్తామని ఎమ్మెల్యేలు, నంద్యాలకు వెళ్లాలని చంద్రబాబు

దాదాపు నెల రోజుల పాటు తమ తమ నియోజకవర్గాలకు దూరంగా ఉన్నామని పలువురు టిడిపి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అన్నారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Chandrababu Naidu ordered party MLA's and Ministers to Visit Nandyal

అమరావతి: దాదాపు నెల రోజుల పాటు తమ తమ నియోజకవర్గాలకు దూరంగా ఉన్నామని పలువురు టిడిపి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అన్నారు.

ఇదీ జగన్, నవ్వుతారేమో: రోజా చెప్పిన నిజాలు! 'ఒక్కొక్కడ్ని ఆడుకుంటామని అంటాడు'ఇదీ జగన్, నవ్వుతారేమో: రోజా చెప్పిన నిజాలు! 'ఒక్కొక్కడ్ని ఆడుకుంటామని అంటాడు'

దానికి ఆయన స్పందిస్తూ.. మీ నియోజకవర్గం ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకుంటారని, శుక్రవారం నంద్యాల వెళ్లాలని సూచించారు. ఉపఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ప్రజలకు భరోసా కల్పించాలన్నారు.

చంద్రబాబు నాయుడు బుధవారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాలలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో జాబితా సిద్ధం చేసి తనకు అందించాలని నాయకులను ఆదేశించారు.

ఎమ్మెల్యేల విజ్ఞప్తి ఇలా

ఎమ్మెల్యేల విజ్ఞప్తి ఇలా

అక్కడ ఉప ఎన్నిక కోసం పని చేసిన వారంతా శుక్రవారం నంద్యాల వెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్న భరోసా ఇవ్వాలన్నారు. తాము దాదాపు నెల రోజుల నుంచి నియోజకవర్గాలకు దూరంగా ఉన్నామని, ఇప్పుడు తమ నియోజకవర్గాలకు వెళ్తామని, కొన్ని రోజుల విరామం తర్వాత నంద్యాల వెళ్తామని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చెప్పారు.

మీకోసం తిరిగితే ఇబ్బంది కానీ

మీకోసం తిరిగితే ఇబ్బంది కానీ

దానిపై చంద్రబాబు స్పందించారు. ఇది పార్టీని పటిష్ఠం చేసేందుకు మీరు చేస్తున్న త్యాగమని, మీ నియోజకవర్గాల ప్రజలు మిమ్మల్ని అర్ధం చేసుకుంటారని, ఇప్పటికే చాలామంది మిమ్మల్ని అభినందించి ఉంటారని, మీరు నియోజకవర్గాన్ని వదిలేసి సొంత పనుల కోసం తిరుగుతుంటే ప్రజలు ఇబ్బంది పడతారు తప్ప, పార్టీ కోసం కష్టపడుతుంటే అందరూ అభినందిస్తారని చెప్పారు.

ఇంకోరోజు ఉండి బుక్ తయారు చేయాలి

ఇంకోరోజు ఉండి బుక్ తయారు చేయాలి

నంద్యాల ఉప ఎన్నిక 2019 సార్వత్రిక ఎన్నికలకు ఓ ప్రీ ఫైనల్‌గా భావించారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో మరో రోజు ఉండి అయినా సరే మొత్తం సమాచారం క్రోడీకరించి పుస్తకం తయారు చేయాలని సూచించారు.

భూమా విజ్ఞప్తికి బాబు ఓకే, సూచన

భూమా విజ్ఞప్తికి బాబు ఓకే, సూచన

సెప్టెంబరు 4, 5 తేదీల్లో వర్క్ షాప్‌ నిర్వహించే సమయానికి పుస్తకం సిద్ధం కావాలని చంద్రబాబు చెప్పారు. నాయకులంతా వస్తున్నారు కాబట్టి విజయోత్సవ సభ పెట్టుకుంటామని నంద్యాలలో గెలిచిన భూమా బ్రహ్మానంద రెడ్డి అన్నారు. అభ్యంతరం లేదని, కానీ పుస్తకానికి సంబంధించిన సమాచార సేకరణ, స్థానిక నాయకుల్ని అభినందించడం వంటి కార్యక్రమాలు పూర్తయిన తర్వాతే పెట్టుకోవాలని చంద్రబాబు సూచించారు. వియోజత్సవ సభ పేరుతో అసలు పని పక్కన పెట్టవద్దన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister and TDP leader Nara Chandrababu Naidu on wednesday ordered party mlas and ministers to visit Nandyal on friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X