వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపితో తాడోపేడో, నిరసనలు మరింత తీవ్రం: బాబు ఆదేశం

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీకి నిధుల కేటాయింపు విషయమై కేంద్రంపై ఒత్తిడిని కొనసాగించాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు సూచించారు. శుక్రవారం ఉదయం పూట మరోసారి పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై టెలికాన్పరెన్స్‌లో దిశానిర్ధేశం చేయనున్నారు చంద్రబాబునాయుడు. బిజెపితో పొత్తుపై కూడ ఈ సమావేశంలో ఎంపీలతో చంద్రబాబునాయుడు చర్చించారు.

Recommended Video

TDP-Congress Alliance : Sonia Gandhi's Support To TDP

బడ్జెట్ ఎఫెక్ట్: ఎంతో కాలం మోసం చేయలేరు,అరుణ్ జైట్లీతో సుజనా వాగ్వాదంబడ్జెట్ ఎఫెక్ట్: ఎంతో కాలం మోసం చేయలేరు,అరుణ్ జైట్లీతో సుజనా వాగ్వాదం

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వానికి ఆరకొర నిధుల కేటాయింపు విషయమై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టిడిపి ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో తమ నిరసనను కొనసాగిస్తున్నారు.

అంతా అయిపోయింది, చిన్న చూపు, ఏం చేద్దాం?: టిడిపి ఎంపీలుఅంతా అయిపోయింది, చిన్న చూపు, ఏం చేద్దాం?: టిడిపి ఎంపీలు

గురువారం నాడు లోక్‌సభలో అరుణ్ జైట్లీ ప్రకటనపై కొంత రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతోందని భావించినా టిడిపి నేతలకు నిరాశే మిగిలింది.

ఓపిక నశించింది: సీఎం రమేష్ సంచలనం, రాజీనామాకు సుజనా రెడీఓపిక నశించింది: సీఎం రమేష్ సంచలనం, రాజీనామాకు సుజనా రెడీ

అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత టిడిపి అధినేత చంద్రబాబునాయుడుతో సంప్రదింపుల కోసం టిడిపి ఎంపీలు ఫోన్‌లో కాంటాక్ట్ చేశారు. కానీ, బాబు వారికి అందుబాటులోకి రాలేదు. అయితే గురువారం రాత్రి పది గంటల సమయంలో బాబు టిడిపి ఎంపీలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ వద్దు

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ వద్దు

ఏపీ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదని ఏపీ సీఎం చంద్రబాబుానయుడు పార్టీ ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు.గురువారం నాడు పార్లమెంట్ ఉభయ సభల్లో చోటు చేసుకొన్న పరిణామాలను పార్టీ ఎంపీలు బాబుకు ఫోన్లో వివరించారు. ఫిబ్రవరి 9వ, తేదిన జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బాబు చర్చించారు. రాష్ట్రానికి నిధులను రాబట్టే విషయంలో కేంద్రంపై ఒత్తిడిని కొనసాగించాలని పార్టీ ఎంపీలను చంద్రబాబునాయుడు ఆదేశించారు.

బిజెపితో పొత్తు విషయమై ఎంపీలతో బాబు చర్చ

బిజెపితో పొత్తు విషయమై ఎంపీలతో బాబు చర్చ

బిజెపితో పొత్తు విషయమై పార్టీ ఎంపీలతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చర్చించారు.సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఏపీ ప్రజల అసంతృప్తిని పార్లమెంట్ వేదికగా కొనసాగించాలని బాబు ఆదేశించారు. మిత్రపక్షంగా ఉన్నప్పటికీ తమ డిమాండ్లపై బిజెపితో పొత్తు విషయమై చర్చించారు. పొత్తును తెంచుకోవాలనే అభిప్రాయాన్ని ఎంపీలు వ్యక్తం చేశారు. అయితే బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేనాటికి ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.అయితే ఇప్పటికిప్పుడే పొత్తును తెంచుకొనే అవకాశం లేదనేది సమాచారం. ఏపీ రాష్ట్రానికి చెందిన అధికారులు ప్రస్తుతం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నారు.అధికారుల నివేదికల తర్వాత బిజెపితో పొత్తుపై బాబు నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదంటున్నారు నేతలు.

టిడిపి ఎంపీల ఆందోళనలు తీవ్రం

టిడిపి ఎంపీల ఆందోళనలు తీవ్రం

ఫిబ్రవరి 9వ, తేదిన పార్లమెంట్ ఉభయసభల్లో టిడిపి ఎంపీలు నిరసన జోరును కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. కేంద్రం తీరుతో తెలుగు ప్రజలను రెచ్చగొట్టేరీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని టిడిపి నేతలు భావిస్తున్నారు.అరుణ్ జైట్లీ, సుజనా చౌదరికి మధ్య జరిగిన గొడవల విషయాన్ని కూడ బాబుకు వివరించారు. బిజెపి నేతలు అనుసరిస్తున్న విధానాలపై బాబుతో పాటు టిడిపి ఎంపీలు కూడ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

బిజెపితో తాడోపేడో తేల్చుకోవాలని టిడిపి యత్నం

బిజెపితో తాడోపేడో తేల్చుకోవాలని టిడిపి యత్నం

నాలుగేళ్ళు దాటినా ఏపీకి ఇచ్చిన హమీలను నెరవేర్చకపోతే ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలతో అన్నారు.ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని పార్టీ ఎంపీలకు బాబు దిశానిర్ధేశంచేశారు. నిరసనలను మరింత ఉధృతం చేయాలని బాబు సూచించారు.ఫిబ్రవరి 9వ, తేది ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే సమయానికి మరోసారి టెలికాన్పరెన్స్ నిర్వహించనున్నట్టు బాబు చెప్పారు.

English summary
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has instructed the party MPs from his Telugu Desam Party to continue protests in parliament and keep pressuring the Central government to make a substantive announcement for the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X