వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు వెన్నుపోటుకు 25 ఏళ్ళు - ఎన్టీఆర్ సస్పెన్షన్ ఎత్తేస్తారా? - విజయసాయిరెడ్డి -అప్పుడేమైందంటే

|
Google Oneindia TeluguNews

వెన్నుపోటు.. ఎన్టీఆర్ పదవీచ్యుతుడైన తర్వాత తెలుగు గడ్డపైనేకాదు, దేశవ్యాప్తంగానూ బాగా పాపులరైన పదం. టీడీపీ ప్రస్తుత అధినేత చంద్రబాబును విమర్శించే ప్రతి సందర్భంలోనూ ప్రత్యర్థులు వాడే రాజకీయ అస్త్రం. కనీవినీ ఎరుగని నాటకీయ పరిణామాల మధ్య ఎన్టీఆర్ పదవి కోల్పోయి, పార్టీతోపాటు అధికారపగ్గాలూ చంద్రబాబు హస్తగతమైన నాటి ఘటనకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనూహ్య కామెంట్లు చేశారు.

అమెరికా ఎన్నికల్లో మోదీ హల్‌చల్ - ట్రంప్ తొలి ప్రచారంలో హైలైట్ - కమలపై కమలం రుసరుసఅమెరికా ఎన్నికల్లో మోదీ హల్‌చల్ - ట్రంప్ తొలి ప్రచారంలో హైలైట్ - కమలపై కమలం రుసరుస

వెన్నుపోటుకు 25 ఏళ్లు..

వెన్నుపోటుకు 25 ఏళ్లు..

‘‘25 సంవత్సరాల క్రితం ఇదే రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్తాపకులు ఎన్టీఆర్ గారిని చంద్రబాబు అండ్ కో వెన్నుపోటు పొడిచి, పార్టీ నుంచి ఆయన్ని బహిష్కరించి, పార్టీ పగ్గాలు లాక్కుని, ఎన్టీఆర్ గారిని అవమానించారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ గారి మీద సస్పెన్షన్ ఎత్తేస్తారేమో చూడాలి''అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి కొద్దినిమిషాల ముందు, ఆంధ్రకేసరి జయంతి సందర్భంగా మరో ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ.. నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా పోరాడే నాయకులు రాజకీయాల్లో అరుదని, అలాంటి దమ్మున్న నేతల్లో తొలితరం నాయకుడు టంగుటూరి ప్రకాశం కాగా, ఇప్పుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు.

జగన్ వికృత క్రీడకు 85 మంది బలి - పైసా లేకుండా పాలనన్న టీడీపీ - విజయసాయిరెడ్డి మళ్లీ వేశారుజగన్ వికృత క్రీడకు 85 మంది బలి - పైసా లేకుండా పాలనన్న టీడీపీ - విజయసాయిరెడ్డి మళ్లీ వేశారు

అసలైన తమ్ముళ్లు క్షమించబోరు..

అసలైన తమ్ముళ్లు క్షమించబోరు..

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని నిజమైన తెలుగు తమ్ముళ్లు ఏనాటికీ మరిచిపోలేరని, ఆయనను ఎన్నటికీ క్షమించబోరని సాయిరెడ్డి అన్నారు. వెన్నుపోటు ఘటనకు 25 ఏళ్లు పూర్తయ్యాయని గుర్తుచేసిన ఆయన.. ఇప్పటికీ చంద్రబాబు సిగ్గులేకుండా ఎన్టీఆర్ వారసత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు.

అప్పుడేం జరిగిందంటే..

అప్పుడేం జరిగిందంటే..

పడిలేచిన కెరటంలా ఎన్టీఆర్ సారధ్యంలోని టీడీపీ 1994 అసెంబ్లీ ఎన్నికల్లో 216 సీట్లతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. కాగా, పార్టీ నిర్ణయాలతోపాటు ప్రభుత్వ వ్యవహారాల్లోనూ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి జోక్యం పెరిగిపోయిందని, తద్వారా అందరికీ నష్టం జరుగుతుందని చంద్రబాబు వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. 1995 ఆగస్టు చివరివారంలో వ్యవహారం ముదిరిపాకనపడింది. ఆగస్టు 24న ఎన్టీఆర్ పై సస్పెన్ వేటువేసి, చంద్రబాబే టీడీఎల్పీ నేత అనే ప్రకటన విడుదలైంది. ఆ తర్వాత వైస్రాయ్ హోటల్ వేదికగా ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. అయితే, తన ఎమ్మెల్యేలను చంద్రబాబు బంధించారంటూ, వాళ్లను విడిపించడం కోసం ఎన్టీఆర్ ఆగస్టు 27న వైస్రాయ్ హోటల్ కు వెళ్లారు. అనూహ్యరీతిలో ఆయనపై చెప్పుల దాడి జరిగింది. 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశారు. అయితే, వెన్నుపోటు దినంగా ఏ తేదీని గుర్తించాలనేదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి.

Recommended Video

RRR : Rajamouli చెప్పకముందే Alia Bhatt తప్పుకుందా? ఆలియా లేకపోవడమే మంచిదంటున్న ఫ్యాన్స్ || Oneindia
ఔరంగజేబుతో చంద్రబాబుకు పోలిక..

ఔరంగజేబుతో చంద్రబాబుకు పోలిక..

వెన్నుపోటు ఎపిసోడ్ తర్వాత తీవ్రంగా కుంగిపోయిన ఎన్టీఆర్ నాలుగు నెలల తర్వాత కన్నుమూశారు. ఈ వ్యవధిలో అల్లుడు ఎలా మోసం చేసిందీ, తానెంత మానసిక క్షోభను అనుభవించిందీ స్వయంగా ఎన్టీఆర్ ‘జామాత దశమ గ్రహం' అనే వీడియో క్యాసెట్ రూపొందించారు. పలు ఇంటర్వ్యూల్లోనూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మోఘల్ పాలకుల్లో కౄరుడిగా పేరుపొందిన ఔరంగజేబు అధికారంలోకి రావడానికి తండ్రి షాజహాన్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేసి, చెరసాలలో బంధించాడని, సోదరులైన దారాషికో, మురాద్, షాషుజాలతో విడివిడిగా మంత్రాంగం నెరిపి ముగ్గురినీ అంతం చేశాడని, సోదరి జహనారాపైనా హత్యాయత్నం చేశాడని గుర్తుచేసిన ఎన్టీఆర్.. చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చారు. కాగా, నాటి తన ప్రయత్నం చారిత్రక అవసరమని చంద్రబాబు సమర్థించుకుంటారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ సైతం ‘ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు' అంశాన్ని లేవనెత్తడం తెలిసిందే.

English summary
ysrcp mp vijayasai reddy remembers that The Great Betrayal of NTR turned 23 yesrs. ia tweet on sunday, sai reddy slams chandrababu, says Real TDP followers would never forgive CBN for his heinous power mongering. The same CBN is shamelessly trying to inherit NTR’s legacy, mp added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X