'డిక్టేటర్'కు ఫ్యాన్స్ జేజేలు, బోగిమంట వేసిన చంద్రబాబు (పిక్చర్స్)
చిత్తూరు: ఏపీ సీం నారా చంద్రబాబు నాయుడు ఇంట సంక్రాంతి సంబరాలకు కుటుంబ సభ్యులతో వచ్చిన హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ శుక్రవారం ఉదయం పది గంటలకు నారావారిపల్లిలోని చంద్రబాబు ఇంటి ఆవరణలోకి చేరుకున్నారు.
దీంతో అభిమానులు, తెలుగు యువత పోటాపోటీగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి 'బాగున్నారా' అంటూ అభిమానుల భుజాలపై చేతులు వేసి ఫొటోలు దిగారు. దీంతో అభిమానులు ఆనందంతో బాలయ్యకు జేజేలు పలికారు.
ఈ సందర్భంగా పలువురు ఆయనకు వినతిపత్రాలు సమర్పించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకులు, అభిమానులను చూసి తనదైన శైలిలో ఉత్సాహ పరిచారు.

సంక్రాంతి సంబరాలు
మనం చేసే కర్మ ఫలాలే భవిష్యత్తు తరాలు అనుభవిస్తామని స్వామి వివేకానంద చెప్పిన సూక్తి అక్షర సత్యమని, అందుకే ఇప్పుడు మనం మంచి పనులు చేస్తే అవి భవిష్యత్తు తరాల వారికి అంది మేలు చేస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు.

సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలు నారావారి పల్లెకు విచ్చేసిన సిఎం చంద్రబాబు శనివారం తిరుగు ప్రయాణం అవడానికి ముందు విలేతరులతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలతో నేడు అంతా కష్టాలను అనుభవిస్తున్నామన్నారు.

సంక్రాంతి సంబరాలు
ఈ పరిస్థితి పునరావృతం కాకూడదనే రాష్ట్ర విభజన జరిగి ఎన్ని రకాల ఆర్థిక లోట్లు ఉన్నా ప్రజలకు మంచి కార్యక్రమాలను అందించేందుకు వెనుకాడడం లేదన్నారు. తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా శాశ్వత ప్రయోజనాలపై దృష్టి పెట్టి అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

సంక్రాంతి సంబరాలు
ఇందులో భాగంగా నీరు - చెట్టు, నీరు - ప్రగతి కార్యక్రమాలు చేపట్టామని తద్వారా భూగర్భ జలాలను పెంపొందించగలిగామన్నారు. 33 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు 10.9 మీటర్లకు చేరుకుందన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications