వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఒక్కరోజులో.. కిరణ్ కుమార్ రెడ్డి రికార్డ్ బ్రేక్ చేసిన చంద్రబాబు నాయుడు'

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రికార్డ్ బ్రేక్ చేశారని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం నాడు ఎద్దేవా చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రికార్డ్ బ్రేక్ చేశారని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం నాడు ఎద్దేవా చేశారు. చంద్రబాబు అంకెల గారడీతో మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రోజులో రూ.6.50 లక్షల కోట్ల ఎంవోయులు చేస్తే, చంద్రబాబు ఒక్క రోజులో రూ.10.50 లక్షల కోట్ల ఎంవోయులు చేశారని విమర్శించారు. విద్యుత్ పైన ఎంవోయులు ఎందుకో అర్థం కాదన్నారు.

<strong>అందంగా ఉంటాడని జగన్‌కు అహంకారం, అందరూ చూశారు: ఏకేసిన దేవినేని</strong>అందంగా ఉంటాడని జగన్‌కు అహంకారం, అందరూ చూశారు: ఏకేసిన దేవినేని

Chandrababu breaks Kiran Reddy's record

అదనంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను అమ్ముకోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని చెప్పుకోవడాన్ని బుగ్గన తప్పుబట్టారు.

ఏపీకి వచ్చిన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు చెప్పేవన్నీ దొంగ లెక్కలే అన్నారు. రెండేళ్లలో రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారని, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

English summary
YSR Congress Party leader Buggana Rajendranath Reddy on Monday said that CM Chandrababu break former CM Kiran Reddy's record.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X