వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానిపై కమిటీ ఎందుకు? అమరావతి రైతుల ముందుకు వస్తారా ? ... చంద్రబాబు, బుద్దా ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధానిపై మంత్రి బొత్సా సత్యన్నారాయణ చేసిన వ్యాఖ్యలతో మరోమారు దుమారం లేచింది. రాజధానికి ఏ ప్రాంతం అనువైనదో నిపుణుల కమిటీ నిర్ణయిస్తుందని, నిపుణుల కమిటీ రాజధాని అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుందని బొత్సా చేసిన వ్యాఖ్యలు మరోమారు రాజధాని విషయంలో అనిశ్చితికి కారణం అయ్యాయి . ఇక ఈ నేపధ్యంలో రాజధాని అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు చంద్రబాబు. ఇక విజయసాయిపై మండిపడ్డారు బుద్దా వెంకన్న .

రాజధాని నిర్మాణంపై ప్రజలకు స్పష్టత ఉంది... చంద్రబాబుకే లేదు: బోత్సరాజధాని నిర్మాణంపై ప్రజలకు స్పష్టత ఉంది... చంద్రబాబుకే లేదు: బోత్స

రాజధానిగా అమరావతినే సరైందన్న చంద్రబాబు

రాజధానిగా అమరావతినే సరైందన్న చంద్రబాబు

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తాను చేసిన ట్వీట్ లో అమరావతినే రాజధానికి సరైనదని పేర్కొన్నారు. ఇప్పుడు అసలు ఎందుకు రాజధాని విషయమో నిపుణుల కమిటీని వేశారో అర్ధం కాలేదన్నారు. రాష్ర్టం నడిబొడ్డున, నది ఒడ్డున అందరికీ అందుబాటులో ఉండాలని అమరావతిని రాజధానిగా నిర్ణయించామన్నారు. అప్పుడు అసెంబ్లీ సాక్షిగా జగన్‌ కూడా స్వాగతించారని మాజీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. శివరామకృష్ణన్‌ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణలో కూడా అమరావతినే అనుకూల ప్రాంతంగా ధృవీకరించిందన్నారు. అందుకే అక్కడ రాజధాని నిర్మాణం జరుపుతున్నామని పేర్కొన్నారు.

 మోడీ శంకుస్థాపన చేసిన ఇంతకాలానికి రాజధానిపై కమిటీనా ?

మోడీ శంకుస్థాపన చేసిన ఇంతకాలానికి రాజధానిపై కమిటీనా ?

అలాగే ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసి కొంత నిర్మాణాలు సైతం జరిగిన నాలుగేళ్ల తరువాత మళ్లీ రాజధాని నిర్ణయంపై కమిటీ వేయడం ఏంటి..? అని ఆయన ప్రశ్నించారు. అంతే కాదు రాష్రంలో రెవెన్యూ లోతులో ఉందని హైకోర్టు వద్ద తాగడానికి టీ కూడా లేని పరిస్థితి అని చేసిన వ్యాఖ్యలు మీకు తలవంపులుగా లేవా..? అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి రాజధాని నిర్మించే సత్తా లేదు అని ఆయన ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు .

రాజధాని రైతుల ముందుకు వస్తారా అని బుద్దా సవాల్

రాజధాని రైతుల ముందుకు వస్తారా అని బుద్దా సవాల్


రాజధాని నిర్మించేసత్తా లేదన్న విషయాన్ని ప్రజల ముందు ఒప్పుకునే నిజాయితీ లేదని వ్యాఖ్యానించారు. అందుకే రాజధానిపై అటూ ఇటూ చర్చలు లేపుతున్నారని, అయోమయానికి గురి చేస్తున్నారని ఘాటుగా ట్వీట్ చేశారు మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక బుద్దా వెంకన్న సైతం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. రాజధాని విషయంలో చాలా ఘాటుగా స్పందించిన ఆయన దమ్ముంటే రాజధాని రైతుల ముందుకు వచ్చి మాట్లాడాలన్నారు.

 అమరావతి విలువ తెలుసా అని విజయసాయిపై బుద్ధా ఆగ్రహం

అమరావతి విలువ తెలుసా అని విజయసాయిపై బుద్ధా ఆగ్రహం

బిచ్చగాళ్ల దగ్గర చిల్లర కొట్టేసే నీకు అమరావతి విలువ ఏమి తెలుస్తుంది విజయసాయి రెడ్డి అంటూ ట్వీట్ చేశారు . మాజీ సీఎం చంద్రబాబు 5 సంవత్సరాలు కష్టపడి అమరావతికి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారన్న బుద్దా 5 నెలల్లో మీ తుగ్లక్ ముఖ్యమంత్రి జగన్ అమరావతిని ఎడారిని చేశాడని మండిపడ్డారు . నీకే కనుక ధైర్యం ఉంటే అమరావతికి భూములిచ్చిన రైతుల ముందుకు వచ్చి మీ వైసీపీ పార్టీ అసలు అమరావతికి అనుకూలమో, కాదో చెప్పండి చాలు. మిగిలిన విషయాలు రైతులు చూసుకుంటారని సవాల్ విసిరారు. ఇక ఈ నేపధ్యంలో విజయసాయి ఏం చెప్తారో తెలియాల్సి ఉంది.ఇప్పటికే పలుమార్లు రాజధాని అంశంపై రగడ కొనసాగిన నేపధ్యంలో తాజాగా మరోమారు చెలరేగిన ఈ వివాదం మరే రూపు తీసుకుంటుందో వేచి చూడాలి .

English summary
Minister Botsa Satyanarayana's comments on the AP capital once again got worse. Botsa's remarks that the Expert Committee will decide which area of ​​capital is appropriate and that the Expert Committee will hold a referendum on the subject of capital has once again caused uncertainty in the Capital. Chandrababu reacted to the capital issue in a Twitter platform. Budda Venkanna aslo outrage on the ycp mp Vijayasai about capital issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X