వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మైక్రోసాఫ్ట్!: బాబుకు బిల్ గేట్స్ హామీ, సత్య నాదెళ్లకు ప్రశంస

By Srinivas
|
Google Oneindia TeluguNews

దావోస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా, యాప్స్, సాఫ్టువేర్ అభివృద్ధి, ఆరోగ్యం, ఇమ్యూనైజేషన్ అంశాల్లో సహకరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ హామీ ఇచ్చారు. ఏపీలో మైక్రోసాఫ్ట్ కేంద్రం ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరగా.. పరిశీలిస్తామని చెప్పారు. చంద్రబాబును బిల్ గేట్స్ విందుకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించుకున్నారు.

చంద్రబాబు దావోస్ వచ్చారని విషయం తెలియగానే గురువారం తార్తే ఆయనతో గేట్స్ సమావేశం అయ్యేందుకు ప్రయత్నించారు. అప్పటికే చంద్రబాబు విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లడంతో శుక్రవారం ఉదయం స్వయంగా చొరవ తీసుకొని చంద్రబాబుతో భేటీ అయ్యారు. విందు సమయంలో వారి మధ్య నలభై నిమిషాల పాటు చర్చ సాగింది. మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగు వాడైన సత్య నాదెళ్ల ఉండటం ప్రతి తెలుగు వాడికి గర్వకారణమని బాబు అన్నారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను చెప్పారు. డిజిటల్‌ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను బిల్‌గేట్స్‌కు చంద్రబాబు వివరించారని సమాచారం. కొత్త రాష్ట్రంలో సాప్ట్‌వేర్‌, ఐటీ అభివృద్ధికి తమ ప్రభుత్వం రూపొందించిన ఎలక్ర్టానిక్‌ పాలసీలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

బిల్ గేట్స్, చంద్రబాబు

బిల్ గేట్స్, చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ విందుకు అహ్వానించారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించుకున్నారు.

బిల్ గేట్స్, చంద్రబాబు

బిల్ గేట్స్, చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా, యాప్స్, సాఫ్టువేర్ అభివృద్ధి, ఆరోగ్యం, ఇమ్యూనైజేషన్ అంశాల్లో సహకరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ హామీ ఇచ్చారు.

చంద్రబాబు, సత్య నాదెళ్ల

చంద్రబాబు, సత్య నాదెళ్ల

సత్య నాదెళ్ల, బిల్ గేట్స్ సహకారం ఉంటే రాష్ర్టాన్ని డిజిటల్‌ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దగలమన్న విశ్వాసాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు.

చంద్రబాబు, సత్య నాదెళ్ల

చంద్రబాబు, సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగు వాడైన సత్య నాదెళ్ల ఉండటం ప్రతి తెలుగు వాడికి గర్వకారణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు, సత్య నాదెళ్ల

చంద్రబాబు, సత్య నాదెళ్ల

సత్య నాదెళ్ల, బిల్ గేట్స్ సహకారం ఉంటే రాష్ర్టాన్ని డిజిటల్‌ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దగలమన్న విశ్వాసాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు.

ఐటీలో రూ.12 వేల కోట్లు, ఎలక్ర్టానిక్‌ తయారీ రంగంలో రూ.30 వేల కోట్లు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విశాఖపట్నం, తిరుపతి నుంచి అనంతపురం వరకూ రెండు ఐటీఐఆర్‌లు, రాష్ట్రవ్యాప్తంగా పది ఐటీ హబ్‌లు, 20 ఎలక్ర్టానిక్‌ తయారీ క్లస్టర్లను నెలకొల్పి ఐదు లక్షల ఉద్యోగాలను కల్పించాలని రోడ్‌ మ్యాప్‌ తయారు చేశామని వివరించారు.

సత్య నాదెళ్ల, బిల్ గేట్స్ సహకారం ఉంటే రాష్ర్టాన్ని డిజిటల్‌ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దగలమన్న విశ్వాసాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు.

దావోస్ సదస్సులో చంద్రబాబును చూసి బిల్‌గేట్స్‌ ఆనందం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మళ్లీ ముఖ్యమంత్రి అయినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా, గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి చేసిన కృషిని, అందుకు బిల్‌గేట్స్‌ తోడ్పాటును చంద్రబాబు గుర్తు చేశారు. అప్పటి పరిణామాలను ఇద్దరూ నెమరువేసుకున్నారు.

కాగా, నాలుగు రోజుల దావోస్‌ సదస్సు విజయవంతంగా ముగిసింది. వెల్స్‌పన్‌ సంస్థల అధినేత గోయెంకాతో చంద్రబాబు భేటీ సందర్భంగా వినియోగదారులకు ఎలాంటి అవసరాలు ఉంటాయనే దానిపై చర్చించారు. భారతి (ఎయిర్‌టెల్‌) గ్రూపు అధినేత సునీల్‌ మిట్టల్‌తో సమావేశమైన చంద్రబాబు.. ఏపీలో 4జి సేవలు అందించాల్సిందిగా ఆహ్వానించడంతో అందుకు ఆయన అంగీకరించారు. మరోవైపు చంద్రబాబు తన పర్యటనను ఒకరోజు పొడిగించుకున్నారు.

English summary
On the final day of his Davos trip, Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu was taken by surprise when he bumped into Microsoft founder Bill Gates on Friday at the World Economic Forum Annual Summit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X