వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్జీవి వ‌ర్సెస్ చంద్ర‌బాబు : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై బాబు ఇలా..: ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరిస్తున్నారు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Chandra Babu Cornered Director RGV On Lakhsmi's NTR Movie | Oneindia Telugu

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపై ఈ ఉదయం టీడీపీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన వేళ, చంద్రబాబునాయుడు స్పందించారు. ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేందుకు కొందరు కుట్రలు పన్నారని విమర్శించారు. కుట్రదారులతో చేతులు కలిపిన దర్శకులను తిరస్కరించాలని అన్నారు.

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పై బాబు ఇలా..

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పై బాబు ఇలా..

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై, రాంగోపాల్ వర్మపై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కుట్ర‌దారుల‌తో ద‌ర్శ‌కులు క‌లిసి పోయార‌ని ఆరోపించారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయమంతా ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతోం ది. ఫిబ్రవరి 22న మహా నాయకుడు విడుదలవుతుండగా, మార్చి నెల మొదటి వారంలో రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలపై అటు సినీ రంగంతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా అత్యంత ఆసక్తి నెలకొంది. అయితే.. ఈ రెండు చిత్రాల్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై పలు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. రాంగోపాల్ వర్మ వైసీపీకి రాజకీయ ప్రయోజనం చేకూర్చేందుకే ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్‌తో తెలిసిపోయింది టిడిపి నేత‌లు అంటున్నారు. దీని పై స్పందించిన ముఖ్య‌మంత్రి ఎన్నికల్లో కొత్త తరం ఓటర్లే ఎక్కు వని, వారికి ఎన్టీఆర్‌ చరిత్రపై అవగాహన పెంచాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్టీఆర్‌ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు చేస్తున్నారని, కుట్రదారుల దుష్ప్ర‌చారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

స్పందించిన ఆర్జీవి..

స్పందించిన ఆర్జీవి..

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌తో టెలి కాన్ఫిరెన్స్ లో ఎన్టీఆర్ జీవితం ఎందరికో స్ఫూర్తని, అందుకే మహానా యకుడు, కథానాయకుడు చిత్రాలు ఆ స్ఫూర్తిని చాటి చెప్పేలా వస్తున్నాయని అన్నారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని చంద్రబాబు ప్రస్తావించడం ఇదే మొదటిసారి. వాస్తవాలను వక్రీకరించి సినిమాలు తీస్తే, ప్రజలు వాటిని చూడబోరని అన్నారు. వారికి గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే రానుందని హెచ్చరించారు. చంద్ర‌బాబు ప‌రోక్ష వ్యాఖ్య‌ల పై ద‌ర్శ‌కుడు ఆర్జీవి స్పందించారు. ఈ వార్త బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే వర్మ ఓ వీడియో టీజర్‌తో కౌంటర్‌ ఇచ్చారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌తో భయపడిన సీబీన్‌ రియాక్షన్‌ అంటూ ఓ వీడియోనే తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు వర్మ.

రియాక్షన్‌

రియాక్షన్‌

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మీద వచ్చే రకరకాల రియాక్షన్స్‌కు మీ నుండి వచ్చే రియాక్షన్‌ ఏంటి సార్‌' అని జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న రానా ‘మీరేమన్నా సరే రియాక్ట్ కావొద్దు, ఏమన్నా సరే' అని ఆవేశంగా చెప్పే డైలాగ్‌ను జోడించి వీడియో రిలీజ్ చేశాడు.దీని ద్వారా ఇప్పుడు టిడిపి వ‌ర్సెస్ ఆర్జీవి..క‌ధానాయకుడు వ‌ర్సెస్ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ లా ప‌రిస్థితి మారుతోంది.

English summary
AP CM Chandra babu cornered indirectly director Ram Gopal Varma on Lakhsmi's NTR movie. Babu called for boycott this movie. RGV also responded on cm's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X