వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ల రద్దుపై రంగంలోకి చంద్రబాబు, ఆర్బీఐ గవర్నర్‌కు ఫోన్: ఏటీఎంలలో చిన్న నోట్లు!

|
Google Oneindia TeluguNews

అమరావతి: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో దేశంలోలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాన్యుల సమస్యలను పరిష్కరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగంలోకి దిగింది.

దేశంలో ఏ సీఎంకు లేనంత భద్రత బాబుకు, 290 పోస్టులుదేశంలో ఏ సీఎంకు లేనంత భద్రత బాబుకు, 290 పోస్టులు

నోట్ల రద్దు పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు లేఖ రాశారు. అనంతరం ఆయనతో ఫోన్లో మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్‌కు వివరించారు.

 Chandrababu calls RBI governor over note ban issues

చంద్రబాబుకు లేఖకు ఆయన సానుకూలంగా స్పందించారు. నోట్ల రద్దు సమస్యను ఫోన్లో వివరించిన చంద్రబాబు.. ఆర్బీఐతో చర్చించేందుకు ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి రవిచంద్రను ముంబై పంపించారు.

ఏపీకి కొత్త రూ.500 నోట్లను తెచ్చే విషయమై ఆయన చర్చించనున్నారు. అలాగే, ఏటీఎంలలో రూ.20, రూ.50 నోట్లను కూడా అందుబాటులోకి తేవాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరినట్లుగా తెలుస్తోంది. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.

English summary
AP CM Chandrababu Naidu has called RBI governor over note ban issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X