• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు రాజకీయ సలహాదారుగా పెట్టుకోవచ్చు'

|

విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమస్యలపై స్పందిస్తుంటే.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్పందిస్తోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి మొదలు నిన్నటి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం పర్యటన వరకు అందుకు నిదర్శనాలు.

పవన్ కళ్యాణ్‌కు నాపై ప్రేమ ఎక్కువ అందుకే: కేశినేని చమత్కారం, చిరంజీవితో..పవన్ కళ్యాణ్‌కు నాపై ప్రేమ ఎక్కువ అందుకే: కేశినేని చమత్కారం, చిరంజీవితో..

దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు చురకలు అంటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్పందిస్తే చంద్రబాబు ఆ వైపు (ఆ సమస్య వైపు) చూస్తున్నారని, ఆయన స్పందిస్తేనే అటు చూస్తానని చంద్రబాబు అనుకుంటే పవన్‌ను రాజకీయ సలహాదారుగా పెట్టుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు.

pawan kalyan

పవన్ కళ్యాణ్ సమస్య పైన స్పందిస్తే దానిపై చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ప్రతిస్పందిస్తుందనే వాదనలు ఉన్నాయి. నవ్యాంధ్ర రాజధాని భూసేకరణ, పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఫుడ్ పార్కులతో పాటు నిన్న ఉద్ధానం వరకు పవన్ ప్రశ్నించిన సమస్యల పైన టిడిపి ప్రభుత్వం వెంటనే స్పందించింది.

పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే స్పందించడంపై పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో వైసిపి అధినేత జగన్ చేసే ఆందోళనలు, నిలదీసే సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోందంటున్నారు.

చంద్రబాబు సొంతూర్లో ఏటీఎం..!: నారావారిపల్లెలో నారా రోహిత్ సందడి

అయితే, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే స్పందించడానికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా 2014లో తమ గెలుపుకు ప్రధాన కారణమైన పవన్‌ను దూరం చేసుకునే ఉద్దేశ్యం చంద్రబాబుకు లేదని, అందుకే ఇలా చేస్తున్నారని అంటున్నారు.

మంత్రుల నుంచి నాయకుల వరకు పవన్.. ఏ విషయం మీద ప్రశ్నించినా స్వాగతించడం గమనార్హం. పవన్ ప్రశ్నించిన ప్రతి అంశంపై ఆయనను దూరం చేసుకోవద్దని టిడిపి స్వాగతిస్తుందా, లేక జగన్ కంటే అర్థవంతమైన సమస్యలు ఆయన లేవనెత్తుతున్నారా, పవన్ - చంద్రబాబు మధ్య ఏదైనా ఉందా అనే చర్చ కూడా ఉంది.

English summary
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమస్యలపై స్పందిస్తుంటే.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్పందిస్తోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి మొదలు నిన్నటి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం పర్యటన వరకు అందుకు నిదర్శనాలు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X