వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సముద్రాన్ని కంట్రోల్ చేస్తానని.. విశాఖపై మాత్రం పగబట్టారు: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి

|
Google Oneindia TeluguNews

వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి వరసగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే అవీ కామెంట్స్, వ్యాఖ్యలు కావు.. గత ప్రభుత్వం చేసిన తప్పదాల గురించి. గిరిజనులకు చంద్రబాబు చేసిన ద్రోహం గురించి మూడు పార్టులను పోస్టులు చేసిన.. విజయసాయిరెడ్డి ఈ సారి విశాఖకు చేసిన అన్యాయం గురించి పోస్ట్ చేశారు. విశాఖ కంఠకుడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లా విచ్చిన్నమైందని మండిపడ్డారు.

 ప్రకృతి గీసిన చిత్రం విశాఖ జిల్లా..

ప్రకృతి గీసిన చిత్రం విశాఖ జిల్లా..

ప్రకృతి గీసిన చిత్రం విశాఖ జిల్లా అంటూ ఫేస్‌బుక్‌లో తన పోస్టును విజయసాయి రెడ్డి ప్రారంభించారు. ఏటూ చూసిన పచ్చని తివాచీ పరిచినట్ట ఉంటుందని.. విభిన్న సంస్కృతుల ప్రజలతో మినీ భారత్ అని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడే కాదు.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో విశాఖ అభివృద్ది కోసం జగన్ కృషి చేశారని గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్ కాపాడి, ప్రజల దాహర్తి తీర్చింది వైఎస్ఆర్ అని తెలిపారు. కానీ చంద్రబాబు మాత్రం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. సముద్రాన్ని కంట్రోల్ చేస్తా, ప్రకృతిని శాసిస్తానని కబుర్లు చెప్పారి దుయ్యబట్టారు. ఇప్పుడు విపక్షంలో ఉండి.. అభివృద్దిని అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు.

40 లక్షల కోట్లు అని..

పెట్టుబడుల కోసం సదస్సులు నిర్వహించి 40 లక్షల కోట్ల వచ్చేయాని చెప్పడని.. తీరా పెట్టిన వ్యయంలో సగం కూడా పెట్టుబడులు రాలేదని చెప్పారు. సదస్సు కోసం శనగపప్పు, జీడిపప్పు కోసం వందల కోట్ల ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు సొంతం అని విమర్శించారు. కానీ గత 14 నెలల్లో విశాఖ అభివృద్ది కోసం సీఎం జగన్ 1300 కోట్ల కేటాయించారని తెలిపారు. చంద్రబాబు మాత్రం గతంలో హైదరాబాద్ భూములపై కన్నేసినట్టు.. అమరావతి భూములపై కన్నుపడిందని చెప్పారు. అందుకోసమే రాజధాని మార్పుపై 40 ఇయర్స్ ఇండస్ట్రీ ససేమిరా ఒప్పుకోవడం లేదన్నారు.

ఏయూను భ్రష్టుపట్టించారు..

ఏయూను భ్రష్టుపట్టించారు..

విశాఖకే తలమానికం ఆంధ్రా యూనివర్సిటీ అని.. దాని పేరును చెడగొట్టేందుకు నానా ప్రయత్నాలు చేశాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆంధ్రా వర్సిటీ డిస్టన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా తన వ్యక్తిని పెట్టి ప్రైవేట్ విశ్వ విద్యాలయం కోసం పనిచేయించాడని తెలిపారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ సహా డేటా మొత్తం ఏయూ నుంచి అక్కడికి వెళ్లిపోయిందన్నారు. ఏయూ ఖ్యాతిని భ్రష్టు పట్టించేందుకు బాబు ప్రయత్నించారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర టీడీపీ అడ్డా చెప్పుకోవడం తప్ప.. విశాఖ కోసం ఏమీ చేయలేదన్నారు.

కాగితాలకే పరిమితమైన డెవలప్ మెంట్..

కాగితాలకే పరిమితమైన డెవలప్ మెంట్..

విశాఖ డెవలప్ కాగితాలు, ఫైవ్ స్టార్ హోటళ్లకు పరిమితం చేశాడని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని లేఖ రాసింది చంద్రబాబు అని గుర్తుచేశారు. హైదరాబాద్ సహా విశాఖలో ఐటీ కారిడార్ అవసరమని భావించి.. తీసుకొచ్చింది వైఎస్ఆర్ అని తగుర్తుచేశారు. వైఎస్ హయాంలో 18 వేల మంది ఐటీ ఇండస్ట్రీలో పనిచేసేవారు. ఆయన మెట్రో రైలు కలను చంద్రబాబు చిదిమేశాడని ధ్వజమెత్తారు. వైఎస్ హయాంలోనే విశాఖకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వచ్చిందని.. కానీ చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ర్యాపిడ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కోసం రెండు బీఆర్టీసీ రోడ్లకు వైఎస్ఆర్ 450 కోట్ల నిధులను వైఎస్ఆర్ ఇచ్చారని తెలిపారు.

మైట్రో రైలు కారిడార్ తరలించేందుకు కుట్రలు

మైట్రో రైలు కారిడార్ తరలించేందుకు కుట్రలు

కేంద్రం అంగీకరించిన విశాఖ మెట్రో రైలు కారిడార్ ఎలా తరలించాలా అని కుట్ర చేసింది చంద్రబాబు అని వెల్లడించారు. కంచరపాలెం నుంచి పెందుర్తి వరకు ఆరులైన్ల రోడ్లను వైఎస్ఆర్ వేయిస్తే.. చంద్రబాబు ఒక్క రోడ్డు వేయలేదన్నారు. ఒక్క కాలనీ కూడా నిర్మించలేదన్నారు. విశాఖ అనగానే గుర్తొచ్చేది స్టీల్ ప్లాంట్ అని.. అదీ ప్రైవేట్ పరం చేస్తామని అప్పటి కేంద్రం భావించగా ఎదురొడ్డి పోరాడింది వైఎస్ఆర్ అని గుర్తుచేశారు. ఏపీ ఎస్ఈజెడ్‌లో ఉద్యోగాలు కల్పించింది వైఎస్ఆర్ అని స్ఫష్టంచేశారు. చంద్రబాబు.. హైదరాబాద్, చుట్టూ భూములపై మాత్రం ఫోకస్ చేశారని తెలిపారు. విశాఖకు ఒక టెర్మినల్ నిర్మించి డెవలప్ చేసింది వైఎస్ఆర్ అని తెలిపారు. హుద్ హుద్ పేరు చెప్పి సహాయ చర్యల్లో కమీషన్లు నొక్కేసిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు.

అపార ఖనిజ సంపద దోచే పెట్టేందుకు విఫలయత్నం

అపార ఖనిజ సంపద దోచే పెట్టేందుకు విఫలయత్నం

విశాఖ జిల్లాలో గల అపార ఖనిజ సంపదను ప్రైవేట్ వ్యక్తులకు దోచి పెట్టేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదని మండిపడ్డారు. అడ్డొచ్చినవారిని మావోయిస్టులు, రౌడీషీటర్ల పేరు వేసి అంతం చేసేందుకు వెనుకాడని వ్యక్తి చంద్రబాబు అని దుమ్మెత్తి పోశారు. విశాఖ పోర్టును ప్రైవేట్ పరం చేస్తూ..తమవారికి కాంట్రాక్టులు అప్పగించాడు. తమవారినే కాంట్రాక్టర్లుగా పెట్టడమే గాక.. షాపులు, క్యాంటీన్లు కూడ అప్పగించాడు. కాంట్రాక్టర్ వద్ద పనిచేసే వ్యక్తి.. ఎయిర్ పోర్టులో జగన్‌పై హత్యాయత్నం చేశాడని వివరించారు. అధికారంలో ఉ్నప్పుడు బాహుబలి రేంజ్‌లో గ్రాఫిక్స్ చూపించిన.. చంద్రబాబు.. ఇప్పుడు విశాఖపై విషం కక్కుతున్నాడని విమర్శించారు. చివరికీ వైజాక్ కంఠకుడిగా మిగిలిపోయాడని.. కొండలు, గుట్టలు, ఇసుక, ప్రేవెట్ ఆస్తులు.. ఏవీ కబ్జాకు అడ్డుకాదన్నట్టు వ్యవహరించాడని మండిపడ్డారు.

Recommended Video

AP CM Jagan, CM KCR, Pawan Kalyan's #IndependenceDay2020 Celebrations || Oneindia Telugu
మూడు పార్టులలో గిరిపుత్రుల మోసాలపై

మూడు పార్టులలో గిరిపుత్రుల మోసాలపై

గిరిజనులను మోసం చేసింది చంద్రబాబే అంటూ తన పార్ట్-3 పోస్టులో విజయసాయిరెడ్డి ధ్వజ మెత్తారు. గిరిపుత్రులకు బాబు మోసం చేశారని.. వారి గుండెల నిండ వైఎస్ఆర్, జగన్ ఉన్నారని స్పష్టంచేశారు. చంద్రబాబు పేరు వింటేనే ఏజెన్సీ ఉలిక్కిపడుతోందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మండలి వస్తుందని.. గిరిజనులను ఎమ్మెల్సీ చేస్తానని కబుర్లు చేస్తున్నారని మండిపడ్డారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వారి ఎమ్మెల్సీ కేటాయించలేదు అని ప్రశ్నించారు. చివరి ఆరునెలల్లో ఒకరినీ మంత్రి చేయాల్సి వచ్చినా అతనిని ఎమ్మెల్సీ చేయకపోవడంతో పదవీ వదులుకోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచినట్టే గిరిజనులను చంద్రబాబు వంచించాడని ..ఇదివరకు హరికృష్ణను మంత్రి చేయాల్సిన సమయంలో కూడా అతనికి చట్టసభల్లో చోటు కల్పించలేదన్నారు. దీంతో హరికృష్ణ కూడా పదవీ కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇదీ చంద్రబాబు మార్క్ నైజం అని ఉదహరించారు.

English summary
tdp chief chandrababu naidu cheat vizag region ysrcp mp viajaya sai reddy alleged. he post part-1 in facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X