వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నందమూరి ఫ్యామిలీకి చంద్రబాబు అవమానం, అందుకే ఈ వాదన'

నందమూరి కుటుంబాన్ని ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అవమానించారని వైసిపి నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదివారం ఆరోపించారు. అలాంటి వ్యక్తికి ఎన్టీఆర్ పేరును ఉచ్చరించే అర్హత లేదన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: నందమూరి కుటుంబాన్ని ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అవమానించారని వైసిపి నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదివారం ఆరోపించారు. అలాంటి వ్యక్తికి ఎన్టీఆర్ పేరును ఉచ్చరించే అర్హత లేదన్నారు.

హరికృష్ణ ఆసక్తికరం, చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలుహరికృష్ణ ఆసక్తికరం, చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

ప్రజలను మభ్యపెట్టేందుకే ఎన్టీఆర్‌కు భారతరత్న అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని, 2009లో జూ ఎన్టీఆర్‌ను ప్రచారానికి ఉపయోగించుకొని పక్కన పెట్టారని వైసిపి ఆరోపణలు చేస్తోంది.

నందమూరి కుటుంబానికి అన్యాయం

నందమూరి కుటుంబానికి అన్యాయం

వీటిని ఉద్దేశించి వెల్లంపల్లి మాట్లాడారు. నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు అవమానించారన్నారు. మహానాడు ఓ మాయానాడుగా సాగుతోందన్నారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరు పలికే అర్హత లేదన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో కనీసం పదిశాతం కూడా అమలు చేయలేదన్నారు.

ఎన్టీఆర్ క్షోభపై చర్చిస్తే బాగుండేది: రోజా

ఎన్టీఆర్ క్షోభపై చర్చిస్తే బాగుండేది: రోజా

టిడిపి మహానాడు వెన్నుపోటు మహానాడుగా మారిందని వైసిపి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మహానాడుు అబద్దాలకు వేదిక అయిందన్నారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎలా మానసిభ క్షోభకు గురయ్యారో చర్చించి ఉంటే బాగుండేదన్నారు.

సిగ్గులేకుండా..

సిగ్గులేకుండా..

ఎన్టీఆర్ ఆశయాలు అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని, పెద్దాయనకు భారతరత్న ఇప్పించేందుకు టిడిపి కృషి చేయడం లేదన్నారు. ఏ ఒక్క పథకాన్ని చంద్రబాబు సరిగా అమలు చేయడం లేదన్నారు. సిగ్గులేకుండా పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు.

మహానాడులో చేసిన తీర్మానాలు ఏ ఒక్కటీ అమలు కావడం లేదని రోజా అన్నారు. ఓట్ల కోసమే చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు రాజధానిపై ఒక్క అడుగు ముందుకు పడలేదని విమర్శించారు. అవినీతి పాలన చేస్తున్న చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు.

లోకేష్ ఆస్తులు 22 రెట్లు ఎలా పెరిగాయి?

లోకేష్ ఆస్తులు 22 రెట్లు ఎలా పెరిగాయి?

రాష్ట్రం అవినీతిలో నెంబర్ వన్ స్థానంలో ఉందని రోజా విమర్శించారు. అయిదు నెలల్లో నారా లోకేష్ ఆస్తులు 22 రెట్లు ఎలా పెరిగాయో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు హత్యా రాజకీయాలకు తెరలేపారని, హత్యలను అడ్డుకోవడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్నారు.

English summary
Vellampalli Srinivas on Sunday alleged that AP CM Nara Chandrababu Naidu cheated Nandamuri familu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X