అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు వ్యాఖ్యలే ప్రధాన అజెండాగా ఐఏఎస్ ల సమావేశం .. కోరం లేక వాయిదా

|
Google Oneindia TeluguNews

ఏపీ ఎన్నికలను పారదర్శకంగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్‌ చంద్ర పునేఠను తప్పించి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించింది. అయితే ఈ వ్యవహారంపై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కారు. ఎన్నికల సంఘం కేంద్రం కలిసి కావాలనే తమపైన కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇక కొత్తగా సీఎస్ గా నియమితులైన ఎల్వీ సుబ్రహ్మణ్యం పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఉన్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ను నేరస్తుడిగా అనుచిత వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు .

ఈవీఎంల కోసం తోమ్మిది వేల కోట్లు ఏం చేశారు,: చంద్రబాబు నాయుడుఈవీఎంల కోసం తోమ్మిది వేల కోట్లు ఏం చేశారు,: చంద్రబాబు నాయుడు

చంద్రబాబు ఐఏఎస్ లపై చేసిన అనుచిత వ్యాఖ్యలే అజెండాగా ఐఏఎస్ ల సమావేశం

చంద్రబాబు ఐఏఎస్ లపై చేసిన అనుచిత వ్యాఖ్యలే అజెండాగా ఐఏఎస్ ల సమావేశం

ఇక చంద్రబాబు ఐఏఎస్ అధికారిపైన చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీకి చెందిన పలువురు ఐఏఎస్‌లు సమావేశం అయ్యారు. అమరావతిలోని పున్నమిఘాట్‌ హరిత హోటల్‌లో ఐఏఎస్‌లు సమావేశం నిర్వహించాలని భావించారు . ఐఏఎస్‌లపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

కోరం లేక వాయిదా పడిన ఐఏఎస్ ల సర్వ సభ్య సమావేశం

కోరం లేక వాయిదా పడిన ఐఏఎస్ ల సర్వ సభ్య సమావేశం

విజయవాడ పున్నమిఘాట్ లోని హరిత హోటల్లో నిర్వహించ తలపెట్టిన ఐఏఎస్ అధికారుల సంఘం సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది. సంఘంలో 184 మంది సభ్యులు ఉండగా, తాజా సమావేశానికి 14 మందే హాజరయ్యారు. దాంతో సమావేశాన్ని వాయిదా వేశామని ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.

చాలామంది ఐఏఎస్ అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటమే కారణం

చాలామంది ఐఏఎస్ అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటమే కారణం

సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలే తమ సమావేశంలో ప్రధాన అజెండాగా భావించామని, కానీ చాలామంది అధికారులు ఎన్నికల విధుల్లో ఉండడంతో సమావేశం నిర్వహించలేకపోతున్నామని వివరించారు.కోరం ఉండాలంటే 46 మంది హాజరు కావాల్సి ఉంటుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. కనీస స్థాయిలో సభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఎలాంటి తీర్మానాలు చేయలేదని, కనీసం అజెండాపై చర్చించే వీల్లేకుండా పోయిందని అన్నారు.

English summary
Many IASs of AP have been meeting on the comments made by Chandrababu on IAS officer. The IAS meeting was scheduled to be held at Punnami ghat haritha hotel in Amaravati. There is a significant rise in the face of criticism of IAS.CM Chandrababu comment on CS LV Subrahmanyam was thought to be a major agenda at our meeting, but many officials have been unable to hold a meeting because they are on duty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X