వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందీ: పవన్ కళ్యాణ్ అలా-బాబు ఇలా, అందుకే ఎన్నికలకు సిద్ధమని..

హిందీ భాష నేర్చుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు హిందీ గో బ్యాక్ అనే ఆర్టికల్‌ను తన ట్విట్టర్ అకౌంటులో పోస్ట్ చేసారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: హిందీ భాష నేర్చుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు హిందీ గో బ్యాక్ అనే ఆర్టికల్‌ను తన ట్విట్టర్ అకౌంటులో పోస్ట్ చేసారు.

ఈ నేపథ్యంలో హిందీ భాషపై విలేకరులు చంద్రబాబును ప్రశ్నించారు. భాషలు నేర్చుకోవడంలో తప్పు లేదని, స్వచ్చంధంగా రెండు, మూడు భాషలు నేర్చుకోవచ్చునని, అలా అయితే మంచిది అని ముఖ్యమంత్రి అన్నారు.

<strong>'హిందీ గో బ్యాక్!', 'దక్షిణాదిపై వివక్ష వీడేదెన్నడు'.. ఇవి చూడండి: పవన్ కళ్యాణ్</strong>'హిందీ గో బ్యాక్!', 'దక్షిణాదిపై వివక్ష వీడేదెన్నడు'.. ఇవి చూడండి: పవన్ కళ్యాణ్

ఉత్తర భారత రాజకీయ నాయకులు ఇకనైనా పరిస్థితుల్ని అర్థం చేసుకొని దేశంలోని భిన్న సంస్కృతుల్ని గౌరవించాలని పవన్ కల్యాణ్‌ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఉత్తరాది నాయకుల ధోరణిని తప్పుబడుతూ అభిప్రాయాల్ని వెల్లడించారు.

Chandrababu comments on Hindi learning

సాంస్కృతిక, భాషా, జాతి వైవిధ్యాలకు కలిగిన దేశమిది. కేంద్ర ప్రభుత్వం ఉపజాతీయ అస్తిత్వాన్ని గౌరవించకపోతే వేర్పాటువాద ఉద్యమాలకు వూతమిస్తున్నట్లే అని పవన్‌ అభిప్రాయపడ్డారు.

ఎన్నికలకు సిద్ధమని చంద్రబాబు

మేం రాష్ట్రంలో మంచి పనులు చేశామని, కాబట్టే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీ సీట్లు పెంచుతామని కేంద్రం చెబుతోందని అన్నారు. తాము కూడా దాని కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలకు సిద్ధమన్నారు.

English summary
Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu responded on Hindi learning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X