వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్‌కు అందుకే కక్ష, చిన్న మిస్టేక్‌: విభజన-కేసీఆర్‌పై బాబు, బాహుబలి సినిమాపై..

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో బాగా ఉండేవారని, ఇద్దరం కలిసిమెలిసి ఉండేవాళ్లమని, కేసీఆర్ కంటే విజయరామారావు మంచి లీడర్ అని, అందుకే 1999లో కేబినెట్లో కేసీఆర్‌కు స్థానం ఇవ్వలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు-మోడీలపై జైరాం రమేష్ సంచలనం, 2019లో హోదాపై తొలి సంతకంచంద్రబాబు-మోడీలపై జైరాం రమేష్ సంచలనం, 2019లో హోదాపై తొలి సంతకం

ఆయన రాజకీయాల్లోకి వచ్చి నలభై ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు మంత్రి పదవి, రాష్ట్ర విభజన, రాజకీయాలు, సినిమాలు తదితర అంశాలపై స్పందించారు.

అందుకే కేసీఆర్‌కు ఇవ్వలేదు

అందుకే కేసీఆర్‌కు ఇవ్వలేదు

విజయరామరావు ఎప్పటి నుంచో ఉన్నారని, సీబీఐలో కూడా పని చేశారని, అందుకే మంత్రి పదవి ఇచ్చామని, తప్పుగా అంచనా వేయడం వల్లే కేసీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వలేకపోయామని చంద్రబాబు చెప్పారు. అందుకే విభజన జరిగిందన్నారు. చరిత్రలో కొన్ని మన చేతుల్లో ఉండవన్నారు. కొన్ని మాత్రమే ఉంటాయన్నారు.

అలా చిన్న మిస్టేక్ జరిగింది

అలా చిన్న మిస్టేక్ జరిగింది

ప్రతి ఒక్క విషయంలో ఏదో అయిపోతుందనుకుంటే ఎవర్నీ మంత్రిగా రీఆర్గనైజ్ చేయలేమని చంద్రబాబు అన్నారు. జడ్జిమెంట్ కరెక్టుగా తీసుకోవాలని, అలా చిన్న మిస్టేక్ జరిగిందని, 1999 సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. సమైక్య ఏపీ కోసం ఎంతో కృషి చేశానని, కానీ ఓటమితో బ్రేక్ పడిందని, ఆ తర్వాత వచ్చిన వాళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు.

బాహుబలి సినిమా చూశా

బాహుబలి సినిమా చూశా

తాను సినిమాలకు పెద్దగా వెళ్లనని చంద్రబాబు అన్నారు. అయితే బాహుబలిని మాత్రం చూశానని చెప్పారు. కుటుంబ సమేతంగా ఇంట్లో చూశానని, మల్టిప్లెక్స్‌లకు వెళ్లడం అలవాటు లేదన్నారు. హోటల్ భోజనాలు కూడా పెద్దగా అలవాటు లేదన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రమే చేస్తానన్నారు.

జగన్‌పై బాబు ఆగ్రహం

జగన్‌పై బాబు ఆగ్రహం

వైసీపీ అధినేత వైయస్ జగన్ రాజకీయాలు లో లెవల్లో ఉంటాయని చంద్రబాబు అన్నారు. దివంగత వైయస్ పౌరుషంగా మాట్లాడేవారని, అందులో వినయం కనిపించేదని, కానీ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ మాత్రం మాట్లాడుతుంటే బాధ, ఆవేదన కలుగుతోందన్నారు. ప్రజల కోసం హుందాగా పని చేయాలన్నారు.

 పట్టించుకుంటే ఎక్కడికో పోతుంది

పట్టించుకుంటే ఎక్కడికో పోతుంది

జగన్ విపరీతంగా డబ్బు సంపాదించారని, తప్పులు చేసిన వ్యక్తి లెక్కలేనితనంతో అధిష్టానాన్ని ఎదిరించారని చంద్రబాబు అన్నారు. మళ్లీ సరెండర్ అయి బెయిల్ తెచ్చుకున్నారన్నారు. జైలుకు వెళ్లిన వ్యక్తి వచ్చి తిడుతుంటే ఎవరు పట్టించుకుంటారన్నారు.తాను వాటిని పట్టించుకోనని, వారి పట్ల అప్రమత్తంగా ఉంటానని చెప్పారు. వ్యక్తిగతంగా తీసుకుంటే ఎక్కడికో పోతుందన్నారు.

వైయస్‌కు నాపై అందుకే కక్ష

వైయస్‌కు నాపై అందుకే కక్ష

తాను సామాజిక న్యాయం కోసం పని చేశానని, హత్యా రాజకీయాలు చేయలేదని చంద్రబాబు అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి తనతో తిరిగేవాడని, ఆయనతో రాజకీయ విభేదాలే తప్ప వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. నేను హుందాగా వ్యవహరించేవాడినని, వైయస్ మాత్రం అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలకు దిగారన్నారు. వైయస్ ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టి పర్మిషన్ అడిగాడని, తాను ఇవ్వలేదన్నారు. మార్కెట్ ధర ప్రకారం కొనాలని చెప్పానని, అప్పటి నుంచి నాపై కక్ష పెంచుకున్నారన్నారు.

నాకు ఎలాంటి దురలవాట్లు లేవు

నాకు ఎలాంటి దురలవాట్లు లేవు

అమరావతిని హైదరాబాద్, బెంగళూరులతో పోల్చవద్దన్నారు. మిగతా రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఏపీకీ హోదా ఇవ్వాలన్నారు. తాను ఆట విడుపు కోసం పేకాట బాగా ఆడేవాడినని చెప్పారు. తనకు ఎలాంటి దురలవాట్లు లేవన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu comments on YSR Rajasekhar Reddy, KCR and YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X