వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేజీలకు పేజీలు రాతలు, ఏకవచన సంబోధన, బాధేస్తోంది: జగన్‌పై బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ 10.99 శాతం అభివృద్ధి చెందితే తెలంగాణ 9.24 శాతం అభివృద్ధి సాధించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ఆయన బుధవారం సాయంత్రం సమాధానం ఇచ్చారు. ఎపి అభివృద్ధిలో నెంబర్ వన్ స్ధానంలో ఉందని చెప్పారు.

అవినీతి పేపరులో పేజీలకు పేజీలు రాస్తున్నారని, గుడ్డ కాల్చి మీద వేస్తున్నారని చంద్రబాబు సాక్షి పత్రికను ఉద్దేశించి అన్నారు. ఈడి జప్తులో ఉన్న పత్రిక, చానెల్ ప్రభుత్వ ఆస్తి అని, వాటిని ప్రజా ప్రయోజనాలకు వాడాలని, ఆ దిశగా తాము ముందుకు పోతుంటే ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.

తనను ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడుతుంటే బాధ కలుగుతోందని, అయినా ప్రజల కోసం తాను ముందుకు సాగుతున్నానని ఆయన అన్నారు.

కాపులకు న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. విశాఖకు రైల్వేజోన్‌ పెండింగ్‌లో ఉందని, కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించి హామీలన్నీ సాధించుకుంటామన్నారు. పీపీపీ కింద రహదారులు నిర్మిస్తామని చెప్పిందన్నారు.

ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలకు ప్రోత్సహకాలు రావని ఆయన అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్షం మొదటి నుంచీ ప్రయత్నిస్తోందని, అమరావతి నిర్మాణంలో జాప్యం జరిగితే అనుకున్న అభివృద్ధి సాధించలేమని ఆయన అన్నారు.

34 వేల ఎకరాల సేకరణకు 35 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఆయన చెప్పారు. ఎపి గర్వపడే విధంగా అమరావతి నిర్మాణం జరగాలని ఆయన అన్నారు. 2022నాటికి మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒక్కటిగా నిలిపే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

 Chandrababu compares AP with Telangana in development

అమరావతి, తిరుపతి, విశాఖట్నాల్లో పట్టణీకరణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఆయన అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ముందుకు వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వం ఒకేసారి అనేక ప్రాజెక్టులను చేపట్టిందని, ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని అన్నారు. వంశధార, నాగవళి నదులనను అనుసంధానం చేస్తామని చెప్పారు.

గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసిన ఘనత ఎపిదేనని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుపైనా ప్రతిపక్షం విమర్శలు చేస్తోందని, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్తు సంస్థల సామర్థ్యం పెంచామని చెప్పారు. ఎపి మిగులు విద్యుత్తును ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ముందుకు వచ్చిందని చెప్పారు.

పోలవరానికి రూ. 1200 కోట్లు ఖర్చు పెట్టాం
రాజదాని ఆలస్యమైతే అనుకున్న అభివృద్ధి సాధించలేం.
పోలవరం ప్రాజెక్టుపై ఆరోపలు చేశారు.
గోదావరి, కృష్ణా నదులను అనుసంధాం చేసిన ఘన

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu compared AP with Telangana in development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X