వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు రోడ్‌షో: లోకేష్‌కు బతుకమ్మల స్వాగతం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి వసూళ్ల పార్టీ అని, ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు తెలంగాణకు తొలి శత్రువని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కెసిఆర్‌ది భస్మాసుర హస్తమని... ఈ ఎన్నికలలో ఆ భస్మాసుర హస్తాన్ని తన నెత్తినే పెట్టుకుంటాడని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌నగర్‌లో శుక్రవారం పర్యటించిన సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు.

తెలగాణలో టిడిపి అధికారంలోకి వస్తుందని తెలిసి కెసిఆర్‌కు రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదని.. దాంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని, తనను విమర్శిస్తే సైకిల్ స్పీడ్ పెంచి గేరు మార్చి తొక్కేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. పిచ్చి పిచ్చి మాటలు ఆపకుంటే కెసిఆర్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పిస్తామన్నారు. తాను కోరుకుంటోంది తెలంగాణ పునర్నిర్మాణమా? సొంత కుటుంబ పునర్నిర్మాణమో కెసిఆర్ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నాయకుడే లేడని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు తెలిపారు. ఎంఐఎం ప్రజలకు మాయమాటలు చెప్పే అవకాశవాద పార్టీ అని దుయ్యబట్టారు. నిత్యం శాంతిభద్రతల్లో మునిగి ఉంటున్న పోలీసుల కోసం ప్రత్యేకంగా పిఆర్సీ ఇస్తామని చెప్పారు. జర్నలిస్టులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అంగన్‌వాడీలకు ఉద్యోగభద్రత కల్పిస్తామన్నారు. డ్రైవర్లకు రూ.5లక్షల ప్రమాద బీమా అందజేస్తామని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్సు కోసం అర్హతగా ఉన్న పదోతరగతి ప్రామాణికాన్ని రద్దు చేస్తామన్నారు.

కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యనందిస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రచారం కోసం దొంగలొస్తున్నారంటూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై 10 ఛార్జీ షీట్లున్న విషయాన్ని గుర్తు చేశారు. రైతుల ఇబ్బందులు తెలిసిన వాడిగా వారి రుణాలు మాఫీ చేస్తానని చెప్పారు. ప్రస్తుతమున్న ఆరోగ్యశ్రీ కంటే మెరుగ్గా ఎన్టీఆర్ హెల్త్‌కార్డు ద్వారా వైద్యసేవలు అందిస్తామన్నారు. చంద్రబాబు వెంట బిజెపి సికింద్రాబాద్ ఎంపి అభ్యర్థి బండారు దత్తాత్రేయ, టిడిపి నేతలు దేవేందర్ గౌడ్, ఆర్ కృష్ణయ్య, ఇతర నేతలు ఉన్నారు.

మరోవైపు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పాతబోయినపల్లి, ఈసిఐఎల్ ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించారు. అవినీతికి చిరునామాగా మారిన కెసిఆర్‌పై దాడులు ఖాయమని, ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని లోకేశ్ అన్నారు. ఫాంహౌజ్‌లో కెసిఆర్ తాగి పడేసిన మద్యం బాటిళ్లను తనపైకి విసిరివేసి, దాడికి పాల్పడిన ఘనత టిఆర్ఎస్ నాయకులకే చెల్లిందన్నారు. తన తాత, తండ్రి సిఎంలుగా రాష్ట్రానికి సేవలు అందించారని, అలాంటి తనకే భద్రత కరువైతే.. ఇక సామాన్యుల సంగతేంటని ప్రశ్నించారు. టిఆర్ఎస్‌కు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అవినీతికి ఓటేసినట్టేనన్నారు.

దత్తన్నతో బాబు రోడ్ షో

దత్తన్నతో బాబు రోడ్ షో

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌నగర్‌లో శుక్రవారం పర్యటించిన సందర్భంగా చంద్రబాబు నాయడు ప్రసంగించారు.

కృష్ణయ్యకే ఓటేయ్యండి..

కృష్ణయ్యకే ఓటేయ్యండి..

తెలంగాణ రాష్ట్ర సమితి వసూళ్ల పార్టీ అని, ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు తెలంగాణకు తొలి శత్రువని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

దేవేందర్ గౌడ్ ప్రసంగం

దేవేందర్ గౌడ్ ప్రసంగం

తెలగాణలో టిడిపి అధికారంలోకి వస్తుందని తెలిసి కెసిఆర్‌కు రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదని.. దాంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

బహిరంగ సభలో మాట్లాడుతూ..

బహిరంగ సభలో మాట్లాడుతూ..

భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని, తనను విమర్శిస్తే సైకిల్ స్పీడ్ పెంచి గేరు మార్చి తొక్కేస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

రోడ్‌షోకు హాజరైన జనం

రోడ్‌షోకు హాజరైన జనం

తాను కోరుకుంటోంది తెలంగాణ పునర్నిర్మాణమా? సొంత కుటుంబ పునర్నిర్మాణమో కెసిఆర్ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

లోకేష్ రోడ్‌షో

లోకేష్ రోడ్‌షో

చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పాతబోయినపల్లి, ఈసిఐఎల్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించారు.

నారా లోకేష్‌కు బతుకమ్మలతో స్వాగతం

నారా లోకేష్‌కు బతుకమ్మలతో స్వాగతం

అవినీతికి చిరునామాగా మారిన కెసిఆర్‌పై దాడులు ఖాయమని, ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని లోకేష్ అన్నారు.

హాజరైన టిడిపి శ్రేణులు

హాజరైన టిడిపి శ్రేణులు

తన తాత, తండ్రి సిఎంలుగా రాష్ట్రానికి సేవలు అందించారని, అలాంటి తనకే భద్రత కరువైతే.. ఇక సామాన్యుల సంగతేంటని నారా లోకేష్ ప్రశ్నించారు. టిఆర్ఎస్‌కు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అవినీతికి ఓటేసినట్టేనన్నారు.

English summary
Telugudesam Party president Chandrababu Naidu on Friday conducted a road show at Rajendra Nagar in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X