వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయలసీమ ఎత్తపోతల పథకాలకు బ్రేకులు వేసేందుకు చంద్రబాబు కుట్రలు : వైసీపీ ఎంపీ ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురే అవుతోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం నిర్ణయాలతో ఏపీ సర్కార్ ఇబ్బందులు పడుతుంటే, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై కూడా ముందుకు వెళ్లొద్దని ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో వీటన్నిటికీ గత టీడీపీ సర్కార్ కారణమని వైసిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు.

చంద్రబాబు ... రాష్ట్రానికి తెచ్చింది ఏంటయ్యా.. నీరు, మట్టి తప్ప : విజయసాయి సెటైర్చంద్రబాబు ... రాష్ట్రానికి తెచ్చింది ఏంటయ్యా.. నీరు, మట్టి తప్ప : విజయసాయి సెటైర్

చంద్రబాబు రాష్ట్రంలో సీమ ప్రాజెక్టులు అడ్డుకోవటానికి కుట్ర పన్నారు

చంద్రబాబు రాష్ట్రంలో సీమ ప్రాజెక్టులు అడ్డుకోవటానికి కుట్ర పన్నారు

తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు బ్రేకులు వేయడం కోసం చంద్రబాబు కుట్రలు మొదలు పెట్టాడని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు .ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. గతంలో మహానేత వైఎస్ఆర్ సీఎంగా ఉండగా జలయజ్ఞం ప్రాజెక్టులకు ఆటంకాలు కల్పించినట్టుగానే, సీమ ఎత్తిపోతల పథకాలకు బ్రేకులు వేసే కుట్రలు మొదలుపెట్టాడు చంద్రబాబు అంటూ, గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రాజెక్టులకు ఆటంకాలు కల్పించారని ఆరోపించారు. ఇక అదే తరహాలో ఇప్పుడు కూడా చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

 కేసులు వేయించి అనుమతులను అడ్డుకోవాలని చూస్తే ప్రజల ఉసురు తగులుతుంది

కేసులు వేయించి అనుమతులను అడ్డుకోవాలని చూస్తే ప్రజల ఉసురు తగులుతుంది

అంతేకాదు ట్రిబ్యునల్స్, కోర్టుల్లో కేసులు వేయించి, అనుమతులను అడ్డుకోవాలని చూస్తే ప్రజల ఉసురు తప్పకుండా తగులుతుంది అంటూ విజయ సాయి రెడ్డి తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి బాటలో ముందుకు వెళుతోందని, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు. చంద్రబాబు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారని అన్నారు. ఇక దీని కోసం ఒక ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి కడప స్టీల్ ఫ్యాక్టరీ తో పారిశ్రామికంగా రాష్ట్రంలో నవశకం మొదలవుతుందని పేర్కొన్నారు .

జగన్ హయాంలోనే పారిశ్రామికాభివృద్ధి ..కొరియన్ ఉక్కు దిగ్గజం పోస్కో ఆసక్తినే ఒక ఉదాహరణ

జగన్ హయాంలోనే పారిశ్రామికాభివృద్ధి ..కొరియన్ ఉక్కు దిగ్గజం పోస్కో ఆసక్తినే ఒక ఉదాహరణ

30 వేల మందికి ఉపాధి కల్పించే ఈ కర్మాగారం వెలుగు దివ్వెలా అభివృద్ధికి దారి చూపుతుందని పేర్కొన్నారు. కొరియన్ ఉక్కు దిగ్గజం పోస్కో ప్రభుత్వ చొరవ ను ప్రశంసించడం యువ సీఎం జగన్ సంకల్పాన్ని బలపరిచినట్లయింది అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.ఎవరెన్ని చేసినా , ఏ దుష్ప్రచారాలు చేసినా సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు . అంతేకాదు నాడు-నేడులో భాగంగా ఏపీ లోని హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పునరుద్ధరించడానికి నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

 ఏపీ లోని హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పునరుద్ధరించడానికి జగన్ సర్కార్ నిర్ణయం

ఏపీ లోని హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పునరుద్ధరించడానికి జగన్ సర్కార్ నిర్ణయం

ఏపీ లోని హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పునరుద్ధరించడానికి 17,300 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు . ప్రస్తుతమున్న కళాశాలలను ఆధునీకరించడానికి, 16 కొత్త వైద్య కళాశాలలను నిర్మించడానికి, వైయస్ఆర్ క్లినిక్‌లు, సిహెచ్‌సిలు మరియు పిహెచ్‌సిలను బలోపేతం చేయడానికి ఈ నిధులు ఉపయోగించబడతాయని పేర్కొన్నారు కొత్త మెడికల్ కాలేజీ భవనాలు ప్రీ-సర్టిఫికేట్ పొందిన గ్రీన్ బిల్డింగ్స్ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు .

English summary
YCP MP Vijayasai Reddy was criticized on social media that Chandrababu had started conspiracies to put a brake on Rayalaseema's uplift schemes .He tweeted on his Twitter account to this effect. Vijayasai said that chandrababu had started conspiracies to put a brake on the Seema Upliftment Schemes, just as obstructed the Jalayagyan projects while YSR CM in the past. Vijayasaireddy said that Chandrababu is still conspiring in the same manner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X