వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాదుకు మైక్రోసాఫ్ట్‌ను తెచ్చింది నేనే: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

దావోస్: హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించేలా తాను కృషి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు. అలీబాబా క్లౌడ్ అధ్యక్షుడు సైమన్ హూత ఆయన గురువారంనాడు సమావేశమయ్యారు.

Recommended Video

WEF 2018: దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఇండియా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం

ఆ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడార. అలీబాబా గ్రూపుతో భేటీ కావాలని తాను చాలా కాలం నుంచి చూస్తున్నానని, ఈ సంస్థ తమతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు.

భారతీయులు ఐటిలో బలమైనవారు...

భారతీయులు ఐటిలో బలమైనవారు...

భారతీయులు ఐటిలో ఎంతో బలమైనవారని చంద్రబాబు అన్నారు. భారతీయులు ఆంగ్లంలో, గణితంలో ప్రావీణ్యం కలిగి ఉంటానరి ఆయన చెప్పారు. వాజ్‌పేయి హయంలో టెలికాం రంగానికి ఎంతో ప్రాధాన్యం లభించిందని, అది ఐటి రంగంలో మార్పనకు కారణమైందని అన్నారు.

ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు బాబు ఆహ్వానం

ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు బాబు ఆహ్వానం


వివిధ రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సంస్థలను చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానించారు దావోస్ పర్యటనలో భాగంగా ఆయన బదవారం వివిధ సంస్థల ప్రతినిధులతో వరుసగా సమావేశమయ్యారు.

విమాన తయారీ కేంద్రం...

విమాన తయారీ కేంద్రం...

ఈ ఏడాది చివరలో రాష్ట్రంలో సీ-295 రవాణా విమాన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ సిఈవో ిర్క్ హోక్ చంద్రబాబుకు హామీ ఇచ్చారు. సైనిక, వ్యూహాత్మక రంగాల్లో వాడే సీ-295 తయారీ కేంద్రాన్ని ఎయిర్ బ్ టాటా భాగస్వామ్యంతో నెలకొల్పుతుంది.

వేదాంత చైర్మన్‌తో చంద్రబాబు

వేదాంత చైర్మన్‌తో చంద్రబాబు


భారతదేశంలో జోస్టన్ తరహాలో ఓ విశ్వవిద్యాలయాన్ని స్థాపించే ఆలోచన ఉందని చంద్రబాబుకు వేదాంత సంస్థ చైర్మన్ అనిల్ అనిల్ అగర్వాల్ వివరించార.ఈ టౌన్‌షిప్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాట చేయాలని అందుకు అన్ని రకాలుగా సహకరిస్తామని చంద్రబాబు చెప్పారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu said that he was the man behid establishment of Microsoft in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X