వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎల్‌కు లైన్ క్లియర్: టిటిడి ఛైర్మెన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: టిటిడి ఛైర్మెన్‌గా కడప జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ పేరు ఖరారెనట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది కాలంగా ఈ పదవి ఖాళీగా ఉంది. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన సుధాకర్ యాదవ్‌ను టిటిడి ఛైర్మెన్ పేరును చంద్రబాబునాయుడు సూచించారని సమాచారం. త్వరలోనే ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

టిడిపిలోకి డిఎల్ రవీంద్రారెడ్డి, టిటిడి ఛైర్మెన్‌గా సుధాకర్‌ యాదవ్?టిడిపిలోకి డిఎల్ రవీంద్రారెడ్డి, టిటిడి ఛైర్మెన్‌గా సుధాకర్‌ యాదవ్?

కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇంచార్జీగా సుధాకర్ యాదవ్ ఉన్నారు అయితే సుధాకర్ యాదవ్‌కు టిటిడి ఛైర్మెన్ పదవిని కట్టబెడితే మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని టిడిపిలో చేర్చుకోవాలని టిడిపి ప్లాన్ చేస్తోంది.

రేవంత్ రెడ్డి టార్గెట్ అతనే: ఎవరీ పుట్ట సుధాకర్ యాదవ్?రేవంత్ రెడ్డి టార్గెట్ అతనే: ఎవరీ పుట్ట సుధాకర్ యాదవ్?

పుట్టా సుధాకర్ యాదవ్‌ను టిటిడి చైర్మెన్‌గా కొనసాగించే విషయమై ఆర్ఎస్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే ఈ అభ్యంతరాలపై సుధాకర్ యాదవ్ వివరణ కూడ ఇచ్చారు.దీంతో ఆర్ఎస్ఎస్ నుండి సానుకూలంగా సంకేతాలు వెలువడ్డాయనే ప్రచారం కూడ టిడిపి వర్గాల్లో ఉంది.

 టిటిడి ఛైర్మెన్‌గా సుధాకర్ యాదవ్ పేరు

టిటిడి ఛైర్మెన్‌గా సుధాకర్ యాదవ్ పేరు

టిటిడి ఛైర్మెన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ పేరును టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ఖరారు చేసినట్టు టిడిపి వర్గాలు చెబుతున్నాయి సుధాకర్ యాదవ్ పేరును చాలా కాలంగా టిడిపి నాయకత్వం పరిశీలిస్తోంది. కొన్ని కారణాలతో సుధాకర్ యాదవ్ పేరును ప్రకటించలేదని తెలుస్తోంది. సుధాకర్ యాదవ్‌ పేరును చంద్రబాబునాయుడు ఎట్టకేలకు ఖరారు చేసినట్టు సమాచారం. దీంతో త్వరలోనే బాబు పేరును ఖరారు చేసే అవకాశం లేకపోలేదు.

 డిఎల్‌కు లైన్‌క్లియర్

డిఎల్‌కు లైన్‌క్లియర్

మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరేందుకు లైన్‌క్లియర్ అయినట్టు టిడిపి వర్గాల్లో చర్చ సాగుతోంది. డిఎల్ టిడిపిలో చేరుతారనే చర్చ కొంత కాలంగా సాగుతోంది. 2019 ఎన్నికల్లో మైదుకూరు నుండి డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దింపాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. టిటిడి ఛైర్మెన్ పదవిని సుధాకర్ యాదవ్‌కు కట్టబెట్టడం ద్వారా 2019 ఎన్నికల్లో డిఎల్ రవీంద్రారెడ్డికి సుధాకర్ యాదవ్ నుండి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయంతో టిడిపి నాయకత్వం ఉంది. ఈ విషయమై టిడిపి నాయకత్వం సుధాకర్ యాదవ్ ‌తో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

 క్రియాశీలక రాజకీయాల్లోకి మళ్ళీ డిఎల్

క్రియాశీలక రాజకీయాల్లోకి మళ్ళీ డిఎల్

ఇటీవల కాలంలో డిఎల్ రవీంద్రారెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తాను మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్టు డిఎల్ రవీంద్రారెడ్డి ప్రకటించారు. 2014 ఎన్నికల సమయంలోనే డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. కానీ, ఏ స్థానం నుండి పోటీ చేసే విషయమై స్పష్టత రాని కారణంగా డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరలేదు. అయితే ఈ దఫా డిఎల్ టిడిపిలో చేరుతారనే టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

 కడపలో వైసీపీ అధిపత్యాన్ని దెబ్బతీసేందుకు

కడపలో వైసీపీ అధిపత్యాన్ని దెబ్బతీసేందుకు

కడప జిల్లాలో వైసీపీని దెబ్బతీసేందుకు ఇతర పార్టీల్లోని బలమైన నేతలను టిడిపి లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ ఆకర్ష్ ప్రక్రియను చేపట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించి టిడిపి అభ్యర్థి బిటెక్ రవీంద్రారెడ్డి విజయం సాధించడం ఆ పార్టీవర్గాల్లో ఉత్సాహన్ని నింపింది. ఆ సమయంలో వైసీపీ వ్యతిరేక వర్గీయులను టిడిపి కూడగట్టుకొంది. 2019 ఎన్నికల సమయంలో కూడ కడప జిల్లాలో వైసీపీ ఆధిపత్యానికి గండికొట్టేందుకుగాను ఆపరేషన్ ఆకర్ష్‌ను చేపట్టింది.

English summary
Tdp chief Chandrababu naidu likely to choose Putta Sudhakar Yadav for TTD chairman post.official orders will be release soon said telugudesam leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X