హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై దాడి ఎఫెక్ట్: బాబు కీలక నిర్ణయం, ఢిల్లీలో జాతీయస్థాయిలో చంద్రబాబు గళం

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం (రేపు 27-10-2018) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఐటీ దాడులు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడులు, తదనంతర పరిణామాలపై ఆయన జాతీయ మీడియాతో మాట్లాడనున్నారు. కేంద్రం కుట్రలు చేస్తుందని ఢిల్లీ వేదిక మీదుగా చెప్పనున్నారు.

<strong>ట్విస్ట్: 'జగన్‌పై ప్రాణాపాయంలేని దాడి జోస్యం నిజమైంది, సీఎం చేయాలనే పిచ్చి అభిమానమే'</strong>ట్విస్ట్: 'జగన్‌పై ప్రాణాపాయంలేని దాడి జోస్యం నిజమైంది, సీఎం చేయాలనే పిచ్చి అభిమానమే'

జాతీయస్థాయిలో చంద్రబాబు గళం

జాతీయస్థాయిలో చంద్రబాబు గళం

గవర్నర్ నరసింహన్ తీరుపై కూడా జాతీయస్థాయిలో చంద్రబాబు గళమెత్తనున్నారు. ఢిల్లీలో జాతీయ నేతలను కలిసి, రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వారికి వివరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ మీడియాతో మాట్లాడనున్నారు.

Recommended Video

చంద్ర బాబు పై తలసాని మండి పాటు
 జగన్ పైన దాడి, ఆపరేషన్ గరుడ

జగన్ పైన దాడి, ఆపరేషన్ గరుడ

జగన్ పైన దాడి, ఆపరేషన్‌ గరుడ తదితర అంశాలను కూడా దేశ ప్రజల ముందు ఉంచనున్నరు. విభజనతో నష్టపోయిన ఏపీకి కేంద్రం మొండిచేయి చూపడం, టిట్లీ తుఫానుపై స్పందించకపోవడం, విభజన చట్టం పెండింగ్ అంశాలపై దిల్లీ వేదిక నుంచి ఆయన కేంద్రాన్ని నిలదీయనున్నారు. గవర్నర్ వ్యవస్థను కేంద్రం వాడుకుంటోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన పర్యటనపై ఆసక్తి నెలకొంది.

వారి పైనా ఐటీ దాడులు

వారి పైనా ఐటీ దాడులు

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ పైన కూడా ఐటీ దాడులు చేశారని చంద్రబాబు అన్నారు. ఐటీ దాడుల వల్ల ప్రాజెక్టుల పనులకు ఇబ్బందులు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే లాభాపేక్ష లేకుండా పని చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారని చెప్పారు.

విజయసాయి రెడ్డిపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం

విజయసాయి రెడ్డిపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డిపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం మండిపడింది. డీజీపీ ఠాకూర్ పైన విజయసాయి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అది సరికాదన్నారు. డీజీపీపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Delhi tour after attack on YS Jagan Mohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X