వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎందులో చెప్పండి: బాబు పోటీ వ్యాఖ్యపై హరీష్ కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

మెదక్: కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనతో పోటీ పడాలన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పైన తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత హరీష్ రావు మంగళవారం స్పందించారు. అభివృద్ధిలో పోటీ పడాలని సూక్తులు చెబుతున్న చంద్రబాబు తన హయాంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.

చంద్రబాబు హాయాంలో తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మించారా చెప్పాలన్నారు. నాడు రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులే ఉన్నాయన్నారు. ఏ విషయంలో ఆయనతో పోటీపడమంటారో చెప్పాలన్నారు. బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసుకునే సత్తా తమకుందన్నారు. తెలుగు ప్రజలందర్ని కలిపే సత్తా తమకే ఉందంటూ విడిపోయిన తెలంగాణని మళ్లీ సీమాంధ్రలో కలుపుతామంటే ఆ పార్టీలో తెలంగాణ ప్రాంత నాయకులు ఎలా ఉంటారన్నారు.

 Chandrababu did nothing for Telangana: Harish Rao

సిఎల్పీ నేతలపై తర్జన భర్జన

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సీఎల్పీ నేత పదవి కోసం పోటా పోటీ నెలకొంది. ఎన్నికల్లో కొందరు కాంగ్రెసు నేతలు మినహా మిగిలిన నేతలంతా మట్టికరిచిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ ఇరవై ఒక్క స్థానాలకే పరిమితమైంది. సీనియర్ నేతలు జానారెడ్డి, డికె అరుణ, గీతారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాంరెడ్డి వెంకట్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, టి జీవన్ రెడ్డి మాత్రమే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ పదవి కోసం పోటీ పెరిగింది.

సీఎల్పీ నేతకు కేబినెట్ హోదా దక్కడంతోపాటు పార్టీలో ప్రాధాన్యం ఉంటుంది. దీంతో, ఐదేళ్ల పాటు పార్టీని ముందుండి నడిపేందుకు అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుందనే ఆసక్తి తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో నెలకొంది. టిపిసిసిలో ఇప్పుడు అందరమూ సమానమేనని కొందరు నేతలు అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయామన్న బాధ తొలిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Chandrababu Naidu did nothing for Telangana, says Harish Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X