అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వచ్చేవాళ్లు ఇప్పుడే రండి.. ఆలస్యంగా అమరావతికి వస్తే మీకే నష్టం: బాబు కీలక వ్యాఖ్య

ఇప్పుడు గనుక రాష్ట్రానికి రాలేకపోతే ఆ తర్వాత అసలే రాలేరని హెచ్చరించారు. గురువారం ఉదయం హెచ్ఓడీలతో సమావేశమైన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: మూడో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తీర్చిదిద్దేందుకు చంద్రబాబు అన్ని విధాలు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈమధ్యే అమెరికా పర్యటనకు కూడా వెళ్లొచ్చారు.

రాష్ట్రానికి కంపెనీలను తీసుకురావడం ద్వారా అటు నిరుద్యోగం లేకుండా చేయడంతో పాటు ఇటు రాష్ట్ర అభివృద్ది కూడా సాధ్యపడుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పెట్టుబడిదారులకు ఆయన ఓ కీలక సూచన చేశారు. ఏపీలో పరిశ్రమలు స్థాపించాలనుకునే ఔత్సాహికులు త్వరగా అమరావతికి రావాలని పిలుపునిచ్చారు.

chandrababu directs investors to come to amaravati early

ఇప్పుడు గనుక రాష్ట్రానికి రాలేకపోతే ఆ తర్వాత అసలే రాలేరని హెచ్చరించారు. గురువారం ఉదయం హెచ్ఓడీలతో సమావేశమైన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతం అన్ని రంగాల పెట్టుబడులకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. కాబట్టి ఔత్సహికులు త్వరగా పెట్టుబడులకు సిద్దం కావాలని, లేదు.. భవిష్యత్తులో రావాలని భావిస్తే చాలా నష్టపోతారని తెలిపారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. త్వరతిగతిన అనుమతులిచ్చి, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

English summary
AP CM Chandrababu Naidu suggested investors to come to amaravati early.He said if they are late they will be lost some benifits
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X