చంద్రబాబుకు హోదా సెగ: విశాఖలో పరిస్థితిపై ఆరా, పర్యటనలో మార్పు

చంద్రబాబుకు ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన నిరసన సెగ తాకినట్లే ఉంది. విశాఖ పర్యటనలో ఆయన అందుకే మార్పులు చేసుకున్నట్లు చెబుతున్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నంలో తలపెట్టన నిరసన సెగ తాకినట్లే ఉంది. అందుకే ఆయన తన విశాఖపట్నం పర్యటనలో మార్పులు చేసుకున్నట్లు చెబుతున్నారు.

విశాఖపట్నంలో రేపు (శుక్రవారం) భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఆ సదస్సుకు ఆయన విశాఖపట్నం రావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఆయన గురువారం సాయంత్రం ఆరు గంటలకు విశాఖ నగరానికి రావాల్సి ఉంది. అయితే, విశాఖలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన మార్పులు చేసుకున్నట్లు సమాచారం.

Chandrababu faces heat of the special category status protest

ఆయన గురువారం హైదరాబాద్ వచ్చిన రేపు శుక్రవారం ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే, విశాఖపట్నంలో నెలకొన్న పరిస్థితిపై ఆయన గురువారం ఆరా తీసినట్లు సమాచారం. విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడితో ఆయన సమావేశమయ్యారు.

విశాఖలో నెలకొన్న పరిస్థితులను చంద్రబాబు మంత్రులను అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. హోదా ఆందోళన పేరుతో ఎవరూ రోడ్ల మీదికి రాకుండా అడ్డుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. దీంతో విశాఖలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

అయితే, గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసే ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కావడానికి చంద్రబాబు హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. రాజభవన్‌లో గవర్నర్ ఇచ్చే విందుకు ఆయన హాజరవుతారు. దీనివల్లనే ఆయన విశాఖ పర్యటనలో మార్పు జరిగినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+