వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సహించం.. జగన్‌ను ఎదుర్కోలేకనే బీజేపీపై టీడీపీ విమర్శలు: విష్ణుకుమార్ రాజు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రత్యేక హోదా విషయంలో ఏపీలోని అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ, వైసీపీ, జనసేన ఈ మూడు పార్టీలు కుమ్మక్కై టీడీపీని బలహీనపర్చాలని చూస్తున్నాయని స్వయంగా సీఎం చంద్రబాబు పలుమార్లు వ్యాఖ్యానించారు.

Recommended Video

రాష్ట్రవ్యాప్తంగా మొదలవ్వనున్న నిరసనలు...!

నేడే క్లైమాక్స్?: 'అవిశ్వాసం' చర్చకు వస్తుందా!, ఉధృతం కానున్న హోదా పోరు.. నేడే క్లైమాక్స్?: 'అవిశ్వాసం' చర్చకు వస్తుందా!, ఉధృతం కానున్న హోదా పోరు..

ఈ ఆరోపణలపై తాజాగా మరోమారు స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే తెలుగుదేశం పార్టీ తమను టార్గెట్‌ చేసిందని ఆయన ఆరోపించారు. పార్టీ 39వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆనయన పాల్గొన్నారు.

chandrababu failed to face jagan says vishnu kumar raju

ఈ సందర్భంగా టీడీపీపై ఆయన పలు ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఏకపక్షంగా నిర్వహిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో తప్పులు ఎత్తిచూపితే మైక్‌ కట్‌ చేస్తున్నారని, అరిచి గోల చేస్తే ఒక్కరోజు మాట్లాడే అవకాశం ఇచ్చారని అన్నారు. అందుకే జగన్‌ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి ఉంటారని పేర్కొన్నారు.

విశాఖలో భూకుంభకోణాల వెనుక ఉన్నది టీడీపీ మంత్రి కాదా? అని ప్రశ్నించారు. విశాఖ భూకుంభకోణంలో సిట్ దర్యాప్తును ఎందుకు నిలిపివేశారని నిలదీశారు. భూసేకరణ పేరిట పేదల దగ్గర భూమి తీసుకుని వుడాకి ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. భూ కుంభకోణాల్లో భీమిలి నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ సహా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసనలు తెలియజేసే హక్కు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు, అభివృద్ధికి బీజేపీ ఇప్పటికీ కట్టుబడి ఉందన్నారు. అనవసరంగా తమపై బురద జల్లాలని చూస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.

English summary
BJP MLA Vishnu Kumar Raju again said that CM Chandrababu Naidu has failed to face YS Jagan politically, that's why he is criticising BJP unnecessarily
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X