వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రామ సచివాలయ ఫలితాలపై చంద్రబాబు తప్పుడు ప్రచారం : వైసీపీ

|
Google Oneindia TeluguNews

ఇటివల ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి విడుదల చేసిన సచివాలయ ఉద్యోగుల పరీక్షలో అక్రమాలు జరిగాయని చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ముఖ్యంగా ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ యువకులను గందోరగోళంలోకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా పరీక్ష జరిగిన కొద్ది గంటల్లోనే కీ ,కూడ విడుదల చేశామని చెప్పిన ఆయన పేపర్ లీక్ అయినప్పుడే ఎందుకు పత్రికల్లో రాలేదని ప్రశ్నించారు. పరీక్ష అంతా అయిపోయి, ఫలితాలు వెలువడ్డ తర్వాత లీకులు జరిగాయాని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ప్రచారాన్ని యువకులు నమ్మవద్దని అంబటి సూచించారు.

సచివాలయ ఉద్యోగులు పేపరును అయిదు లక్షలకు అమ్ముకున్నారని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు నాయుడు విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటీ దుష్ప్రచారం చేసి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని అన్నారు.

 Chandrababu false campaign on Secretariat results: Ambati Rambabu

అయిదు లక్షలకు పేపర్ అమ్ముకుంటే కౌలు రైతు కుమారుడికి, మొదటి ర్యాంకు ఎలా వస్తుందని అంబటి ప్రశ్నించారు. దీంతోపాటు ఆటో ,బస్‌,వ్యాన్ డ్రైవర్‌ల కొడుకులకు కూడ ర్యాంకులు వచ్చాయని అన్నారు. చంద్రబాబు చేసే ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పారు. పరీక్షలు పారదర్శకంగా జరిగాయని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగాల కల్పనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అంత్యంత శ్రద్ద వహించారని అంబటి వివరించారు.

English summary
Chandrababu Naidu and his son Lokesh have been trying to defame the governament on village Secretariat employment exam, said amabati rambabu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X