వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడిగిందే అడుగుతూ కాలయాపన...ఇదేం పద్ధతి:కేంద్రంపై మండిపడ్డ చంద్రబాబు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

Recommended Video

అడిగిందే అడుగుతారా, నేను లేఖ రాస్తా..చంద్రబాబు

అమరావతి:కడప ఉక్కు పరిశ్రమపై కేంద్రం అడిగిన ప్రశ్నలే రెండు మూడు సార్లు అడుగుతూ కాలయాపన చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఢిల్లీలోని ఎంపీలతో, కడప ఉక్కు దీక్ష నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

మొన్నటిదాకా తెలంగాణ పరిశ్రమపై స్పష్టత రాలేదని, బయ్యారం భూములు, నీళ్ల వివరాలు అందాల్సి ఉందని చెప్పుకొచ్చారని, ఇప్పుడు ఉక్కు దీక్ష మొదలయ్యాక మరో రెండు కొత్త కొర్రీలు వేశారని చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయాలపై కేంద్రానికి వెంటనే మరో లేఖను రాస్తానని, గురువారం భేటీలో ఆ లేఖను అందించాలని ఎంపీలకు సిఎం చంద్రబాబు సూచించారు.

ఢిల్లీలో...ఇదీ జరిగింది

ఢిల్లీలో...ఇదీ జరిగింది

కడపలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలన్న డిమాండుతో గత ఎనిమిది రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న టిడిపి ఎంపీ, ఎమ్మెల్సీలు సీఎం రమేష్‌, బీటెక్‌ రవిల ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్పష్టమైన హామీ రాబట్టుకోవడానికి టిడిపి పార్లమెంటరీ పార్టీ బృందం మంత్రి బీరేంద్ర సింగ్‌ను కలిసింది. ఇప్పటివరకూ జరిగిన పరిణామాలన్నింటినీ వివరిస్తూ నాలుగు పేజీల వినతి పత్రం సమర్పించింది. ఈ విషయమై సుమారు గంటన్నరపాటు ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడారు.

కేంద్ర మంత్రి...ఏం చెప్పారంటే?

కేంద్ర మంత్రి...ఏం చెప్పారంటే?

కొంత ఆలస్యమైనప్పటికీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు తాము సానుకూలంగా ఉన్నామని, తనపై విశ్వాసం ఉంచాలని కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ టిడిపి బృందాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాము అడిగిన సమాచారం అందిన వెంటనే తదుపరి కార్యాచరణ మొదలు పెడతామని ఆయన చెప్పారు. అయితే కేంద్రం అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22నే పంపిందని, తమవైపు ఏమీ పెండింగ్‌ లేదని టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ స్పష్టం చేశారు. కానీ మంత్రి బీరేంద్ర సింగ్ ఆ విషయాన్ని పట్టించుకోకుండా తాము మరికొన్ని విషయాలపై స్పష్టత కోరామని చెప్పారు.

మంత్రి వివరణతో...మండిపడ్డ బాబు

మంత్రి వివరణతో...మండిపడ్డ బాబు

కేంద్రం అడిగిన అంశాలపై వివరణ ఇచ్చినా మరికొన్ని వివరాలపై స్పష్టత ఇవ్వలేదంటూ మంత్రి బీరేంద్రసింగ్ మాట్లాడటంపై సిఎం చంద్రబాబు మండిపడ్డారు.
ఉక్కు దీక్ష ప్రారంభమయ్యాక కేంద్రం మరో రెండు కొత్త కొర్రీలు వేసిందని, మొన్నటి దాకా తెలంగాణ ప్లాంట్‌పై స్పష్టత లేదన్నారని చంద్రబాబు గుర్తుచేశారు. బయ్యారం భూములు, నీళ్ల వివరాలు రాలేదని అన్నారని చంద్రబాబు తెలిపారు. కడపలో రాష్ట్రం ఇచ్చే భూములపై ఏ వివాదమూ లేదని స్పష్టంచేశారు. కానీ, కావాలనే కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. విభజన చట్టంలో హామీ నెరవేర్చేందుకు ఎందుకీ జాప్యమని నిలదీశారు.

కేంద్రం..అభ్యంతరం ఏంటి?

కేంద్రం..అభ్యంతరం ఏంటి?

2020లోగా మూడు గనులు రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలోకి వస్తాయని, ప్రస్తుతం ఇచ్చిన భూముల్లో 87 మిలియన్‌ టన్నుల ఖనిజం ఉందన్నారు. మూడు గనులు అందుబాటులోకి వస్తే 266 మిలియన్‌ టన్నుల నిక్షేపాలు ఉంటాయని చంద్రబాబు వివరించారు. ఉక్కు పరిశ్రమ పెట్టేందుకు 150 మిలియన్‌ టన్నులు ఉంటే సరిపోతుందన్నారు. 116 మిలియన్‌ టన్నుల నిక్షేపాలు ఉంటే ఇంకా కేంద్రానికి అభ్యంతరం ఎందుకు?...అని చంద్రబాబు ప్రశ్నించారు. కర్మాగారం పూర్తిచేసేందుకు రెండేళ్లు పడుతుందని, ఆ లోపు మిగిలిన మూడు గనులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రం పట్ల కేంద్రం తన మొండి వైఖరిని వీడి హామీలు నెరవేర్చాలని చంద్రబాబు కోరారు.

 ఎంపీల...కార్యాచరణ ప్రణాళిక

ఎంపీల...కార్యాచరణ ప్రణాళిక

కడప ఉక్కు దీక్ష నేతలతో, దిల్లీలోని ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్ తో జరిపిన చర్చల గురించి సిఎంకు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వివరించారు. కాల వ్యవధితో కూడిన హామీ ఇవ్వలేదని, దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేశ్‌ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పినా మంత్రి పట్టించుకోలేదనిఎంపి కొనకొళ్ల చెప్పారు. కేంద్ర మంత్రి తాజా ప్రకటన నెపాన్ని రాష్ట్రంపై నెట్టి మరింత కాలయాపన చేసే ప్రయత్నంగా కనబడుతోందని ఎంపీ రవీంద్ర కుమార్‌ విమర్శించారు. తొమ్మిది అంశాలకు గాను రెండింటిలో స్పష్టత లేదని మంత్రి చెబుతున్నారని.. అయితే, రాష్ట్రం నుంచి గతంలోనే వివరణ ఇచ్చామని తెలిపారు. క్లారిటీ లేదనుకున్నప్పుడు ఇంతవరకు ఎందుకు రాష్ట్రప్రభుత్వానికిలేఖరాయలేదని ప్రశ్నించారు. దీక్షల వల్ల కేంద్రంలో కదలిక వచ్చిందని, తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన స్పష్టంచేశారు.

English summary
Amaravati:CM Chandrababu said that the Center asking queries about the Kadapa steel plant again and again for delay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X