సబ్బంహరికి నోటీసుల షాక్ .. వైసీపీ పాలకుల తీరే వేరని చంద్రబాబు ఫైర్
సబ్బంహరికి జీవీఎంసీ అధికారులు మరోమారు నోతీసులిచ్చారు. దీంతో వైసీపీ పాలకుల తీరే వేరు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నవాళ్లు ఎక్కడైనా రాష్ట్రాభివృద్ధికి రాత్రీపగలూ ఆలోచిస్తారని, కానీ వైసిపి పాలకుల తీరు వేరుగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వ పాలన పై నిప్పులు చెరిగిన చంద్రబాబు ప్రతిపక్ష నేతలపై కక్ష ఎలా తీర్చుకోవాలి అన్న ఆలోచనలతో రాత్రిళ్ళు నిద్ర కూడా పోతున్నట్టు లేరు అంటూ ఫైర్ అయ్యారు. అందుకు ఉదాహరణ సబ్బం హరికి మళ్ళీ పంపించిన నోటీసులు అంటూ పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు.

అర్దరాత్రి అరెస్టులు, చీకట్లో కూల్చివేతలు .. చంద్రబాబు అసహనం
ఎక్కడైనా అధికార యంత్రాంగాన్ని కూడా ఉత్తేజపరుస్తూ అభివృద్ధి చేసేందుకు ముందుకు వెళ్లాల్సిన ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తిస్తుందా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారని, చీకట్లో కూల్చివేతలకు పాల్పడుతున్నారని, పొద్దుపోయాక నోటీసులు ఇస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మాజీ ఎంపీ సబ్బం హరికి మళ్ళీ నోటీసులు ఇవ్వడంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు మాజీ ఎంపీ సబ్బం హరి స్థలంలో నిర్మాణాల కూల్చివేత పై హైకోర్టు సోమవారం స్టేటస్ కో విధించింది .

ఆ భవనాల తొలగింపుకు రాత్రివేళ నోటీసులు అంటించి వెళ్ళారంటూ ఆగ్రహం
ఈలోపే మూడు రోజుల్లో భవనాలను తొలగించాలని ప్రభుత్వం మరో మారు నోటీసులు పంపించింది అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నోటీసులు కూడా రాత్రివేళ అంటించి వెళ్లారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగిన చంద్రబాబు రాష్ట్రంలో కక్ష రాజకీయాల కోసం పాలనా యంత్రాంగాన్ని , పాలనా వ్యవస్థను భ్రష్టు పట్టించడం రాష్ట్రానికి చేటు చేస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై ప్రభుత్వ ఈ రకంగా స్పందించడం వెనుక వేధింపు లక్ష్యంగా కనిపిస్తోంది అంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

సబ్బంహరికి మరోమారు నోటీసుల షాక్ .. చంద్రబాబు ఫైర్
టిడిపి నేత మాజీ ఎంపీ సబ్బం హరి కి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విశాఖపట్నంలో రిజర్వు ఓపెన్ స్పేస్ లో భవనాలను నిర్మించారని, మూడు రోజుల్లో వాటిని తొలగించాలని జివిఎంసి అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే నిర్మాణాల కూల్చివేత లపై ఏపీ హైకోర్టు సోమవారం వరకు స్టే విధించింది. అయినప్పటికీ జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వడం టీడీపీ అధినేత చంద్రబాబును , అలాగే టిడిపి నేత సబ్బం హరిని షాక్ కు గురి చేసింది. ఈ క్రమంలోనే చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా వైసిపి పాలకుల తీరుపై విమర్శలు గుప్పించారు.