అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమాషాలు చేస్తున్నారా?: క్షురకులపై ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు, సమ్మె విరమణ

|
Google Oneindia TeluguNews

Recommended Video

తమాషాలు చేస్తున్నారా..? : క్షురకులపై ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్‌ను అడ్డుకుని ఆందోళన చేపట్టిన నాయీ బ్రాహ్మణుల(క్షురకులు)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనం, ఉద్యోగాల క్రమబద్ధీకరణతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ తదితర సౌకర్యాలను కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన ఆలయాల్లో క్షురకులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

దీంతో మొక్కులు చెల్లించుకొనేందుకు ఆలయాలకు వెళ్లిన భక్తులు తలనీలాలు
సమర్పించుకొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో తమ డిమాండ్లను తీర్చాలంటూ చంద్రబాబు కారును అడ్డుకున్నారు క్షురకులు. దీంతో చంద్రబాబు కొంత ఆగ్రహానికి గురయ్యారు చంద్రబాబు.

 పద్ధతి కాదంటూ..

పద్ధతి కాదంటూ..

సమస్య పరిష్కరించుకొనే పద్ధతి ఇది కాదని హితవు పలికారు. ప్రతి ఆలయంలో ఒక కేశ ఖండన టికెట్‌పై రూ.25లు ఇస్తామని సీఎం స్పష్టంచేశారు. ఇంతకుముందు రూ.12లు ఇస్తే దాన్ని సగం కన్నా ఎక్కువ పెంచుతున్నాని చంద్రబాబు చెప్పారు. కొన్ని ఆలయాల్లో కేవలం రూ.5లు మాత్రమే ఇస్తున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లగా..అన్ని దేవాలయాల్లో ఒక్కో కేశఖండని టిక్కెట్‌పై రూ.25లు చొప్పున ఇస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టంచేశారు. ఆ భారాన్ని దేవాలయాలే భరించాలని చెప్పారు.

ఉపేక్షించేది లేదంటూ..

ఉపేక్షించేది లేదంటూ..

సమస్యను అర్థం చేసుకొని అంతా విధుల్లో చేరాలని సూచించారు. ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానంటే ఉపేక్షించబోమని హెచ్చరించారు. నాయీ బ్రాహ్మణులను నిలువరించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించగా.. ముఖ్యమంత్రి వారిని వారించారు.

 నచ్చితే చేయండి.. లేదంటే..

నచ్చితే చేయండి.. లేదంటే..

అయితే, మిమ్మల్ని ఎవరు ఇక్కడకు రానిచ్చారంటూ క్షురకులపై చంద్రబాబు హుంకరించారు. ‘నచ్చితే చెయ్యండి లేకుంటే వెళ్లిపోండి' అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో జరిపిన చర్చలు విఫలం కావడంలో సచివాలయంలో సీఎం కాన్వాయ్‌ను నాయీ బ్రాహ్మణులు అడ్డుకున్నారు. తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. వినవయ్యా విను అంటూ ముఖ్యమంత్రి బెదిరింపు ధోరణితో మాట్లాడారు.

తమాషాలు చేస్తున్నారా?

తమాషాలు చేస్తున్నారా?

అంతేగాక, కనీస వేతనం ఇవ్వడం కుదరదని చంద్రబాబు తేల్చిచెప్పారు. జీతాలు పేంచేది లేదని, ముందు విధుల్లో చేరాలని తేల్చి చెప్పారు. కేశఖండనకు రూ. 25 రూపాయలు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు. సీఎం ప్రతిపాదనను క్షురకులు వ్యతిరేకించారు. దీంతో తమాషాలు చేస్తున్నారా? అంటూ వేలు చూపించి చంద్రబాబు హెచ్చరించారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై నాయీ బ్రాహ్మణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీస వేతనం ఇచ్చేంత వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు.

సమ్మె విరమణ

కాగా, సీఎం చంద్రబాబునాయుడుతో మరోసారి నాయీ బ్రాహ్మణుల సంఘం నేతలు భేటీ అయ్యారు. సచివాలయం వద్ద జరిగిన దానికి క్షమాపణలు చెప్పారు. అంతేగాక, తమ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. తమకు టీడీపీ ప్రభుత్వమే న్యాయం చేసిందన్నారు. సమ్మె విరమణ ప్రకటనను చంద్రబాబు స్వాగతించారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu fired at barbers for asking more salaries and other facilities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X