హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటకలో దారుణం, ఏపీపై కన్ను: బీజేపీపై చంద్రబాబు ఫైర్, జగన్ పార్టీ మౌనమెందుకో?

|
Google Oneindia TeluguNews

అమరావతి: కర్ణాటకలో రాజకీయ పరిస్థితి దారుణంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం సాయంత్రం యడ్యూరప్ప ప్రభుత్వం బలనిరూపణ పరీక్ష ఎదుర్కొనున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ విషయంపై స్పందించారు.

కర్ణాటక బలనిరూపణ: ఇలా చేస్తే బీజేపీదే అధికారం, కీలక మార్గాలివేకర్ణాటక బలనిరూపణ: ఇలా చేస్తే బీజేపీదే అధికారం, కీలక మార్గాలివే

మెజార్టీ లేకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ గవర్నర్‌ను కోరడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల్లో నీతులు చెప్పిన బీజేపీ.. ఇప్పుడు చేస్తున్నదేమిటని నిలదీశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడం సరికాదన్నారు.

మాకు ఈరోజేం ముఖ్యమైనది కాదు: బీజేపీపై కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలుమాకు ఈరోజేం ముఖ్యమైనది కాదు: బీజేపీపై కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

 Chandrababu fires at BJP for Karnataka politics

కర్ణాటకలో రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్దంగా ముందుకు నడవాలని అన్నారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలతో ప్రభుత్వాన్ని కొనసాగించాలనుకుంటోందని అన్నారు. మెజార్టీ లేకున్నా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోందని మండిపడ్డారు.

సుప్రీం తీర్పు ఎఫెక్ట్: సీఎం యడ్యూరప్ప కార్యాలయానికి తాళం పడింది?సుప్రీం తీర్పు ఎఫెక్ట్: సీఎం యడ్యూరప్ప కార్యాలయానికి తాళం పడింది?

తమిళనాడులో చేసిన కుట్రలను కర్ణాటకలో చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం కన్నుపడిందని అన్నారు. శాంతి భద్రతల విషయంలో కుట్రలు చేస్తే మక్కెలిరగ కొడతామని హెచ్చరించారు. కర్ణాటక పరిణామాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు.

English summary
Andhra Pradesh CM and TDP president Nara Chandrababu Naidu fired at BJP for politics to come back to power in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X