శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీలైతే సాయం చేయండి! కానీ, ఆటంకాలు కలిగిస్తే ఊరుకోం: చంద్రబాబు వార్నింగ్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రతిపక్ష పార్టీల తీరుపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. టిట్లీ తుఫాను ధాటికి అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలో సహాయక చర్యలకు ఆటంకం కలిగించవద్దని, అలా చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

ఎన్టీఆర్, విజయ్ దేవరకొండకు లోకేష్ కృతజ్ఞతలు: తమ వంతుగా అంటూ బ్రాహ్మణిఎన్టీఆర్, విజయ్ దేవరకొండకు లోకేష్ కృతజ్ఞతలు: తమ వంతుగా అంటూ బ్రాహ్మణి

రేయింబవళ్లు శ్రమిస్తుంటే..

ప్రభుత్వం యంత్రాంగం మొత్తం ఉద్దానంలోని పలాస, ఇతర ప్రాంతాల్లో రేయింబవళ్లు శ్రమిస్తుంటే కొందరు కావాలనే రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సీఎం ట్వీట్‌ చేశారు.

సాయం చేయాలి కానీ.. రెచ్చగొట్టొద్దు..

సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని.. అలాంటి వారిపై చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. చేతనైతే సాయం చేయాలి కానీ రెచ్చగొట్టి అడ్డంకులు సృష్టించవద్దంటూ చంద్రబాబు హితవు పలికారు.

సమాచారం కోసం ప్రత్యేక యాప్

తుఫాను కారణంగా నష్టపోయిన వారి కోసం ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేకమైన యాప్‌ను కూడా రూపొందించింది. ప్రజలు దీని ద్వారా తమకు నష్ట సమాచారాన్ని తెలియజేయాలని సీఎం కోరారు. కాగా, టిట్లీ తుఫాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి, జీడి, మామిడి, అరటి పంటలు దెబ్బతిన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడికక్కడ విద్యుత్‌ స్తంబాలు కూలిపోవడంతో గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది క్షేత్రస్థాయిలో యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు.

దసరా శుభాకాంక్షలు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచంలో ఉన్న తెలుగువారందరికీ విజయదశమి పండగ శుభాకాంక్షలు తెలిపారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Wednesday fired at opposition parties on cyclone issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X