వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీవితంలో చూల్లేదు: బాబుకు కోపమొచ్చింది, ప్లాన్ లేదు: శ్రీకాంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడలో కనకదుర్గ గుడి ప్లై ఓవర్ పనులు దక్కించుకున్న సోమా కంపెనీ ప్రతినిధుల పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం తీవ్రంగా మండిపడ్డారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రబాబు ఆశ్చర్యపోయారు.

పనుల్లో పురోగతి కనపడడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటన తన జీవితంలో తొలిసారి చూస్తున్నానన్నారు. జులై 1న మరోసారి వచ్చి పనులను పరిశీలిస్తానని, పురోగతి కనిపించకపోతే కఠిన చర్యలు తప్పవని సోమా ప్రతినిధులను హెచ్చరించారు.

Chandrababu fires at Soma company executives

కృష్ణా పుష్కరాలపై...

కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా, ఘాట్ల నిర్మాణ పనులు నత్త నడక సాగుతున్నాయన్నారు. ఆగస్టు 12వ తేదీన పుష్కరాలు ప్రారంభమవుతాయని చెప్పారు. అన్ని పనులూ నెలన్నర రోజుల్లోగా పూర్తి కావాలని డెడ్ లైన్ విధించారు. పనులు పూర్తి కాకుంటే ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు.

దేవినేని వల్లే: శ్రీకాంత్ రెడ్డి

కృష్ణా జలాల విషయంలో సరైన ప్రణాళికతో మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వెళ్లలేదని, తద్వారా ఏపీకి నష్టం చేస్తున్నారని వైసిపి నేత శ్రీకాంత్ రెడ్డి గురువారం నాడు మండిపడ్డారు. నీటి విషయంలో ప్రభుత్వానికి ఓ ప్రణాళిక అంటూ లేదన్నారు.

రాయలసీమను చిన్న చూపు చూస్తూ ప్రాజెక్టులను గాలికి వదిలేశారన్నారు. ఏపీ ప్రభుత్వ తీరును తాను ఖండిస్తున్నానని చెప్పారు. ప్లాన్‌తో వెళ్లకుండా దేవినేని నిర్లక్ష్యం, ఏపీ ప్రయోజనాలు దెబ్బతీసిందన్నారు. కృష్ణా డెల్టాకు, రాయలసీమకు అన్యాయం చేశారన్నారు.

విజయవాడలో కనకదుర్గ గుడి ప్లై ఓవర్ పనులు దక్కించుకున్న సోమా కంపెనీ ప్రతినిధుల పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం తీవ్రంగా మండిపడ్డారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రబాబు ఆశ్చర్యపోయారు.

రాయలసీమ అంటే ఎందుకు అంత కోపమని ప్రశ్నించారు. సీమ ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారన్నారు. దేవినేని ఉమకు రాయలసీమ అంటే ద్వేషమని ఆరోపించారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని తాము అంటే పైపెచ్చు ప్రభుత్వం ఎదురు దాడి చేస్తోందన్నారు. అభివృద్ధి అడ్డుకునే ఉద్దేశ్యం తమకు లేదన్నారు.

English summary
AP CM Chandrababu Naidu fires at Soma company executives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X