వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుప్పంలో వైసీపీకి డిపాజిట్ రానివ్వను .. గేరు మార్చి తడాఖా చూపిస్తానన్న చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అధికార వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు కుప్పం జగన్ జాగీరు కాదని వ్యాఖ్యానించారు. కుప్పంలోనే మకాం వేసి వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. పుంగనూరులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సైతం బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆరోపించిన చంద్రబాబు, డబ్బులు తెచ్చి కుప్పంలో ఓటర్లకు మంచి వ్యవస్థను నాశనం చేశారు అని నిప్పులు చెరిగారు.

 రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారుతోందని ఆవేదన

రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారుతోందని ఆవేదన

రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని జగన్ సర్కారు పాలనపై మండిపడిన చంద్రబాబు, రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామారాయుడు అని చంద్రబాబు అభివర్ణించారు. జగన్ రాష్ట్రాన్ని స్వాహా చేయాలని కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తిన చంద్రబాబు రాజ్ పేట లో రోడ్ షోలో భాగంగా వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు . కార్యకర్తలు తెగించి ముందుకుపోవాలని దిశానిర్దేశం చేసిన చంద్రబాబు వైసిపి పాలనలో రాష్ట్రానికి వచ్చినవి లేవని, అన్నీ పోయేవే అని తీవ్ర విమర్శలు గుప్పించారు.

పుంగనూరులో పెద్దిరెడ్డి కి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తా

పుంగనూరులో పెద్దిరెడ్డి కి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తా

యువత భవిత అంధకారంలో పడిపోయిందని చంద్రబాబు విమర్శించారు.

స్పీడుగా వైసీపీపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చిన చంద్రబాబు పుంగనూరులో పెద్దిరెడ్డి కి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తానని పేర్కొన్నారు . గేరు మార్చి తన తడాఖా చూపిస్తానంటూ హెచ్చరించిన చంద్రబాబు రాజధాని , ప్రత్యేక హోదా , పోలవరం, విశాఖ ఉక్కు మొత్తం పోయాయని మండిపడ్డారు. సీఎం జగన్ కు సెంటిమెంట్ అంటే తెలియదని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు.

వైసీపీ పాలనపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

వైసీపీ పాలనపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

ఇసుక స్మగ్లింగ్ , ఎర్ర చందనం ద్వారా పెద్దిరెడ్డి దోచుకుంటున్నారని ఆరోపించారు . పేదల రక్తాన్ని జలగల్లాగా తాగుతున్నారని విమర్శించారు చంద్రబాబు. రైతులను నిండా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండో రోజు కుప్పం పర్యటనలో భాగంగా రాజ్ పేట లో, కుప్పం నియోజకవర్గం కడపల్లి పంచాయతీ పోడూరు గ్రామంలో పర్యటించిన చంద్రబాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్త కిష్టప్ప కుటుంబాన్ని పరామర్శించారు .పార్టీ తరఫున 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని చంద్రబాబు తెలిపారు.

English summary
TDP chief Chandrababu Naidu has lashed out at the ruling YCP government. Chandrababu who is currently on a tour of Kuppam, commented that kuppam not Jagan's jagir. Chandrababu said that he would stay in the kuppam and prevent deposits to the YCP. Chandrababu, said that he would prevent deposits to Peddireddy in Punganur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X