• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేవినేని కాన్వాయ్ అడ్డగింత, చట్టాన్ని చుట్టంలా మార్చుకున్నారని జగన్ సర్కార్ పై చంద్రబాబు ధ్వజం

|

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాన్వాయ్ ను అడ్డుకోవడం హేయమైన చర్య అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి హింసించి ఆనందించటం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. దేవినేని ఉమ కాన్వాయ్ ను అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడిన చంద్రబాబు, ఏపీ పోలీసుల తీరుపై, అధికార పార్టీ తీరుపై ఫైర్ అయ్యారు.

దేవినేని కాన్వాయ్ ను ఎందుకు అడ్డుకున్నారు ? చంద్రబాబు ధ్వజం

దేవినేని కాన్వాయ్ ను ఎందుకు అడ్డుకున్నారు ? చంద్రబాబు ధ్వజం


తప్పుడు కేసుల్లో ఇరికించి, అన్యాయంగా బనాయించిన అక్రమ కేసులో జైలుకు పంపించి బెయిల్ మీద తిరిగి వస్తున్న క్రమంలో దేవినేని ఉమా కాన్వాయ్ ను అడ్డుకోవడం దుర్మార్గమని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పై పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఏవిధంగా వాహనాలు నిలిపి వేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. చట్టాన్ని అధికారపక్షం చుట్టంలా మార్చుకుంటుందని చంద్రబాబు ఆక్షేపించారు.దేవినేని ఉమ హనుమాన్ జంక్షన్ వద్దకు వచ్చిన తర్వాత హనుమాన్ ఆలయంలో పూజలు చేస్తారని పోలీసులే దగ్గరుండి గుడి తాళాలు వేయించడం ఎంతవరకు సమంజసం అని చంద్రబాబు నిలదీశారు. జనం నీరాజనాలు పలుకుతూ తట్టుకోలేక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

 దేవినేనికి ఘన స్వగతం పలికిన టీడీపీ శ్రేణులు

దేవినేనికి ఘన స్వగతం పలికిన టీడీపీ శ్రేణులు

ఇదిలా ఉండగా ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ మీద విడుదలయిన దేవినేని ఉమకు టిడిపి నేతలు ఘనస్వాగతం పలికారు. టిడిపి నేతలు, టీడీపీ శ్రేణులు దేవినేని ఉమ కి స్వాగతం పలికి తీసుకు వస్తున్న క్రమంలో భీమడోలు వద్ద దేవినేని కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దేవినేని ఉమా పట్టాభి తదితర టిడిపి నేతలు రోడ్డుపైనే బైటాయించిన ఆందోళన తెలియజేశారు ఈ క్రమంలో భీమడోలు రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది టిడిపి నేతల ఆందోళన తో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జైలు నుంచి బయటకు వచ్చిన దేవినేని ఉమకు పోలీసులు అడ్డగింతతో స్వాగతం పలికారు. దేవినేని కి షాక్ ఇచ్చారు.

వైసీపీ సర్కార్ పై దేవినేని ఫైర్

వైసీపీ సర్కార్ పై దేవినేని ఫైర్

ఇటీవల కృష్ణా జిల్లా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ వ్యవహారంలో అరెస్టయిన టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా ఈరోజు బెయిల్ పై జైలు నుంచి విడుదలైన క్రమంలో వైసిపి కుట్రలకు కుతంత్రాలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. అక్రమ నిర్బంధాలతో తమను ఆపలేరని స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవడానికి వెళ్లినందుకు తప్పుడు కేసులు బనాయించారని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని దేవినేని ఉమా నిప్పులు చెరిగారు.

  Jr NTR Fans Demands Chandrababu, అధినేత టూర్ లో తమ్ముళ్ల షాక్..! || Oneindia Telugu
   వైసీపీ అక్రమాలపై పోరాటం చేస్తామన్న దేవినేని ఉమా

  వైసీపీ అక్రమాలపై పోరాటం చేస్తామన్న దేవినేని ఉమా

  వైసీపీ అక్రమాలపై పోరాటం చేస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తనకు మద్దతు ఇచ్చారని, ధైర్యం చెప్పారని దేవినేని ఉమా ఈ సందర్భంగా పేర్కొన్నారు. అక్రమ గ్రావెల్ తవ్వకాలు అడ్డుకుంటే అరెస్ట్ చేశారని, తనపై దాడి జరిగిన సమయంలో పోలీసులు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారని దేవినేని ఉమ స్పష్టం చేశారు. దాడి జరిగిన సమయంలో తాను దాదాపు ఎనిమిది గంటలపాటు కారులోనే ఉండిపోయానని ఆయన పేర్కొన్నారు.అక్రమాలను ప్రశ్నిస్తుంటే దాడి చేయడమే కాదు, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఉమా అసహనం వ్యక్తం చేశారు.

  English summary
  Chandrababu fires against obstructing the Devineni Uma convoy. Chandrababu questioned how the police would stop vehicles across the road on the national highway. Chandrababu objected that the ruling party was changing the law in favor of them.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X