వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీకి రైతు దినోత్సవం జరిపే హక్కు లేదు .. ఇది రైతు దగా దినోత్సవం : చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

ఏపీ మాజీ సీఎం,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టిడిపి నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జరపాల్సింది రైతు దినోత్సవం కాదని, రైతు దగా దినోత్సవం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం రైతులను మోసం చేసింది అన్నారు. వైసీపీ హయాంలో రైతులకు జీరో రుణాలని, రైతుభరోసా అని మోసం చేస్తున్నారని ఆయన లెక్కలతో సహా చెప్పి మండిపడ్డారు.

 వ్యవసాయ బడ్జెట్లో 35 శాతం మాత్రమే ఖర్చు పెట్టారని ఆగ్రహం

వ్యవసాయ బడ్జెట్లో 35 శాతం మాత్రమే ఖర్చు పెట్టారని ఆగ్రహం

వ్యవసాయ బడ్జెట్లో 35 శాతం మాత్రమే ఖర్చు పెట్టిన వైసీపీ ప్రభుత్వానికి రైతు దినోత్సవం జరిపే హక్కు లేదని ఫైర్ అయ్యారు చంద్రబాబు. వ్యవసాయానికి 90 వేల కోట్ల నిధులు టిడిపి హయాంలో ఐదేళ్లలో కేటాయించామని చెప్పిన చంద్రబాబు ఏడాది పాలనలోనే రైతులను మోసం చేశారని విమర్శలు గుప్పించారు. మొత్తం రైతుల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 35శాతం మాత్రమే ఖర్చు చేయడం, 65 శాతం రైతు సంక్షేమానికి ఖర్చు చేయకపోవడం మీ చేతగాని తనం అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఏడాది కాలంలో చేసిన మోసాలకు వైసిపి ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాలని మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు.

రైతుల్లో కులాల పేరుతో చీలిక తీసుకొచ్చిన ఘనత వైసీపీదే

రైతుల్లో కులాల పేరుతో చీలిక తీసుకొచ్చిన ఘనత వైసీపీదే

అంతేకాదు రైతుల్లో కులాల పేరుతో చీలిక తీసుకొచ్చిన ఘనత కూడా వైసిపి ప్రభుత్వానిదేనని చంద్రబాబు మండిపడ్డారు. 73 ఏళ్ల దేశ స్వాతంత్ర్య చరిత్రలో రైతుల్లో ఎప్పుడూ కులాల ప్రస్తావన లేదని, అలాంటిది రైతుల్లో కూడా కులాల పేరుతో చీలిక తెచ్చిన ఘనత వైసిపిదేనని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రుణమాఫీ ఏడు వేల కోట్లు ఎగ్గొట్టడం వైసిపి రైతు దినోత్సవమా అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు.

కౌలు రైతులను మోసం చేసిన ఘనులు

కౌలు రైతులను మోసం చేసిన ఘనులు


15 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పి అందులో పదోవంతు కూడా ఇవ్వకుండా మోసం చేసిన ఘనత వైసిపిదేనని బాబు పేర్కొన్నారు. అంతేకాదు 34 వేల ఎకరాలు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు మహిళలు రైతులు కూలీలు ఎదుర్కోవడమే వైసిపి రైతు దినోత్సవం చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇక సున్నా వడ్డీ రుణాలు మేమే తీసుకువచ్చామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం, అది కాంగ్రెస్ పార్టీ హయాంలో, కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో తీసుకు వచ్చిన పథకంగా టిడిపి రుజువు చేయడంతో పలాయనం చిత్తగించింది అన్నారు.

 సున్నా వడ్డీల మాయాజాలం

సున్నా వడ్డీల మాయాజాలం

రైతులకు సున్నా వడ్డీ రుణాల కోసం మూడు వేల ఆరు వందల కోట్లు కావాలని అసెంబ్లీలో చెప్పిన జగన్ రెడ్డి కేవలం 100 కోట్లు ఖర్చు పెట్టారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇక అలాంటి వ్యక్తి రైతు దినోత్సవం ఎలా చేస్తారని ప్రశ్నించారు. టిడిపి హయాంలో వ్యవసాయ యాంత్రీకరణకు 2500 కోట్లు ఖర్చు చేస్తే, ప్రస్తుతం వైసిపి అందులో పదోవంతు కూడా ఖర్చు చేయలేదని పేర్కొన్నారు.

అడుగడుగునా దగా .. రైతు భరోసా కేంద్రాలలో ఆ జాబితా పెట్టే ధైర్యం ఉందా ?

అడుగడుగునా దగా .. రైతు భరోసా కేంద్రాలలో ఆ జాబితా పెట్టే ధైర్యం ఉందా ?

నాడు టిడిపి మైక్రో ఇరిగేషన్ లోనూ దేశంలో రాష్ట్రాన్ని ముందుంచితే, నేడు వైసిపి 17వ స్థానానికి తీసుకు వచ్చారని విమర్శలు గుప్పించారు. ఇక రైతుల ఖాతాల్లో సున్నా వడ్డీ రుణాలు జమ చేస్తామని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ఎవరెవరి రైతుల ఖాతాల్లో సున్నా వడ్డీ జమ చేశారో రైతు భరోసా కేంద్రాలలో జాబితా పెట్టే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. రైతు దినోత్సవం జరిపే హక్కు వైసీపీకి లేదని, వైసిపి రైతులను అడుగడుగునా మోసం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు.

English summary
Former CM and TDP chief Chandrababu Naidu has set fire to the YCP government. Chandrababu who held a video conference with the TDP leaders, was outraged that the ycp has no right to conduct farmer's day. He said the YCP government had cheated the farmers. During the YCP regime, farmers were fooled by the government on zero loans and farmers guarantees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X