వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ పాలనలో ప్రజలకు కష్టాలు.. ఇది బాధ్యత లేని ప్రభుత్వం : చంద్రబాబు ధ్వజం

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వైసీపీ పాలన పై ద్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, ప్రతి పనిలోనూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు అని చంద్రబాబు ఆరోపించారు.

 జగన్ రెడ్డి కథ వేరే చెప్పనక్కరలేదు ..క్యాబినెట్ మంత్రులకు పేర్లు పెట్టి చంద్రబాబు వ్యంగ్యం జగన్ రెడ్డి కథ వేరే చెప్పనక్కరలేదు ..క్యాబినెట్ మంత్రులకు పేర్లు పెట్టి చంద్రబాబు వ్యంగ్యం

ప్రజలంటే లెక్కలేని ప్రభుత్వం .. చంద్రబాబు ఫైర్

ప్రజలంటే లెక్కలేని ప్రభుత్వం .. చంద్రబాబు ఫైర్

ఏపీలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో కూడిన ప్రభుత్వమని, ప్రజలంటే లెక్కలేని ప్రభుత్వమని చంద్రబాబు మండిపడ్డారు. వైసిపి పాలనలో ప్రజలకు కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత వైసిపి ప్రభుత్వ సామర్థ్యాన్ని స్పష్టంగా చెబుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వరదల సమయాల్లోనూ ప్రభుత్వం ప్రజలను ఆదుకోలేకపోయిందని విమర్శించారు. పాలన సాగించిన మొదటి సంవత్సరమే ఇసుక లేక లక్షలాది మంది జీవనోపాధి కోల్పోయారని, ఇప్పుడు కరోనా కారణంగా వారంతా రోడ్డున పడ్డారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతిపనిలోనూ అక్రమ వసూళ్లు .. డబ్బు దండుకోవటమే వైసీపీ ధ్యేయం

ప్రతిపనిలోనూ అక్రమ వసూళ్లు .. డబ్బు దండుకోవటమే వైసీపీ ధ్యేయం

రాష్ట్రంలో వలస కార్మికులను ఆదుకునే చర్యలు లేవని, కరోనా విషయంలో కూడా కక్కుర్తి పడటం హేయమని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలకు కూడా రేట్లు పెట్టి మరీ వసూలు చేయడం దారుణమని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి పనిలోనూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు అని, డబ్బులు దండుకోవడం ధ్యేయంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని చంద్రబాబు అన్నారు. ప్రజలను వేధించడం తప్ప ఆదుకోవడం చేతగాని ప్రభుత్వమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recommended Video

Dubbaka By Elections 2020 : TRS ప్రభుత్వం దుబ్బాక కు చేసిందేమి లేదు, TDP కే గెలిచే హక్కు ఉంది : TTDP
 వైసీపీకి చట్టాలపై విశ్వాసం లేదు, రాజ్యాంగంపై గౌరవం లేదని మండిపడిన మాజీ సీఎం

వైసీపీకి చట్టాలపై విశ్వాసం లేదు, రాజ్యాంగంపై గౌరవం లేదని మండిపడిన మాజీ సీఎం


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రజలంటే లెక్క లేదని, దేవాలయాలంటే భక్తి లేదని, చట్టాలపై విశ్వాసం లేదని కనీసం రాజ్యాంగంపై గౌరవం కూడా లేదంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులు నిరంతరం సమరం చేయాల్సిందేనని చెప్తున్న చంద్రబాబు టీడీపీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపడానికి, పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడానికి నిత్యం ఆన్లైన్ ద్వారా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

English summary
Telugu Desam party chief Chandrababu Naidu Conducted a review meeting with Vijayanagaram parliamentary constituency leaders. He outraged on the YCP rule. Chandrababu criticized the YSR Congress party for going beyond its words. Chandrababu alleged that corruption and irregularities had increased in the state and that illegal collections were being committed in every work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X