గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ యువభేరి సక్సెస్: అడ్డుకునేందుకు చంద్రబాబు 'జైలు' మంత్రం

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీకి హోదా సాధన కోసం ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేపట్టిన యువభేరి సమావేశాలకు విధ్యార్ధులను, యువతను వెళ్లకుండా అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు కొత్త ప్రణాళికను సిద్ధం చేశారా? అంటే అవుననే తెలుస్తోంది. ఇందులో భాగంగా హోదా కోసం జగన్ ఏర్పాటు చేసే సమావేశాలకు వెళ్లితే జైలుకు వెళ్తారని హెచ్చరించారు.

 యువభేరికి విద్యార్థులు హాజరైతే జైలుకు వెళ్లక తప్పదు

యువభేరికి విద్యార్థులు హాజరైతే జైలుకు వెళ్లక తప్పదు


వివరాల్లోకి వెళితే... సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలోని బాపట్లలలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రత్యేకహోదా సమావేశాలకు విద్యార్థులు హాజరైతే జైలుకు వెళ్లక తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లిదండ్రులను హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను నిరంతరం కష్టపడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ విద్యార్థులతో తనపై బురద జల్లించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

 ప్రతిపక్ష నేత నాపై బురదజల్లించే ప్రయత్నం చేస్తున్నారు

ప్రతిపక్ష నేత నాపై బురదజల్లించే ప్రయత్నం చేస్తున్నారు


ఏపీకి హోదా సాధన కోసం ఇకపై జగన్ ఏర్పాటు చేసే సమావేశాలకు వెళితే విద్యార్ధులు కూడా జైలుకు వెళ్తారని చెప్పారు. ‘ఇటీవల ఏలూరులో జరిగిన మీటింగ్‌లో ప్రతిపక్ష నేత నాపై బురదజల్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడున్నవారికి పిల్లలుండే ఉంటారు. మీ పిల్లలు చదువు కోసం వెళితే కళాశాలలో బుద్ధిగా చదువుకొని రమ్మని చెప్పండి. మీటింగ్‌లు, చాటింగ్‌లు అంటూ వెళితే ఆయన వారికి కూడా జైలుకు వెళ్లడం నేర్పిస్తారు. ప్రత్యేకహోదా అంటూ సమావేశాలకు వెళితే వారు కూడా జైలుకు వెళ్తారు..' అంటూ హెచ్చరించారు.

 హోదా అని చెబుతున్నారే కానీ హోదా వల్ల ఒరిగేదేంటి?

హోదా అని చెబుతున్నారే కానీ హోదా వల్ల ఒరిగేదేంటి?

ప్రత్యేక హోదా అని చెబుతున్నారే కానీ హోదా వల్ల ఒరిగేదేంటి? అని అడిగితే ఏ ఒక్కరూ సమాధానం చెప్పడం లేదని చంద్రబాబు విమర్శించారు. ‘‘ఎంతో చదువుకున్నామన్నారు, ఇతర దేశాల్లో స్థిరపడ్డారు, ప్రత్యేక హోదాపై వారికి కనీస అవగాహన కూడా లేదు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని చెబుతున్నారు.. అసలు పరిశ్రమల రాయితీలకు, ప్రత్యేక హోదాకు ఏమైనా సంబంధం ఉందా.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. మాట్లాడుకోనివ్వండి'' అంటూ ప్రవాసాంధ్రులపై కూడా చంద్రబాబు చిందులు తొక్కారు.

 ప్రవాసాంధ్రులతో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ముఖాముఖీ చర్చ

ప్రవాసాంధ్రులతో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ముఖాముఖీ చర్చ

కాగా, ఆదివారం ప్రవాసాంధ్రులతో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ముఖాముఖీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభమైన ఈ ముఖాముఖి కార్యక్రమంలో అమెరికా, బ్రిటన్, కెనడా, కువైట్, సింగపూర్‌ల నుంచి పలువురు ప్రవాసాంధ్రులు జగన్‌ మాట్లాడారు. ఏపీకి హోదా సాధన కోసం రాష్ట్రంలో చేస్తున్న పోరాటం, హోదా ఆవశ్యకతపై ప్రవాసాంధ్రులతో చర్చించారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం రాజీలేని పోరాటం చేస్తామని, అవసరమైతే వైసీపీ ఎంపీలు రాజీనామా కూడా చేస్తారని ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ సంచలన ప్రకటన చేశారు

English summary
Andhra Pradesh chandrababu naidu fires on ys jagan over yuva bheri programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X