విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అభివృద్దిలో కీలకం కానున్న ప్లైఓవర్‌కి బాబు గ్రీన్ సిగ్నల్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విజయవాడ నగరవాసుల ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు కనకదుర్గగుడి వద్ద ప్లైఓవర్ నిర్మాణానికి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ. 250 కోట్ల వ్యయంతో ఈ ప్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేసి కేంద్రానికి పంపాలని అధికారులకు సూచించారు.

అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, ఇతర
ఎమ్మేల్యేలతో సమావేశమై ప్లైఓవర్ నిర్మాణం గురించి చర్చించారు. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి అవ్వాలంటే ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సూచించారు.

 chandrababu gave the green signal to kanaka durga fly over

ఈ ప్లైఓవర్ నిర్మాణం చాలా అవసరం. కనకదుర్గగుడి వద్ద నిర్మించే ఈ ప్లైఓవర్ హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చే రహదారిలో ఉంది. అంతే కాదు విజయవాడని చంద్రబాబు నాయుడు తాత్కాలిక రాజధానిగా ప్రకటించారు. అభివృద్ధి కార్యక్రమాలకు వేదికగా విజయవాడను మరింత ముందుకి తీసుకెళ్లడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటైన తరువాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ రాజధాని ఉంటే బాగుంటుంది, అక్కడ ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలు ఏమిటన్న వివరాలతో నివేదికలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను శివరామకృష్ణన్ కమిటీకి కూడా సమర్పించింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని సందర్భాల్లో విజయవాడ - గుంటూరు మధ్యలోనే రాజధాని అని కూడా ప్రకటించడంతోపాటు సహచరులకు కూడా ఇదే సంకేతాలు ఇప్పటికే పంపించిన విషయం తెలిసిందే.

English summary

 Vijayawada Kanaka Durga Temple Flyover construction Completes. Andhra Pradesh Cheif minister Chandrababu Naidu gave the green signal to kanaka durga fly over.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X