• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రేపు హస్తినకు బాబు .. ఢిల్లీ వేదికగా బాబు ఏం చెయ్యనున్నారో ?

|
  AP Assembly Elections 2019 : రేపు హస్తినకు బాబు... ఢిల్లీ వేదికగా బాబు ఏం చెయ్యనున్నారో..?

  ఏపీలో జరిగిన పోలింగ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సీఎం చంద్రబాబు ఈసీ తీరుపై మండిపడ్డారు .ఈవీఎంలు మొరాయించడంపైనా చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. రిపేర్ పేరుతో ఈవీఎంల మేనిపులేషన్ జరిగిందన్న చంద్రబాబు మేనిపులేషన్ జరగలేదు అని చెప్పడానికి గ్యారంటీ లేదన్నారు. ఎన్నడూ లేని విధంగా అత్యంత హింసాత్మక విధానంలో ఎన్నికలు జరగటం ఈసీ అసమర్థతకు నిదర్శనం అన్నారు.

  130స్థానాల్లో టీడీపీ విజయం పక్కా..స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కాపలా కాయండి..టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు

  కేంద్ర ఎన్నికల సంఘంపై ఫైర్ అయిన చంద్రబాబు .. ఈసీకి నిబద్ధత ఉందా అని ప్రశ్న

  కేంద్ర ఎన్నికల సంఘంపై ఫైర్ అయిన చంద్రబాబు .. ఈసీకి నిబద్ధత ఉందా అని ప్రశ్న

  కేంద్ర ఎన్నికల సంఘంపైనా చంద్రబాబు మండిపడ్డారు. సాంకేతిక లోపాల పేరుతో ఓటర్లను ఆడుకున్నారని ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు వెళ్లిన ఎన్నికల ప్రధాన అధికారికే ఇబ్బంది ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యం భవిష్యత్తు ఓ సాఫ్ట్ వేర్ పై ఆధారపడే పరిస్థితి తీసుకురావడం దారుణం అన్నారు. తెల్లవారుజామున వరకు పోలింగ్ జరిగిందంటే.. ఎన్నికల కమిషన్ దీనికి ఏం సమాధానం చెబుతుంది అని చంద్రబాబు ప్రశ్నించారు. అసలు విధుల పట్ల ఈసీకి నిబద్దత ఉందా? అని ప్రశ్నించారు చంద్రబాబు .

  హస్తిన బాట పట్టిన బాబు .. ఈసీతో తాడోపేడో తేల్చుకుంటామని ప్రకటన

  హస్తిన బాట పట్టిన బాబు .. ఈసీతో తాడోపేడో తేల్చుకుంటామని ప్రకటన

  ఇక ఈ నేపధ్యంలోనే సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో పోలింగ్ నిర్వహణ తీరుపై అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు ఈసీని కలిసి ఏపీలో పోలింగ్ పై నిలదీయనున్నారు .. ఎంపీలు, మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు ఈవీఎంల మొరాయింపు, అధికారుల బదిలీలు, ఇతర అంశాలపై సీరియస్‌గా చర్చించనున్నారు. అవసరమైతే ధర్నాకు కూడా దిగుతానని చంద్రబాబు చెబుతున్నారు.

  పనికిమాలిన ఎలక్షన్ కమీషన్ అంటూ మండిపాటు .. ఏపీ సీఈవోపై ఆగ్రహం

  పనికిమాలిన ఎలక్షన్ కమీషన్ అంటూ మండిపాటు .. ఏపీ సీఈవోపై ఆగ్రహం

  ఇంత పనికిమాలిన ఎలక్షన్ కమిషన్‌ను తానెప్పుడూ చూడలేదని చంద్రబాబు మండిపడ్డారు. నేరస్తులు ఏమి చెబితే అది ఈసీ పాటిస్తోందన్నారు. ఈవీఎంలు పనిచేయకపోతే మూడుసార్లు వెళ్లి మళ్లీ వచ్చారని స్పష్టంచేశారు. సీఈవోనే ఓటు వేయలేకపోయారని ఎద్దేవాచేశారు. సీఈవోనే ఓటేయలేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. దేశాన్ని భ్రష్టుపట్టించిన మోడీ , ఆయనతో చేతులు కలిపి రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుపడుతున్న కేసీఆర్, నేర చరిత్ర ఉన్న జగన్ కలిసి భ్రష్టు పట్టించిన ఎన్నికలుగా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు .

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  AP CM Chandarbabau naidu is going to delhi on 13th april to meet ECI to discuss about the failures of polling held in AP . Chandrababu fired on CEO Dwivedi . He worked for the rival parties 0f TDP. He suspected that manipulation might be happened in the polling . He along with the ministers are planning to go there and question the ECI. In Delhi they are also planning for a protest.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more