వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు 2014లో ఈవీఎంలపై అనుమానాలు రాలేదెందుకో ... జీవీఎల్ సెటైర్

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని, ఏపీ ఎన్నికల అధికారిని ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయని , ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని , ఈవీఎంలు త్యామ్పరింగ్ కు అవకాశం వుందని మాట్లాడిన మాటలపై జీవీఎల్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు .

ఈవీఎంల ట్యాంపరింగ్ పై 2014లో బాబు మాట్లాడలేదు ఎందుకో అన్న జీవీఎల్

ఈవీఎంల ట్యాంపరింగ్ పై 2014లో బాబు మాట్లాడలేదు ఎందుకో అన్న జీవీఎల్

ఈవీఎంల పనితీరుపై ఇప్పుడు తప్పుబడుతున్న చంద్రబాబు.. 2014 ఎన్నికల్లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగితే అప్పుడు 2014 ఎన్నికల్లోనూ జరిగినట్టేనా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారని వారెవరికి రాని అనుమానం బాబుకు మాత్రమే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు జీవీఎల్ .

అధికారులను బదిలీ చేస్తే నానా యాగీ చేస్తున్న చంద్రబాబు - జీవీఎల్

అధికారులను బదిలీ చేస్తే నానా యాగీ చేస్తున్న చంద్రబాబు - జీవీఎల్

అధికారులను బదిలీ చేస్తే బాబు ఎందుకు నానా యాగీ చేస్తున్నారన్నారు. అందులో ఏదైనా మతలబు ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా విధులు నిర్వహిస్తున్న ఏన్నికల అధికారిపై , సీఎస్ పై బాబు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు , చేస్తున్న రాద్దాంతం అంతా ఇంతా కాదని, ఓటమి భయంతోనే బాబు ఇలా ప్రవర్తిస్తున్నాడని జీవీఎల్ ఎద్దేవా చేశారు.

నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న నేత అలా ఉంటాడా అన్న జీవీఎల్

నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న నేత అలా ఉంటాడా అన్న జీవీఎల్

నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత అయి ఉండి చంద్రబాబు అలా ప్రవర్తించకూడదని హితవు పలికారు. చంద్రబాబులో హుందాతనం కనిపించకపోగా, చౌకబారుతనం కనిపించిందని జీవీఎల్ ఫైర్ అయ్యారు . ఈ ఎన్నికల్లో టీడీపీ బాక్సులు గల్లంతు కావడం ఖాయమని నర్సింహారావు జోస్యం చెప్పారు. చూడాలి మరి మాట యుద్ధం ఇలా వుంటే ఓటర్ల తీర్పు ఎలా వుందో .

English summary
GVL Narasimha Rao questioned why Chandrababu is now being blamed on EVMs. Now, if EVMs are tampering, then the 2014 elections will be held. The question of why only Babu suspected that three crore people in Andhra Pradesh had not used the voting rights?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X