వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు వెళ్తే నష్టమేం లేదు! మాకు మరొకరు దొరికారు: అమిత్ షా

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/పాట్నా: ఎన్డీయే నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బయటకు వెళ్లిపోతే బీహార్ సీఎం నితీష్ కుమార్ తిరిగి వచ్చారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా అన్నారు.

అమిత్ షా గురువారం బీహార్ పర్యటనకు వచ్చారు. ఆయన నితీష్ కుమార్‌తో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఆ తర్వాత రాత్రి కూడా ఇద్దరు కలిసి భోజనం చేశారు. అనంతరం బీజేపీ పదాధికారుల సమావేశంలోనూ అమిత్ షా మాట్లాడారు. పొత్తులు, ఎన్డీయేలో ఉన్న పార్టీల అంశంపై ఈ సందర్భంగా స్పందించారు.

జనసేన వచ్చిందిగా!: మైసూరా ఆసక్తికరం, ప్రత్యేక సీమపై షాకింగ్ కామెంట్స్జనసేన వచ్చిందిగా!: మైసూరా ఆసక్తికరం, ప్రత్యేక సీమపై షాకింగ్ కామెంట్స్

 టీడీపీ వెళ్లిపోయినా, నితీష్ వచ్చారు

టీడీపీ వెళ్లిపోయినా, నితీష్ వచ్చారు

కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీ వ్యతిరేక కూటమిగా ఏర్పడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని అమిత్ షా చెప్పారు. 2014లోనే వారందరినీ తాము ఓడించామని గుర్తు చేశారు. ఎన్డీఏ మరింత బలపడుతోందని వ్యాఖ్యానించారు. తమ కూటమి నుంచి టీడీపీ వెళ్లిపోతే జేడీయూ వచ్చి చేరిందన్నారు.

 చంద్రబాబు వెళ్తే నష్టమేంటి?

చంద్రబాబు వెళ్తే నష్టమేంటి?

'చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుంచి వెళ్లిపోయారు, దాని వల్ల పడిన ప్రభావం ఏమిటి? (బీజేపీకి జరిగిన నష్టమేమీ లేదనే అభిప్రాయంలో), నితీష్ వచ్చి మాతో కలిశారు' అని అమిత్ షా వ్యాఖ్యానించారు. బీహార్‌లో నితీష్‌తో తమ పొత్తు కొనసాగుతుందని చెప్పారు.

అందుకే మాతో చేతులు కలిపారు

అందుకే మాతో చేతులు కలిపారు

బీహార్‌లో అవినీతిపరులతో చేతులు కలపడం ఇష్టం లేకే నితీష్ కుమార్ తమతో ఉంటున్నారని, ఇది మంచి పరిణామం అని అమిత్ షా అన్నారు. బీహార్‌లో తమ కూటమి వచ్చే లోకసభ ఎన్నికల్లో 40 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. జేడీయు - బీజేపీ మధ్య సీట్ల పంపకంపై జరుగుతోన్న ప్రచారం వట్టిదే అన్నారు.

Recommended Video

మా ఫస్ట్ ర్యాంక్ ను కేంద్రం అడ్డుకోవాలని చూసింది
మోడీ నాలుగేళ్ల పాలన సరే, 4 జనరేషన్స్ పాలన మాటేమిటి

మోడీ నాలుగేళ్ల పాలన సరే, 4 జనరేషన్స్ పాలన మాటేమిటి

2014 కంటే 2019లో ఎక్కువ స్థానాలు గెలుస్తామని అమిత్ షా తెలిపారు. నాలుగేళ్లుగా మోడీ ఏం చేశారని, రాహుల్ వివిధ ప్రాంతాల్లో తిరిగి ప్రశ్నిస్తున్నారని, కాని నాలుగు తరాలుగా వారేం చేశారని జనాలు తిరిగి అడుగుతున్నారని విమర్శించారు. దేశమంతటా బీజేపీ పాలన వచ్చేలా కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.

English summary
BJP president Amit Shah said his party knew very well how to take care of its allies and respect them. He added that since 2014, only TDP chief and Andhra Pradesh Chief Minister Chandrababu Naidu had quit the NDA, but Chief Minister and JD(U) chief Nitish Kumar rejoining the alliance had strengthened it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X