అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కీలక అడుగు: అమరావతి డిజైన్లు ఇలా..! చంద్రబాబు హ్యాపీ

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగుపడింది. రాజధానిలో నిర్మించే డిజైన్లపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగుపడింది. రాజధానిలో నిర్మించే డిజైన్లపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారు.

మరో రెండు వారాల్లో నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు తుది డిజైన్లను అందించనున్నారు. శాసనసభ, శాసనమండలికి మధ్యలో సెంట్రల్‌ హాల్‌ నిర్మాణం చేపట్టనున్నారు.

amaravati

నగరానికి రెండు వైపులా అతిపెద్ద పార్కులు, ఓ వైపు పరిపాలనా భవంతులు మరోవైపు ప్రజల సందర్శనకు కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయబోతున్నారు.

సాంస్కృతిక భవనం, ఎగ్జిబిషన్‌ సెంటర్‌, వాణిజ్య కూడలి వంటివి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిరంతరం నీటి ప్రవాహం ఉండేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులకు సూచించారు.

ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తుల నివాస సముదాయాల పైనా చర్చించారు. రాజ్ భవన్‌కు సమీపంలోనే ముఖ్యమంత్రి నివాస భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చిన్న చిన్న మార్పులు మినహా డిజైన్ ఓకే అయింది.

English summary
Chandrababu happy ith Norman Foster designs of Amaravati buildings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X