• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

"బాబో"య్...ఇన్ని యు టర్న్ లా...జనం తట్టుకోలేకపోతున్నారు!

|

అమరావతి: తాజాగా ప్రత్యేకహోదాపై ఎపి సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు మరోసారి యు టర్న్ తీసుకోవడంతో జనం విస్తుపోతున్నారు. బాబు గారు ప్రజల మనో భావాలు పట్టించుకోరా?...అతి ముఖ్యమైన అంశాలపై కూడా వెంటవెంటనే యు టర్న్ లు తీసుకుంటే జనం ఎలా అర్థం చేసుకుంటారో? అనైనా కనీసం ఆలోచించరా?...అని ప్రత్యేక హోదా గురించి బాబు చేసిన తాజా వ్యాఖ్యలతో టిడిపి నేతలే తలపట్టుకుంటున్నారు.

అంతేకాదు బాబు ఉన్నట్టుండి మళ్లీ ఇంత తక్కువ టైమ్ లోనే యు టర్న్ ఎందుకు తీసుకున్నారబ్బా...! అని వాళ్లే కారణాలు అన్వేషించే పనిలో పడ్డారు....అంత రిస్క్ వాళ్లకెందుకు అనుకుంటున్నారా?...మరి బాబు ఏ కారణంతో యు టర్న్ తీసుకున్నారో తమకైనా తెలిస్తేనే కదా...మీడియా ముందు ప్రత్యర్థుల వాదనలను తిప్పికొట్టేది!...అసలు ప్రత్యర్థులు ఎవరో తెలుసుకోగలిగేది!...

 ప్రత్యేక హోదాపై తాజాగా...బాబు వ్యాఖ్యలు...

ప్రత్యేక హోదాపై తాజాగా...బాబు వ్యాఖ్యలు...

మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఏం వస్తాయని ఎదురు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 40 వేల కోట్లు కావాలని, లోటు బడ్జెట్ కింద రూ.16 వేల కోట్లు రావాలని, ఇవన్నీ హోదా వల్ల రావని ఆయన పునరుద్ఘాటించారు. చట్టంలో చెప్పినట్లు ఒక హక్కుగా మాత్రమే హోదా కావాలని అడుగుతున్నాం కానీ ప్రత్యేకహోదా వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని మళ్లీ చంద్రబాబే తేల్చేశారు. "ఒక హక్కుగా మాత్రమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడుగుతున్నాం తప్ప దానితో ఏదో ఒరిగిపోతుందని కాదు. ఇతర రాష్ట్రాలకు కొనసాగిస్తున్నందునే మాకూ కావాలంటున్నాం" ఇది ప్రత్యేక హోదాపై చంద్రబాబు తాజా స్టేట్ మెంట్. అంతే కాదు హోదాతో ఈ రాయితీలు వస్తాయని ఏ జీవోలో ఉందో చూపాలంటే చూపలేకపోతున్నారని ఆయన పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఉద్దేశించి అన్నారు.

 అవాక్కవుతున్న టిడిపి నేతలు...ఇప్పుడెలా?

అవాక్కవుతున్న టిడిపి నేతలు...ఇప్పుడెలా?

చంద్రబాబునాయుడు మళ్లీ ప్రత్యేక హోదాపై యు టర్న్ తీసుకోవడం, ఒక్కోసారి ఒక్కోలాగా మాట్లాడుతుండటంతో టిడిపి నేతలే అవాక్కైపోతున్నారు. మరి ఇటీవల ప్రత్యేక హోదా కోసం అఖిల పక్షాలు చేసిన బంద్ కు మద్దతు ఇవ్వడంతో సహా అనేక ఆందోళనలు చేయడం ఎందుకని వారే విస్తుపోతున్నారు.

చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా కోసం మాట్లాడటంతో కేంద్రమంత్రులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులు, ఎంఎల్ఏలు, ఇతర టిడిపి నేతలు కూడా ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనంటూ పదే పదే డిమాండ్ చేయడం, పార్లమెంటు లోపల, బయట ఎంపిలు ప్రత్యేక హోదా కోసం పోరాటం జరపడం కూడా చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు హఠాత్తుగా యు టర్న్ తీసుకోవడం వారినే షాక్ గురిచెయ్యడంతో పాటు వారు ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు.

 కారణాల అన్వేషణలో...టిడిపి నేతలు

కారణాల అన్వేషణలో...టిడిపి నేతలు

త్వరలోనే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో చంద్రబాబు ఎందుకు యు టర్న్ తీసుకున్నారబ్బా అని టిడిపి నేతలే బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. బాబు తాజా యూ టర్న్ కి కారణమేమై యుండొచ్చా అని అన్వేషణ సాగిస్తున్నారు. అంతకుముందు వరకు ప్రత్యే హోదా గురించి మాట్లాడిన చంద్రబాబు విశాఖలో వెంకయ్యనాయుడితో మాట్లాడాకే మళ్లీ ప్రత్యేక హోదా వల్ల ఏం వస్తుంది?...అని ప్రశ్నిస్తున్నారని...కాబట్టి వెంకయ్యనాయుడే ఈ విషయమై చంద్రబాబుకు ఏవో సూచనలు చేసి ఉండొచ్చని విశ్లేషించుకుంటున్నారు. చంద్రబాబుకు విశాఖలో వెంకయ్య నాయుడు చాలా విలువైన సూచనలే చేశారని, కేంద్రంలో పరిస్థితుల గురించి తెలియజెప్పారని అంటున్నారు. దీంతో చంద్రబాబు తాజాగా అవలంభించాల్సిన వైఖరిపై ఒక అభిప్రాయానికి వచ్చారని, దాని ఫలితమే ప్రత్యేక హోదాపై యూ టర్న్ అని భావిస్తున్నారు.

 అయితే ఇప్పుడు...ఏం జరుగుతుంది...ఏం జరగబోతోంది?...

అయితే ఇప్పుడు...ఏం జరుగుతుంది...ఏం జరగబోతోంది?...

టిడిపితో బిజెపినే తెగతెంపులకి సిద్దపడిందని, అందువల్ల బిజెపి చెప్పినట్లు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించినా ఇప్పటికిప్పుడు కేంద్రం భారీ ఎత్తున ఎపికి నిధులు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి...ఎపిలో అభివృద్ది జరగకపోవడానికి పూర్తిగా బిజెపిదే బాధ్యత అనేట్లుగా మొత్తం తప్పంతా ఆ పార్టీ మీద వేసెయ్యడానికే చంద్రబాబు ఈ ఎత్తుగడ అవలంబిస్తూ ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల కేంద్రాన్ని తాము ప్రత్యేక హోదా గురించే అడిగామని, వారు సాధ్యం కాదని అంటే ప్రత్యేక ప్యాకేజీకి అయినా సరే అన్నామని...అయినా ఏ రకంగానూ ఏపికి సాయం చెయ్యలేదని నెపం బిజేపి మీద వేసెయ్యడానికే చంద్రబాబు తాజాగా ప్రత్యేక హోదా విషయంలో యు టర్న్ తీసుకొని ఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు...ఏదేమైనా టిడిపి-బిజెపిల ఈ రాజకీయ చదరంగంలో నష్టపోతోంది మాత్రం ఎపి ప్రజలేనని ఇక్కడి జనాలు ఉసూరుమంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chandrababu has again taken U-turn on the special status issue. Chandrababu seems to have taken this decision in view of forthcoming things. However, these type of U-turns has taken by their party chief...are making confusing to the party leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more