అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉత్తరాంధ్ర అంటే ఎందుకు ద్వేషం, ఎందుకు అబద్ధాలు వల్లిస్తున్నారు అమర్‌నాథ్ ఫైర్

|
Google Oneindia TeluguNews

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాకు. విశాఖపట్టణం, ఉత్తరాంధ్ర అంటే ఎందుకు చంద్రబాబుకు ద్వేషం అని ప్రశ్నించారు. రాజధానిని వైజాగ్‌కు మార్చితే తప్పేంటని.. ఉత్తరాంధ్ర అభివృద్ధి కావొద్దా అని అడిగారు. 29 గ్రామాల ప్రజల ఆందోళనను రాష్ట్ర సమస్యగా మార్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు.

29 గ్రామాలే..

29 గ్రామాలే..

అమరావతిలో ఉన్న 29 గ్రామాల రైతులే మాత్రమే ఆందోళన చేస్తున్నారని అమర్‌నాథ్ క్లారిటీ ఇచ్చారు. ఇదీ కేవలం ఆ ప్రాంతానికి చెందిన రైతుల సమస్య అని చెప్పారు. కానీ దీనిని చంద్రబాబు నాయుడు 5 కోట్ల మంది ఆంధ్రుల సమస్య అని చెప్పి.. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 13 జిల్లాల సమస్య అని చెప్పి ప్రయోజనం పొందాలని చూడడాన్ని రాష్ట్రంలోని మిగతా ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

బినామీలే

బినామీలే

అమరావతిలో ఉన్న భూములు కూడా రైతులవి కావని అమర్‌నాథ్ ఆరోపించారు. చంద్రబాబు, ఆయన బినామీల భూములు అని చెప్పారు. రాజధాని విశాఖకు మారితే విజయవాడకు దూరం అని.. 400 కిలోమీటర్లు అని చెప్తున్నారు. మరి విశాఖ నుంచి విజయవాడ కూడా అంతే దూరం కదా అని గుర్తుచేశారు. వైజాగ్‌కు సంబంధించి దూరం లెక్కగట్టి ప్రజల్లో అభద్రతాభావం తీసుకొచ్చేందుకు చంద్రబాబు రాజగురువు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. విశాఖ నుంచి ఆ ప్రతిక ప్రస్థానం ప్రారంభమై.. ఉన్నతస్థితికి చేరినా.. ఆయన ఈ ప్రాంతంపై విషం కక్కడం మాత్రం సరికాదని చెప్తున్నారు.

లక్ష కోట్లు దోచేవారా..?

లక్ష కోట్లు దోచేవారా..?

అమరావతిలో భవనాలు ఉన్నాయని.. విశాఖలో అయితే నిర్మించాలని కొత్త ప్రచారం చేస్తున్నారని అమర్‌నాథ్ తప్పుపట్టారు. అమరావతిలో రూ.5500 కోట్లు ఖర్చు చేస్తేనే రహదారులు బాగున్నాయా ? మరి మిగతా లక్షా 4 వేల కోట్లు ఏం చేస్తారు.. మీ జేబులో నింపుకునేవారా అని చంద్రబాబును అడిగారు. అదే విశాఖలో అయితే కిలోమీటర్ రోడ్డు వేయాలంటే రూ.40 కోట్లు వ్యయం చేయాల్సి వస్తోందిన అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.

రతనాల సీమ కోసం

రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.20 వేల కోట్లు అవసరమవుతాయని గుడివాడ అమర్‌నాథ్ గుర్తుచేశారు. నాడు-నేడు పథకం కోసం రూ.15 వేల కోట్ల ఖర్చు చేయబోతున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ కామెంట్లను తప్పుపట్టారు. తమది అంబోతుల ప్రభుత్వమని మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శమని చెప్పారు. లక్షలాది మంది ప్రజలు ఓటేస్తే.. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచామని చెప్పారు.

21మంది పులులట..?

21మంది పులులట..?

టీడీపీ సభ్యులు 21 మంది పులులు, తమను 151 మంది గొర్రెలు అని పేర్కొన్న విషయాన్ని అమర్‌నాథ్ గుర్తుచేశారు. ఈ సందర్బంగా మోహన్ బాబు సినిమాలో డైలాగ్ గుర్తుచేశారు. ‘అడవిలో గర్జించే సింహానికి, వీధిలో తిరిగే కుక్కు తేడా ఉంటుంది' అని గుర్తుచేశారు. కవాతు పేరుతో శుక్రవారం పవన్ కల్యాణ్ మళ్లీ రావడంపై కూడా మండిపడ్డారు.

వాత చాలలేదా..?

వాత చాలలేదా..?

174 నియోజకవర్గాల్లో ప్రజలు వాత పెట్టిన విషయం మరచిపోయారా.. మళ్లీ కవాతు అంటూ ప్రజల్లోకి వస్తున్నారని అమర్‌నాథ్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అలిసిపోయి ఇంటికొచ్చాక కేఏ పాల్ వీడియోలు చూసి రిలాక్స్ అయ్యేవాడినని అమర్‌నాథ్ గుర్తుచేశారు. ఇప్పుడు కేఏ పాల్ లేకపోవడంతో ఆ స్థానంలో పీకే పాల్ చేరాడన్నారు. పీకే పాల్ వీడియోలు చూస్తూ స్వాంతన పొందుతున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్.. కవాతు, మార్చ్ పేరుతో పిట్టలదొరన తలపిస్తున్నారని విమర్శించరు.

English summary
chandrababu hate north andhra ycp mla gudiwada amarnath alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X