వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది ఫైనల్: కడప లోక్‌సభ స్థానంకు టీడీపీ నుంచి ఈ ఇద్దరిలో ఒకరు పోటీ..?

|
Google Oneindia TeluguNews

కడప జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అందులోను అది ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సొంత జిల్లా కావడంతో జగన్‌కు షాకిచ్చేలా టీడీపీ ప్లాన్ చేస్తోంది. కడపలో 10 అసెంబ్లీ స్థానాలుండగా దాదాపు అన్ని స్థానాలు వైసీపే గెలుస్తుందని సర్వేలు అంచనావేస్తున్నాయి. అయితే సర్వేల అంచనాలను తలకిందులు చేసేందుకు టీడీపీ వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగానే మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య రాజీ ఫార్ములా అమలు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ ఇద్దరి వర్గీయుల మధ్య కుటుంబవైరంతో పాటు రాజకీయవైరం కూడా ఉండేది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. కానీ చంద్రబాబు వాటన్నిటికీ చెక్ పెడుతూ ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య రాజీ కుదిర్చినట్లు సమాచారం.
జమ్మలమడుగులో ఇప్పటి వరకు రెండు కుటుంబాలదే రాజకీయపరంగా ఆధిపత్యం ఉండేది. ఇద్దరు నేతలు వేర్వేరు పార్టీల్లో ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇద్దరు ఒకే పార్టీలో ఉండటం వల్ల నేతలు ఓకే అనుకున్నప్పటికీ కార్యకర్తలు మాత్రం అది జీర్ణించుకోలేకున్నారు. వైసీపీ నుంచి ఆదినారాయణ రెడ్డి ఫిరాయించి మంత్రి పదవి పొందడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా తయారైంది వ్యవహారం. పార్టీలోకి కొత్తగా వచ్చిన కోడిపిల్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం రామసుబ్బారెడ్డి వర్గీయులకు ససేమిరా నచ్చలేదు. దీంతో ఒకానొక సమయంలో రామసుబ్బారెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. రామసుబ్బారెడ్డిని నిలువరించేందుకు ఆర్టీసీ ఛైర్మెన్ పదవి ఎరచూపినప్పటికీ అందుకు నో చెప్పారు. ఆ తర్వాత రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవితో పాటు ప్రభుత్వ విప్ పదవి అదనంగా ఇచ్చారు చంద్రబాబు.

ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య రాజీ ఫార్ములా

ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య రాజీ ఫార్ములా

ఇక ఇద్దరినీ సంతృప్తిపరచేందుకు రాజకీయ ఎత్తుగడ వారిపై ప్రయోగించారు చంద్రబాబు. ఇదరిలో అంటే ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిలలో ఒకరిని కడప లోక్‌సభ స్థానంకు పోటీచేయించి మరొకరిని జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయించే యోచనలో ఉన్నారు. అయితే లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసేందుకు ఇద్దరు నేతలు విముఖత చూపుతున్నట్లు సమాచారం. మళ్లీ ఇక్కడ చంద్రబాబకు మరో తలనొప్పి తయారైంది. ఇద్దరూ అసెంబ్లీ స్థానానికే పోటీచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ లోక్‌సభ స్థానానికి పోటీచేస్తే గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నది వీరి అంచనా. మరోవైపు జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం పోటీ ఎవరికిచ్చినా మరో వర్గం క్యాడర్ మాత్రం సహకరించే పరిస్థితి వాస్తవానికి కనిపించడం లేదు. బయటకు భాయీ భాయీ అని చెబుతున్నప్పటికీ... ఇరు వర్గాలు మాత్రం రాజీకి వచ్చినట్లు కనిపించడం లేదు.

కడప లోక్‌సభ స్థానంపై కన్నేసిన టీడీపీ

కడప లోక్‌సభ స్థానంపై కన్నేసిన టీడీపీ

అసెంబ్లీ స్థానాలు అటుంచితే.. కడప లోక్‌సభ స్థానంపై మాత్రం టీడీపీ కన్నేసింది. ఇక్కడ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇద్దరి నేతలను ఏకం చేస్తే గెలుపు సులభం అవుతుందని భావిస్తోంది. ఇందుకోసం అధినేత ప్రత్యేక దృష్టి సారించారు. నిజంగా ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు వైర్యం వీడి ఒక్కటయ్యారంటే గెలుపుపై టీడీపీ ఆశలు పెట్టుకోవచ్చు. లేకుంటే టీడీపీ కడప లోక్‌సభ సీటు కొట్టడం దాదాపు అసాధ్యమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఆదినారాయణ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ అదీ వైసీపీ క్యాడర్‌కు రుచించలేదు. ఇప్పటికీ ఆ క్యాడర్ జగన్‌ వైపే ఉందని గ్రౌండ్ రియాల్టీ చూస్తే అర్థమవుతోంది. గత ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి చుట్టూ తిరిగిన క్యాడర్ ఇప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ ఎంవీ సుధీర్ రెడ్డి వెంట నడుస్తోంది. అంటే ఇది ఆదినారాయణ రెడ్డికి మైనస్‌గానే భావిస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు.

జమ్మలమడుగులో సత్తాచాటుతున్న సుధీర్ రెడ్డి

జమ్మలమడుగులో సత్తాచాటుతున్న సుధీర్ రెడ్డి

ఇక సుధీర్ రెడ్డి తనదైన పంథాలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా మండలాల్లో విస్తృత పర్యటనలు చేస్తూ తాను పదవిలోకి వస్తే చేసే అభివృద్ధి పనులపై ప్రజలకు వివరిస్తున్నాడు. సుధీర్ రెడ్డి వెంట క్యాడర్ ఉండటం తనకు అదనపు బలం అని అదే ఆదినారాయణ రెడ్డికి మైనస్ అని చెబుతున్నారు సుధీర్ రెడ్డి. ఇన్ని ఈక్వేషన్స్ మధ్య జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి టీడీపీ నుంచి ఎవరు పోటీచేస్తారు..? ఒకవేళ పోటీచేస్తే మరో వర్గం సహకరించే పరిస్థితి కనిపిస్తుందా... ఇలా కడప లోక్ సభ స్థానం టీడీపీ గెలవాలంటే ముందు జమ్మలమడుగు పంచాయితీ చంద్రబాబు తెంచాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకరు పోటీ చేస్తే మరో వర్గం క్యాడర్ సహకరిస్తుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

English summary
TDP chief and AP CM Chandra babu Naidu has focused on Kadapa parliamentary constituency. In this backdrop the TDP chief had succeded in bringing the two rivalries of Jammalamadugu constituency on to a single platform. According to sources Chandrababu said that one among Minister Adinarayana Reddy and Ramasubba reddy would be given the Kadapa loksabha ticket and the other would be allowed to contest from Jammalamadugu assembly constituency. But the question here is will this work out for Chandra babu as both leaders are eyeing on Jammalamadugu assembly constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X