• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ కళ్యాణ్ జగన్ బాధితుడయ్యాడు, ఆయనపై కక్ష అందుకేగా : వకీల్ సాబ్ కు మద్దతుగా చంద్రబాబు

|

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అధికార పార్టీ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు . తిరుపతి లో వైసీపీ ని ఎందుకు గెలిపించాలని ప్రశ్నిస్తున్నారు. 25 ఎంపీ స్థానాలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామని, అధికారంలోకి వచ్చి రెండు ఏళ్ళు అవుతున్నా జగన్ దానిపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి ఆర్థిక మూలాలపై దెబ్బతీస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తాజాగా ఆ జాబితాలో పవన్ కళ్యాణ్ కూడా చేరారన్నారు . వైసీపీని ఎందుకు గెలిపించాలో ఒక్క కారణం చెప్పాలన్నారు.

టిడిపిని గెలిపించాలని కోరేందుకు తాను తిరుపతికి రాలేదన్న చంద్రబాబు , ఎందుకు వచ్చారో తెలుసా !!టిడిపిని గెలిపించాలని కోరేందుకు తాను తిరుపతికి రాలేదన్న చంద్రబాబు , ఎందుకు వచ్చారో తెలుసా !!

 తిరుపతిలో ఒక్క చోట గెలిస్తే టీడీపీకి ఏమొస్తుంది

తిరుపతిలో ఒక్క చోట గెలిస్తే టీడీపీకి ఏమొస్తుంది

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని పొదలకూరు లో రోడ్ షో లో బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు ఇరవై రెండు నెలలు జగన్ పాలన పై విరుచుకుపడ్డారు. తిరుపతి ఒకటి గెలిస్తే టిడిపికి ఏమొస్తుంది వైసిపిలో ఏం జరుగుతుంది అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి వచ్చానన్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకుపడిన చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మాట్లాడారు .

 పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన జగన్ వి కక్ష సాధింపు చర్యలు

పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన జగన్ వి కక్ష సాధింపు చర్యలు

ప్రభుత్వం పై విమర్శిస్తున్నారని పవన్ కళ్యాణ్ పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు . రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందన్న చంద్రబాబు తాజాగా పవన్ కూడా జగన్ బాధితుడయ్యాడని సంచలన కామెంట్స్ చేశారు. పెద్ద హీరోల సినిమాలు విడుదల సందర్భంగా ప్రత్యేక షోలు వేసుకోవడం రిలీజైన తొలి రోజుల్లో ధరలు పెంచుకోవడం ఆనవాయితీ అని కానీ పవన్ సినిమాకు ఆ అవకాశం ఇవ్వకుండా ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగారని చంద్రబాబు విరుచుకుపడ్డారు.

మీ అరాచకాలను ప్రశ్నిస్తున్నారనేగా పవన్ కళ్యాణ్ పై మీ వేధింపులు

మీ అరాచకాలను ప్రశ్నిస్తున్నారనేగా పవన్ కళ్యాణ్ పై మీ వేధింపులు

మీ అరాచకాలను ప్రశ్నిస్తున్నారనేగా పవన్ కళ్యాణ్ పై మీ వేధింపులు అంటూ చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు . ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం కూడా లేదా ? ఇంకా ఎంతకాలం ఈ దుర్మార్గం ? అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడిన చంద్రబాబు నాయుడు ఈ దుర్మార్గాలు తగ్గాలంటే తిరుపతి ఉప ఎన్నికల్లో టిడిపిని గెలిపించటం ఒక్కటే మార్గం అంటూ పేర్కొన్నారు.

ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీసే పులివెందుల రాజకీయం ఊరూరా పాకుతోంది అన్న చంద్రబాబు జగన్ కక్ష సాధింపుల జాబితాలో తాజాగా పవన్ కళ్యాణ్ కూడా చేరారని , జగన్ ప్రభుత్వం కావాలని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు.

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి ఎందుకు ఓటు వెయ్యాలో జగన్ సమాధానం చెప్పాలి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి ఎందుకు ఓటు వెయ్యాలో జగన్ సమాధానం చెప్పాలి

రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదన్న రాక్షసత్వం రాజ్యమేలుతుందని పేర్కొన్న చంద్రబాబు తన వాళ్లను కాపాడుకోవడం కోసమే పరిషత్ ఎన్నికలను బహిష్కరించామని పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికలకి వెళ్లి కార్యకర్తలను పోగొట్టుకోవడం లేదా వారిని కష్టపెట్టడం ఇష్టం లేకనే ఎన్నికలను బహిష్కరించానని అన్నారు చంద్రబాబు.

జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలు అయిందని, అప్పుల పాలైందని , ధరలు ఆకాశాన్నంటుతున్నాయి అని నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి ఎందుకు ఓటు వెయ్యాలో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు .

ఎవరు బాగా పరిపాలించారో ప్రజలు కూల్ గా ఆలోచించాలి

ఎవరు బాగా పరిపాలించారో ప్రజలు కూల్ గా ఆలోచించాలి

ప్రత్యేక హోదా లేని రాష్ట్రంగా ఏపీ నష్టపోతుందని పేర్కొన్న చంద్రబాబు , మోసం చేసిన జగన్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా అంటూ ప్రశ్నించారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జగన్ మాట్లాడే ధైర్యం చేయలేదని చంద్రబాబు విమర్శించారు. ఏం చేశారని వైసీపీకి ఓటు వేయాలని ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీలను పరిష్కరించే బాధ్యత లేదా అని నిలదీసిన చంద్రబాబు, నాకంటే బాగా చేస్తాడు అని భావించే ప్రజలు జగన్ కు ఓటు వేశారు . ఎవరు బాగా పరిపాలించారో ప్రజలు సావధానంగా ఆలోచించాలి అంటూ పేర్కొన్నారు.

 రేపటి నుండి ప్రతి విషయంలోనూ పన్నులు వేస్తారు జాగ్రత్త

రేపటి నుండి ప్రతి విషయంలోనూ పన్నులు వేస్తారు జాగ్రత్త

రేపటి నుండి ప్రతి విషయంలోనూ పన్నులు వేస్తారు అంటూ జగన్ సర్కార్ ను టార్గెట్ చేసి విమర్శించారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి భారీగా ధరలు పెంచి ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా రాష్ట్రంలో కొత్త బ్రాండ్లు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో ఉచితంగా ఇసుకను ఇస్తే, ఇప్పుడు ఇసుక ధరకు రెక్కలు వచ్చాయని మండిపడ్డారు. ప్రజల చూస్తూ ఊరుకుంటే ప్రభుత్వ ఆస్తులు కాదు ప్రజల ఆస్తులు కబ్జా చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో టిడిపికి ఓటు వేసి వైసిపి అరాచక పాలన కు చరమగీతం పాడారు. ఇదే సమయంలో బిజెపికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.

English summary
The Tirupati Parliament by-election campaign is in full swing. Opposition TDP leader Chandrababu Naidu has outraged on the ruling party. They are questioning why the YCP should win in Tirupati. Jagan, who has been in power for two years after coming to power, is debating why he is not talking about it. They are questioning the government and causing serious trouble by damaging their financial sources. Recently, Pawan Kalyan has also joined the list. I want to say one reason why YCP won.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X