వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేడిన్ఆంధ్ర.. ఇంటర్నేషనల్: బాబుకి హామీ(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మేడిన్ ఆంధ్రకు అంతర్జాతీయ ముద్ర తీసుకు వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. తద్వారా ఏపీ ఉత్పత్తులు అంతర్జాతీయ హంగులు అందుకోనున్నాయి. డ్వాక్రా ఉత్పత్తులకు అమెరికా చిల్లర విక్రయ దిగ్గజం వాల్ మార్ట్ బ్రాండ్ సొబగులు అద్దనుంది.

కోనసీమ కొబ్బరి నీళ్లను అంతర్జాతీయ శీతల పానియాల సంస్థ పెప్సికో మార్కెట్ చేయనుంది. ఆంధ్రా ఉత్పత్తులకు ఇలా అంతర్జాతీయంగా పట్టం కట్టేందుకు దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ఈ ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ముందుకు వచ్చాయి.

వీరితో పాటు పలువురు కార్పోరేట్, వాణిజ్య రంగాల ప్రముఖులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమై వారి నుండి ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన సహాయ, సహకారాలను రాబట్టారు. చంద్రబాబు విప్రో చీఫ్ అజీమ్ ప్రేమ్ జీ, పెప్సికో ఇంద్రానూయి తదితరులతో భేటీ అయ్యారు.

 మేడిన్ ఆంధ్రా

మేడిన్ ఆంధ్రా

ఆంధ్రప్రదేశ్‌లో తయారైన ఉత్పత్తులకు బ్రాండింగ్‌ కల్పించి, విక్రయించేందుకు అంతర్జాతీయ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది.

 మేడిన్ ఆంధ్రా

మేడిన్ ఆంధ్రా

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్న సీఎం చంద్రబాబు బుధవారం వాల్‌మార్ట్‌ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌-సీఈవో డేవిడ్‌ ఛీజ్‌రైట్‌తో సమావేశమయ్యారు.

మేడిన్ ఆంధ్రా

మేడిన్ ఆంధ్రా

ఈ సందర్భంగా వాల్‌మార్ట్‌ అధినేత ఏపీలో మరిన్ని రిటైల్‌ స్టోర్లను ఏర్పాటు చేస్తామని బాబుకు హామీ ఇచ్చారు. ఈ సంద్భంగా వాల్‌మార్ట్‌ చీఫ్‌ మాట్లాడారు.

 మేడిన్ ఆంధ్రా

మేడిన్ ఆంధ్రా

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతోసహా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ కింద రాష్ట్రాభివృద్ధికి చేయూతనందిస్తామన్నారు.

 మేడిన్ ఆంధ్రా

మేడిన్ ఆంధ్రా

వేరుశెనగ, జీడిమామిడి, కొబ్బరి, జొన్న, చిరుధాన్యాలు, పండ్లు, అరటి, మామిడి, నిమ్మ, కోడిగుడ్లు, పాల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్‌ కల్పించడం ద్వారా రైతులకు సహకరించేందుకు వాల్‌మార్ట్‌ అంగీకరించింది.

 మేడిన్ ఆంధ్రా

మేడిన్ ఆంధ్రా

రాష్ట్రంలో డ్వాక్రా మహిళా సంఘాలు తయారు చేసే 100 ఉత్పత్తులకు బ్రాండింగ్‌ చేయడంతో పాటు, మార్కెటింగ్‌ సౌకర్యాలూ కల్పిస్తామని వాల్ మార్ట్ తెలిపింది. స్థానిక చిన్న, సన్నకారు రైతుల నుంచి వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేసి, వాటికి బ్రాండింగ్‌ చేసి విక్రయిస్తామంది.

 మేడిన్ ఆంధ్రా

మేడిన్ ఆంధ్రా

ఈ ఏడాది ఏప్రిల్‌లో తాము ఈ అంశంపై చర్చించేందుకు ఏపీకి రానున్నట్లు వాల్‌మార్ట్‌ అధిపతి స్పష్టం చేశారు. కాగా, ఏపీ నుంచి భారీ ఎత్తున వ్యవసాయోత్పత్తుల కొనుగోలు చేసేందుకు పెప్సికో సంసిద్ధత వ్యక్తం చేసింది.

 మేడిన్ ఆంధ్రా

మేడిన్ ఆంధ్రా

దావోస్‌ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సీఎం చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం పెప్సికో సీఈవో ఇంద్రనూయితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ కోనసీమ ప్రాంతంలో విరివిగా పండించే కొబ్బరి పంటపై ప్రధానంగా పెప్సికో దృష్టి సారించింది. కొబ్బరి నీళ్లను ప్యాకేజి విధానంలో విక్రయించాలని పెప్సికో భావిస్తోందని ఇంద్రనూయి వివరించారు.

 మేడిన్ ఆంధ్రా

మేడిన్ ఆంధ్రా

అలాగే ఏపీ నుంచి జొన్న, బొప్పాయి, అరటి వంటి వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేస్తామని పెప్సికో సీఈవో హామీ ఇచ్చారు. 250 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల మామిడి పంటను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇంద్రనూయి వివరించారు.

మేడిన్ ఆంధ్రా

మేడిన్ ఆంధ్రా

మామిడి గుజ్జు పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావాలని చంద్రబాబు కోరగా, సానుకూలంగా స్పందించారు. మార్చిలో ఏపీకి వస్తామని చెప్పారు. దావోస్‌లో విప్రో అధిపతులు అజీమ్‌ ప్రేమ్‌ జీ, రిషద్‌ ప్రేమ్‌ జీలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎస్‌ఆర్‌ కింద ఏపీలో వాటర్‌ ప్లాంట్లు, వైద్య వసతుల కల్పనకు సహకరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

 మేడిన్ ఆంధ్రా

మేడిన్ ఆంధ్రా

విశాఖను డిజిటల్‌ సిటీగా అభివృద్ధి చేస్తామని, అజీమ్‌ప్రేమ్‌జీ హామీ ఇచ్చారు. ఏపీ సర్కార్‌తో కలిసి ఈ-గవర్నెన్స్‌ను అభివృద్ధి చేసేందుకు విప్రో అంగీకరించింది.

 మేడిన్ ఆంధ్రా

మేడిన్ ఆంధ్రా

అనంతపురం జిల్లా హిందూపురంలో సంతూర్‌ సోప్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రేమ్‌జీ తెలిపారు. కాగా, ఇన్వెస్టర్ల అవసరాలు తీర్చేవిధంగా ఉన్న పంజాబ్‌ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని పరిశీలించాలని సీఎంకు హీరో మోటోకార్ప్‌ జేఎండీ సునీల్‌ కాంత్‌ ముంజాల్‌ సూచించారు.

 మేడిన్ ఆంధ్రా

మేడిన్ ఆంధ్రా

శ్రీసిటీ సెజ్‌లో నెలకొల్పనున్న హీరో మోటో కార్ప్‌ను త్వరితగతిన రికార్డు సమయంలో పూర్తి చేస్తామని వివరించారు. పెట్టుబడిదారులకు ఏపీ భారీ అవకాశాలు కల్పిస్తోందని చంద్రబాబు తెలిపారు.

మేడిన్ ఆంధ్రా

మేడిన్ ఆంధ్రా

ఏపీ కొత్త రాష్ట్రమని.. పెట్టుబడి దారులు వినియోగించుకోవాల్సింత మేర అవకాశాలున్నాయని చంద్రబాబు వివరించారు. తాము చేపట్టే కార్యక్రమాలకు ఏపీని పైలట్‌ రాష్ట్రంగా ఎంచుకునేందుకు గ్లోబల్‌ ఎజెండా కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఫోరం ముందుకు వచ్చింది.

English summary
AP Chief Minister Chandrababu Naidu, who is currently in Davos to attend the annual summit of the World Economic Forum (WEF), met Wipro Chairman Azim Premji, Wal Mart International President, David Cheesewright and Pepsico CEO Indra Nooyi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X