విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

న్యాయవ్యవస్థలో చంద్రబాబు జోక్యం.. సుప్రీంకోర్టు సీజేఐకు సీఎం జగన్ లేఖ: అజయ్ కల్లాం

|
Google Oneindia TeluguNews

అమరావతి భూ కుంభకోణంపై వస్తోన్న కథనాలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జరుగుతోన్న ప్రచారానికి పుల్‌స్టాప్‌ పెట్టేందుకు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నది. ఈ మేరకు శనివారం రాత్రి ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం మీడియాకు వివరాలు వెల్లడించారు.

అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు జడ్జీ జస్టిస్‌ సోమయాజులు స్టే ఇచ్చారని అజయ్ కల్లాం తెలిపారు. మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ కేసులో హైకోర్టు ఏకంగా గాగ్‌ ఆర్డర్‌ ఇచ్చిందని తెలిపారు. ఈ కేసులో సుప్రీంకోర్టు జడ్జీ జస్టిస్‌ ఎన్‌వీ రమణ జోక్యం చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్నా. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ ఏ బాబ్డేకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

 chandrababu Interference to amaravati scam: ajay kallam

ఇందుకు సంబంధించి ఆధారాలను సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు అక్టోబర్‌ 8న లేఖ అందజేశామని తెలిపారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన సర్వోన్నత న్యాయస్థానం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జీని అడ్డు పెట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు న్యాయవ్యవస్థను ఎంచుకున్నారని చెప్పారు.

Recommended Video

Ys Jagan కంప్లైంట్ To SC Chief Justice Bobde Against Andhra HC,SC Judge NV Ramana | Oneindia Telugu

జనవరిలో అధికార వికేంద్రీకరణ బిల్లులను..ఏపీ అసెంబ్లీ ఆమోదించిందని తెలిపారు. ఆ వెంటనే ముఖ్యమంత్రిని ప్రతివాదిగా చేస్తూ హైకోర్టులో 30 పిటిషన్లు దాఖలయ్యాయని పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరీని సుప్రీంకోర్టు జడ్జీ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని వెల్లడించారు. సుప్రీంకోర్టు జడ్జీ ఎన్వీ రమణ జోక్యం తర్వాత హైకోర్టులో పరిణామాలు మారిపోయాయని చెప్పారు. చంద్రబాబు కోరుకున్నట్టు ముఖ్యమైన కేసులను జస్టిస్‌ శేషసాయి, జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి, జస్టిస్‌ సోమయాజులు, జస్టిస్‌ రమేష్‌ బెంచ్‌కు మారిపోయాయని పేర్కొన్నారు.

English summary
tdp chief chandrababu naidu Interference to amaravati scam ap principal advisor ajay kallam said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X